Skip to main content

Prepositions

ఇది  చాలా  ముఖ్యమైన  topic. ఎందుకంటే, Telugu విభక్తుల్ని English Prepositionsతో సమానంగా  వాడుతారు. విభక్తులు nouns తర్వాత వస్తాయి.
 Prepositions nounsకి ముందు వస్తాయి. అందుకే  వాటిని ఞట్ఛ-(ముందు వచ్చేవి) positions అంటాము. 
 Telugu విభక్తులు Post-positions (అంటే  Nouns తర్వాత వచ్చేవి). Prepositions వాడేటప్పుడు మాతృభాషలో ఆలోచించకూడదు. చాలాసార్లు వాటికి ఇంగ్లిష్ భాషతో సారూప్యం ఉండదు.
ఉదాహరణకు
WHICH IS CORRECT?

  1. He went to market by walk.
  2. He went to market on foot.
  
''He went to market on foot''., is correct
ఈ సందర్భంలో చాలామంది మాతృభాషలో ఆలోచిస్తూ "by walk' అని పొరపాటున ఉపయోగిస్తుంటారు. కానీ ఇంగ్లిష్‌లో ’on foot’ సరైన expression. అయితే కారులో వెళ్లాడు, బస్సులో వెళ్లాడు అని చెప్పే సందర్భంలో by car, by bus అని ఉపయోగించవచ్చు.  
"below'', "beneath'', ''under'' అంటే తెలుగులో ‘కింద’ అనే అర్థమే వస్తుంది. "Above', "On'లకు పైన / మీద అనే అర్థాలు వస్తాయి. అలాగే with, byలకు ‘తో’ అనే అర్థమే వస్తుంది. తెలుగులో ఆలోచిస్తూ, అనువదిస్తూ ఈ పదాలను అర్థం చేసుకోలేం. సందర్భాన్ని బట్టి మాత్రమే  ఇంగ్లిష్‌లో ఆయా Prepositionsను ఉపయోగించాలి. అందుకే, పోటీ పరీక్షల్లో  Prepositions మీద  ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. 
 
PREPOSITIONS  కొన్ని రకాలు ఉన్నాయి. అవి:
  1. Simple Prepositions
  2. Prepositional phrases
  3. Verb dependent Prepositions
  4. Phrasal Verbs
వీటి గురించి మనం ఒకొక్కటిగా తెలుసుకుందాం:
 
SIMPLE PREPOSITIONS
ఈ  కింది చిత్రాలను  చూడండి: (Positional Prepositions)
   
These positional prepositions can be learnt easily.
Above × Below [Please note in above and below, the surface is not touched. అంటే  పైన  తగలకుండా ఉండే position   'Above ', కింద  తగలకుండా  ఉండేది  'Below' తగిలితే  'On ', తగలకుండా కింద  ఉంటే "Under ". Line పక్కనే వెళ్తే 'Along '. [He walked along the road.] ఇటుపక్క నుంచి  అటుపక్కకు  దూకినట్లు  వెళ్లితే  'Over '. ఒకదాని ద్వారా వెళ్తే 'Through' or 'Across '.
మరి  Beneathని ఎట్లా  వాడతాం?
Below అంటే కింద ఉన్నది అని అర్థం. Beneathను రెండు మూడు  రకాలుగా వాడతాం.
 i) పొరలు లేక  levels అనే  అర్థంలో. Water is found beneath the rock layer in this area. 
 ii) అంతస్థు (సాంఘిక) అనే అర్థంలో కూడా వాడతారు.
 Eg. She married beneath her. (ఆమె కంటే తక్కువ స్థాయి అతణ్ణి పెళ్లి చేసుకుంది).
 Eg. Mamata talked in a vulgar way, beneath the position of a CM. [ముఖ్యమంత్రి స్థాయి కంటే  దిగజారి మాట్లాడింది.]
 
Simple Prepositions:
Between - Among
  1. ఇద్దరి మధ్య అయితే between వాడతాం.
  2. Among ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే వాడతాం.
 Eg. Seats were shared between the two parties. 
       The ministers were picked up from among the members of the NDA.
        The war between Iraq and US, UK and other allies ended dramatically.
        ఇక్కడ  రెండు  పార్టీలుగా  తీసుకున్నాం.

To - Towards
   1. To  ఒక  గమ్యానికి  వాడతాం.
   2. Towards ఒక దిశకు వాడతాం.
 Eg. He went to Delhi. (destination)
       He went towards Delhi. (In that direction)

With - By
   1. withని  ఒక  ఆయుధంతో  గానీ  లేదా  పనిముట్టు (instrument)తో  గానీ  వాడతాం.
   2. Byని  ఒక  వ్యక్తి (agent)తో  వాడతాం.
 Eg. He was killed with a gun by his political rival.

Along - Across 
       Alongని  ఒడ్డు/అంచు వెంటే  అనే  అర్థంలో  వాడతాం.
 Eg. (i)  He walked along the beach road.
       (ii) He swam along the river course.
       [నదీ  ప్రవాహంతో  పాటు  ఈదాడు.]
       Across అనేది ఇటు నించి అటు అనే అర్థంలో  వాడుతాం.
 Eg. (i)  He went across the road to buy an ice cream.
       (ii) It is said that Lal Bahadur Sastri used to swim across the Ganga to attend school.

From - To - Between
      From తో To వాడాలి.
 Eg. He worked from 2012 to 2019. 
       Some people teach from morning to evening. 
      Between ఏదైనా  రెండు  మొత్తాల  గురించి  కానీ , రెండు సమయాల గురించి మాట్లాడేటప్పుడు  వాడతాం.
Between తో and కూడా  వాడాలి.
Eg. (i)  His salary ranges between Rs 1.5 lakhs and Rs 2.00 lakhs.
      (ii) The crime must have taken place between 2.00 am and 3.00 am. 

via: గుండా అని  అర్థం
 Eg: (i)  I will go to Vijayawada via Miryalaguda.
       (ii) You can go to Banjara Hills either via Punjagutta or via Vijayanagar Colony X roads.

In - During
    In ఒక  టైములో  వుండే  దాని  గురించి  చెప్తాము.
 Eg: He went there in February.
       During అనేది  ఒక  పీరియడ్  స్రమయంలో  జరిగేదాని  గురించి  మాట్లాడేటప్పుడు  వాడతాం.
 Eg. During Sravan month, Hindu ladies perform a number of religious rituals. 

For - Since 
      For అనేది ఒక  periodకి  వాడతాం.
 Eg: I have lived in Tarnaka for 50 years. 
       Since అనేది point of time చెప్పేటప్పుడు  వాడతాము.
 Eg:  I have been living in Tarnaka since 1969.

Beside - Besides
   1. Beside అంటే by the side of [పక్కన]. 
   2. Besides అంటే  in addition to.
 Eg. (i)  My house is beside Andhra Bank.
        (ii) Besides cricket, he also plays football well.

We will discuss some more prepositions and tricky prepositions in the coming issues.
Published date : 25 Jun 2019 11:51AM

Photo Stories