Skip to main content

JNTU (A): జేఎన్‌టీయూ (ఏ) పరీక్షలు వాయిదా

అనంతపురం విద్య: జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో శుక్రవారం, శనివారం నిర్వహించాల్సిన సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేసినట్లు వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ఈ. కేశవరెడ్డి తెలిపారు.

తుపాను ప్రభావంతో పరీక్షలన్నీ రద్దు చేశామన్నారు. వాయిదాపడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

UPSC Exams: యూపీఎస్సీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు  

జేఎన్‌టీయూలో బదిలీలు 

జేఎన్‌టీయూ (ఏ)లో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ రిజి్రస్టార్‌ సి.శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటీపీఆర్‌ఐలో బయోటెక్నాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ అరుణను జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలకు బదిలీ చేశారు. జేఎన్‌టీయూ పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాల కెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్‌ శేష మహేశ్వరమ్మ అనంతపురం కెమిస్ట్రీ విభాగాధిపతిగా బదిలీ అయ్యారు. అలాగే, రిజి్రస్టార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న జీఎన్‌పీ ఆచారిని రెక్టార్‌ కార్యాలయానికి, పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాల సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి. శ్రీనివాసులును వీసీ పీఏగా, ప్రస్తుతం వీసీ పీఏగా ఉన్న సునీల్‌ కుమార్‌ను పులివెందుల కళాశాల సూపరింటెండెంట్‌గా, క్యాంపస్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న సాయి మనీ‹Ùని రిజి్రస్టార్‌ పీఏగా బదిలీ చేశారు.   

ఎడ్యుకేషన్‌ న్యూస్‌  ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 19 Nov 2021 03:51PM

Photo Stories