Skip to main content

Health and Family Welfare: పిల్లలపై దృష్టి పెట్టాలి

ఏటూరునాగారం: బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలపై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ, తెలంగాణ కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ స్పెషల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, డబ్ల్యూహెచ్‌ఓ సర్వీలెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రశాంత్‌లు అన్నారు.
Health and Family Welfare
పిల్లలపై దృష్టి పెట్టాలి

మండల కేంద్రంలోని రామాలయం వద్ద సబ్‌సెంటర్‌, ఆ పరిధిలోని ఇంటింటా సర్వేలను వారు అక్టోబ‌ర్ 10న‌ చేపట్టారు. గర్భిణులు, బాలింతల ఇళ్లకు వెళ్లి చిన్నారులకు వేస్తున్న టీకాలు, ఆరోగ్య సూత్రాలపై ఆరా తీశారు. చిన్నారులు బరువు, ఎత్తు తక్కువ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. రెండు రోజుల పాటు జిల్లాలో డబ్ల్యూహెచ్‌ఓ టీం పర్యటిస్తుందన్నారు. రొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లబ్ధిదారులు, టీకాలు, ఇంద్రధనుస్సు కార్యక్రమ వివరాలను డాక్టర్‌ అరుణ్‌కుమార్‌కు వివరించారు.

చదవండి: ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల బోధనలో మార్పులు 

ఉపకేంద్రంలో మిషన్‌ ఇంద్రధనస్సు ముందస్తు ప్రణాళికలు, టీకాలకు సంబంధించి, టీకాలు తీసుకోకుండా ఉన్నవారి వివరాలలు, టీకాలు పొందే వారి వివరాలను ఏఎన్‌ఎం గీతను అడిగి తెలుసుకున్నారు. తప్పిపోయి టీకాలు వేసుకోని వారిని గుర్తించడంలో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రణాళికలతో ముందుకు పోవాలని సూచించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న టీకాలు అన్ని సమయానుకూలంగా అందించి చి న్నారులను రక్షించాలన్నారు. అనంతరం రొయ్యూ రు ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న మిషన్‌ ఇంద్రధనుస్సు టీకా కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఏఎన్‌ఎం ఝాన్సీలక్ష్మి దగ్గర ఉన్న రికార్డులు, రిపోర్టులు తనిఖీ చేశారు.

టీకాలు చిన్నారులకు ఇవ్వడమే కాకుండా వెంటనే వాటిని రిజిస్టర్‌లో పొందుపరచాలని అలాగే యువిన్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ బిడ్డకు టీకా వేసే సమయంలో తప్పనిసరిగా ఏఎన్‌ఎంకు తెలియజేయాలని ప్రజలను కోరారు. అదే విధంగా మహిళల్లో వచ్చే సర్వికల్‌ కేన్సర్‌ నివారణకు వచ్చే ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్‌ వస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ మానిటరింగ్‌ అధికారి అరుణ్‌కుమార్‌ తెలిపారు. తొమ్మిదేళ్ల లోపు, 45 వయస్సు దాటిన వారికి వేసే విధంగా ఉంటుందని వివరించారు.

Published date : 11 Oct 2023 01:09PM

Photo Stories