అగ్రి వర్సిటీలో రైతు కోటా సీట్లకు నోటిఫికేషన్
Sakshi Education
రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నా లజీ కోర్సుకు సంబంధించి రైతుల కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) 18 సీట్లు, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) 18 సీట్లను టీఎస్ ఎం సెట్ ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్‌లకు అనుగుణంగా సీట్ల భర్తీ జరుగుతుం దని వివరించారు. రైతు కోటాలో సీటు పొందేందుకు అభ్యర్థి కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతంలో (ఫామ్-1) విద్యాభ్యాసం చేసి ఉండాలని, కనీసం ఎకరం భూమిని (ఫామ్-2) తల్లి/తండ్రి లేదా అభ్యర్థి పేరు మీద కలిగి ఉండాలని వెల్ల డించారు. మరిన్ని వివరాలకు www.pjtrau.edu.in లో చూడాలని కోరారు.
Published date : 17 Oct 2020 03:07PM