DSCDO Kanniyakumari: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఆమె జూలై 30న సాయంత్రం 8గంటలకు మండల కేంద్రంలోని బాలికల, బాలుర వసతిగృహాలను తనిఖీ చేశారు. వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని భోజన సిబ్బందిని హెచ్చరించారు. వర్షాలు అధికంగా ఉన్నందు వల్లన విద్యార్థులను బయటకు పంపించవద్దని వార్డెన్‌కు చెప్పారు.
ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వార్డెన్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని అన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. బాలుర వసతిగృహ అసంపూర్తి ప్రహరీని త్వరలోనే నిర్మించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో వసతిగృహాల వార్డెన్‌లు వెంకటేష్, అనిత, సిబ్బంది మహదేవ్, లత, తిరుపతమ్మ, వెంకటయ్య పాల్గొన్నారు.
చదవండి: విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలి
ఎస్సీ హాస్టల్ తనిఖీ
ఊట్కూర్: స్థానిక ఎస్సీ వసతిగృహాన్ని జూలై 30న రాత్రి అధికారి కన్యాకుమారి సందర్శించారు. హాస్టల్‌లో పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. వంటగది, స్టోర్‌లో సరుకులను, కూరగాయలను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ జగదీశ్వర్‌రెడ్డికి సూచించారు.
చదవండి: New AI Centres: కొత్త ఏఐ సెంటర్‌లకు దరఖాస్తుల ఆహ్వానం