223సివిల్ సర్జన్ నియామకాల్లో85 బీసీ అభ్యర్థులకే
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇటీవల వైద్య విధాన పరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసేందుకు జరిపిన సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ నియామకాల్లో బీసీ అభ్యర్థులు ఎక్కువ మంది ఉద్యోగాలు దక్కించుకున్నారు.
మొత్తం 223 పోస్టులను భర్తీ చేయగా.. అందులో బీసీ అభ్యర్థులే 85 మంది ఉన్నట్టు తేలింది. అన్ రిజర్వ్‌డ్ లేదా ఓపెన్ కేటగిరీలో 65 ఖాళీలు భర్తీ చేయగా.. 45 మంది ఎస్సీ అభ్యర్థులే ఉన్నారు. మిగిలిన పోస్టులను త్వరలోనే భర్తీ చేపట్టనున్నారు.
Published date : 11 Jan 2021 01:43PM