453 మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసేందుకు 453 సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.వినోద్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను https://dmeaponline.com కు పంపాలని సూచించారు. రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ వివరాలు hm@fw.ap.gov.in,cfw.ap.nic.in వెబ్‌సైట్‌లలో చూడొచ్చని తెలిపారు.
చదవండి: ఆన్‌లైన్ క్లాసులతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి
చదవండి: ఆన్‌లైన్ క్లాసులతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలి
Published date : 14 Jun 2021 07:29PM