Skip to main content

డిసెంబర్ 25 నుంచి ఎంబీబీఎస్ మూడో విడత కౌన్సెలింగ్

లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు డిసెంబర్ 25వ తేదీ నుంచి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, ఆయా కళాశాలల్లో చేరని అభ్యర్థుల వివరాలను వర్సిటీ వెల్లడించింది. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన 175 సీట్లకు చేపట్టిన కౌన్సెలింగ్‌లో సీట్లన్నీ భర్తీ కాగా, వారంతా డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా తాము సీట్లు పొందిన వైద్య కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే 115 మంది రిపోర్టు చేయకపోవడంతో ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని, డిసెంబర్ 25వ తేదీన వాటికి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Published date : 25 Dec 2020 03:32PM

Photo Stories