Collectorate Meeting: విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం
సాక్షి ఎడ్యుకేషన్: బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా బడిలో ఉండాలని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లాలో 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారంతా బడిలోనే ఉండాలనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన మండలాల విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
MPHEO Transfers: వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆరోపణలు... కారణం?
అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మానవాభివృద్ధిని సూచించే అంశాలలో విద్యా, వైద్యం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి అడ్మిషన్లు కల్పించి చదువుకునే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకూ విద్యార్థుల డేటాను ఒకే చోట లభ్యమయ్యేలా ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇప్పటికే టెన్త్, ఇంటర్, ఐటీఐ ఫెయిలై మధ్యలో మానేసిన 4 వేల మందిని తిరిగి జాయిన్ చేయగా మిగిలిన 2 వేల మందిని ఈ నెల 25 లోగా జాయిన్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.