NTA: జేఈఈ మెయిన్‌లో 100 స్కోర్ పాయింట్లు సాధించిన 20 మందీ వీరే ..
దేశవ్యాప్తంగా 20 మంది 100 స్కోర్ పాయింట్లు (100% పర్సంటైల్) సాధించగా.. ఆ 20 మందీ బాలురే కావడం గమనార్హం. 100 స్కోర్ పాయింట్లతో పాటు ఆ తర్వాత అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పరీక్షలకు హాజరైనవారేనని గణాంకాలు చెబుతున్నాయి. 2023 జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫిబ్రవరి 7న విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల ఆధారంగా స్కోర్ పాయింట్లతో ఈ ఫలితాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వావిలాలచి ద్విలాస్‌రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, ఎన్‌కే విశ్వజిత్, అభినీత్ మాజేటిలు 100 స్కోర్ పాయింట్లు సాధించిన వారి లో ఉన్నారు. జనరల్‌లో 14 మంది, ఓబీసీల్లో నలుగురు, జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు, ఎస్సీల్లో ఒకరు 100 స్కోర్ పాయింట్లు సాధించారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
బాలికల్లో టాప్ తెలుగు అమ్మాయిలే..
బాలికల విభాగం.. టాప్ టెన్‌లో 99.99 నుంచి 99.97 స్కోర్ పాయింట్లు సాధించిన పది మంది పేర్లను ఎన్‌టీఏ ప్రకటించింది. వారిలో టాప్‌లో మీసాల ప్రణీతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, మేథా భవానీ గిరీష్, సీమల వర్ష, అయ్యాలపు రితిక, పీలా తేజశ్రీ, వాకా శ్రీవర్షిత, గరిమా కల్రా, గున్‌వీన్ గిల్, వాణి గుప్తా ఉన్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలే అధికం కావడం విశేషం. ఇక కేటగిరీల వారీగా మంచి పర్సంటైల్ సాధించిన వారిలో ఓబీసీల్లో బావురుపూడి రితి్వక్, ఈడబ్ల్యూఎస్‌లో మల్పాని తుషార్, దుంపల ఫణీంద్రనాథరెడ్డి, పెందుర్తి నిశ్చల్ సుభాష్, ఎస్సీల్లో కొమరాపు వివేక్ వర్థన్, ఎస్టీల్లో ధీరావత్ తనూజ్, ఉద్యావత్ సాయి లిఖిత్, దివ్యాంగుల్లో బి.శశాంక్, తుమ్మల తిలోక్‌లున్నారు.
Also Read: JEE (MAIN & ADV.) - MODEL PAPERS | GUIDANCE | PREVIOUS PAPERS (JEE MAIN) | PREVIOUS PAPERS (JEE ADV.) | SYLLABUS | SYLLABUS (JEE ADV.) | NEWS | VIDEOS
రెండో విడత దరఖాస్తులకు మార్చి 7 చివరి తేదీ
జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మంగళవారం (ఫిబ్రవరి 7) నుంచి రిజి్రస్టేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. మార్చి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి నాలుగో వారంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు.
‘సెంచరీ’విద్యార్థులు వీరే..
తొలివిడత జేఈఈ మెయిన్‌లో 100 స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థులు.. గుల్షన్ కుమార్, ధ్యానేష్ హేమేంద్ర షిండే, దేషంక్ ప్రతాప్ సింగ్, సోహమ్‌దాస్, వావిలాల చిది్వలాస్ రెడ్డి, అపూర్వ సమోట, దుగ్గినేని వెంకట యుగేష్, గుత్తికొండ అభిరామ్, ఎన్‌కే విశ్వజిత్, నిపుణ్ గోయల్, రిషి కల్రా, మయాంక్ సోనీ, క్రిషి గుప్తా, సుతార్ హర్షుల్ సంజయ్ భాయ్, బిక్కిన అభినవ్ చౌదరి, అమోఘ్ జలాన్, అభినీత్ మాజేటి, ధ్రువ్ సంజయ్ జైన్, అషిక్ స్టెన్నీ, కౌషల్ విజయ్ వెర్గియా.