Skip to main content

సెట్విన్ ద్వారా ఉచిత ఉపాధి శిక్షణ

సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతీ యువకులకు సెట్విన్ సంస్థ ద్వారా మూడు, ఆరు నెలలు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఎన్.బాలాచారి ఫిబ్రవరి 6 (గురువారం)నఓ ప్రకటనలో తెలిపారు.
టెన్త్ పాస్/ఫెయిల్, ఇంటర్మీడియెట్ చదివిన ఆసక్తి గల బీసీ అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ఈ నెల 10 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ లేదా ఉస్మానియా యూనివర్సిటీలో లేదా 040-24071178, 040- 29568300, 6302427521 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.
Published date : 07 Feb 2020 02:42PM

Photo Stories