JEE Advanced: రాస్తున్నది తక్కువ.. ఉత్తీర్ణత ఇంకా తక్కువ
అడ్వాన్స్‌డ్ రాసేందుకు జేఈఈ మెయిన్స్ నుంచి 2.50 లక్షల మంది వరకు అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నా.. అందులో 60 శాతం మంది మాత్రమే ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్ష రాసిన వారిలోనూ ఉతీర్ణులవుతున్న వారు తక్కువగానే ఉంటున్నారు. ఇందులో కటాఫ్ మార్కులతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తగ్గుతూ వస్తోంది. జనరల్‌తో పాటు రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 ఫలితాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం ప్రశ్నల తీరు కఠినంగా ఉండటం వల్ల ఉత్తీర్ణత శాతం, కటాఫ్ మార్కులు తగ్గాయి.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
ఉత్తీర్ణత శాతం 2021లో 29.54 శాతం ఉండగా.. 2022లో 26.17 శాతంగా నమోదైంది. 2021తో పోల్చితే 2022లో క్వాలిఫైయింగ్ మార్కులను కూడా తగ్గించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 ప్రవేశ పరీక్షలో 1,55,538 మంది అభ్యర్థులలో 40,712 మంది ఉత్తీర్ణులయ్యారు. జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పంపేలా సంఖ్యను 2.50 లక్షలకు పెంచినా హాజరు శాతం తక్కువగానే ఉంటోంది. రెండేళ్ల పాటు కోవిడ్ ప్రభావం కారణంగా చదువులు సరిగా సాగకపోవడం కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం పెరగకపోవడానికి కారణంగా పేర్కొంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మహిళల హాజరు, ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగానే ఉంటోంది. అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరైన ఎస్సీ అభ్యర్థులు 31.67 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఎస్టీ అభ్యర్థులు 26.83 శాతం, ఓబీసీ అభ్యర్థులు 16.44 మంది అర్హత సాధించారు.
చదవండి: JEE Advanced 2023: కొత్త సిలబస్‌తో
ప్రత్యేక కోచింగ్ ఉంటేనే అర్హత మార్కులు
జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలు అత్యంత కఠినమైన ప్రశ్నలతో జరుగుతాయని.. వాటిలో అర్హత సాధించాలంటే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వల్ల విద్యార్థులు దాదాపు రెండేళ్లపాటు తరగతులకు దూరంగా ఉండటంతో వారిలో ఆయా తరగతులకు సంబంధించిన సామర్థ్యాలు దెబ్బతిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఎదుర్కొనలేకపోయారని విశ్లేషిస్తున్నారు. ఉత్తీర్ణత శాతం, కటాఫ్ మార్కులు తగ్గడానికి ఇవే కారణమంటున్నారు. ఐఐటీలలో ప్రవేశం పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలో అత్యధిక స్కోరు మార్కులు సాధించాల్సి ఉంటుంది. కోవిడ్ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను ప్రభావితం చేసిందని, ఈ ఇబ్బందులను అధిగమించడానికి కనీసం రెండేళ్లు పడుతుందని పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది కూడా ఉత్తీర్ణత శాతంలో తగ్గుదలే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
చదవండి: IIT: ఐఐటీలోనూ ఈ కోర్సుకే డిమాండ్
సంవత్సరం |
అడ్వాన్స్‌డ్‌కు అర్హులు |
హాజరు |
అర్హత |
మహిళా అర్హులు |
2022 |
2,10,251 |
1,55,538 |
40,712 |
6,516 |
2021 |
2,50,597 |
1,41,699 |
41,862 |
6,452 |
2020 |
2,50,681 |
1,50,838 |
43,204 |
6,707 |
2019 |
2,45,194 |
1,74,432 |
38,705 |
5,356 |
2018 |
2,31,024 |
1,65,656 |
31,988 |
4,179 |
2017 |
2,21,834 |
1,71,000 |
51,000 |
7,259 |
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కులు తగ్గుతున్న తీరు..
కేటగిరీ |
2022 |
2021 |
2020 |
2019 |
2018 |
2017 |
జనరల్ |
55 |
63 |
69 |
93 |
90 |
128 |
ఈడబ్ల్యూఎస్ |
50 |
56 |
62 |
83 |
81 |
115 |
ఓబీసీ |
50 |
56 |
62 |
83 |
45 |
64 |
ఎస్సీ |
28 |
31 |
34 |
46 |
45 |
64 |
ఎస్టీ |
28 |
31 |
34 |
46 |
45 |
64 |
పీడబ్ల్యూడీ |
28 |
31 |
34 |
46 |
45 |
64 |