Skip to main content

బోధనాసుపత్రుల్లో 97 మంది వైద్యులకు పోస్టింగ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో 97 మంది వైద్య నిపుణులకు కొత్తగా నియామక ఉత్తర్వులిచ్చారు.
వీరంతా ఇటీవల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై న వైద్యులు. బోధనాసుపత్రుల్లో మొత్తం 166 వైద్యుల పోస్టులకు నియామక ప్రకటన వెలువరించగా.. ఇందులో 109 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పోస్టింగ్ కోసం సోమవారం నియామక ప్రక్రియ నిర్వహించగా.. 10 మంది హాజరు కాలేదు. ఇద్దరు ఆసుపత్రులను ఎంపిక చేసుకోలేదు. దీంతో మిగిలిన 97 మందికి పోస్టింగులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మిగిలిన వారికి కూడా త్వరలోనే మరోసారి నియామక ప్రక్రియ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని వైద్య వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోధనాసుపత్రుల్లో సేవలందించేందుకు ప్రభుత్వం మొత్తం 534 పోస్టులను నేరుగా నియమించడానికి వీలుగా మంజూరు చేయగా.. అందులో 347 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశారు. మిగిలిన 187 పోస్టులు, నల్లగొండ, సూర్యాపేట వైద్య కళాశాలలకు మంజూరైన సుమారు 124 పోస్టులను కలిపి త్వరలో భర్తీ చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
Published date : 08 Dec 2020 04:29PM

Photo Stories