ఉస్మానియా వర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 6 పీజీ డిప్లొమా సాయంకాలం (6 నుంచి 8 గం. వరకు) కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేశారు.
న్యాయశాస్త్రంలో పీజీ డిప్లొమా నోటిఫికేషన్
ఏడాది కాల వ్యవధితో 2సెమిస్టర్ పరీక్షలు గల ఈ పీజీ డిప్లొమా ప్రవేశాలకు 2022, జనవరి 2న ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికోసం అక్టోబర్ 11 నుంచి నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీ క్యాంపస్‌లో కాలేజీతోపాటు బషీర్‌బాగ్ పీజీ న్యాయ కళాశాలలో సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్, ఇన్ సాల్‌వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్), మోడ్రన్ కార్పొరేట్ లా, అప్లైడ్ హ్యూమన్ రైట్స్ పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కనీ్వనర్ అపర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు 81066 78887కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.