Skip to main content

గురుకుల పోస్టులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ

సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సొసైటీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ బాలాచారి జనవరి 29 (బుధవారం)నఓ ప్రకటనలో తెలిపారు.
ఈ శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్‌లో తరగతులు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులు, మరిన్ని వివరాలకు studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో లేదా 040-24071178, 6302427521 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 30 Jan 2020 05:02PM

Photo Stories