Skip to main content

Educational Program: విద్యపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌

సోమ‌వారం చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో సీడీపీఓ రాంబాబు పాల్గొన్నారు. విద్య బాల‌ల హ‌క్క‌ని తెలుపుతూ వారికి విద్య‌పై అవ‌గాహ‌న‌ను పెంచుతూ ఇలా మాట్లాడారు.
CDPO Rambabu about education skill and awareness to students, Children's Right to Education
CDPO Rambabu about education skill and awareness to students

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్య బాలల హక్కని.. విద్యాహక్కును వినియోగించుకొని చదువులో రాణించాలని సీడీపీఓ రాంబాబు కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ మైనార్టీ బాలుర ఆశ్రమ పాఠశాలలో లోక్‌అదాలత్‌ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చట్టాల ప్రాముఖ్యత, అవగాహన విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

Student Education: శిక్ష‌ణ కాస్త శిక్ష‌గా మారింది

విద్యాహక్కు గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు డి.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రాథమికస్థాయిలోనే చట్టాల అవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్‌ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 13 Sep 2023 08:42AM

Photo Stories