Skip to main content

సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.
మొత్తం 16,208 ఉద్యోగాలకు ప్రభుత్వం జనవరి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. అయితే దరఖాస్తు గడువును పొడిగించాలంటూ నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Published date : 01 Feb 2020 04:08PM

Photo Stories