Skip to main content

JEE Mains 2023: మేథ్స్‌లో తిప్పలు... కెమిస్ట్రీలో స్కోర్‌..

సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్‌) తొలి రోజు జనవరి 24న దేశవ్యాప్తంగా జరిగింది.
Jee main 2023 session 1 engineering paper analysis
JEE Mains 2023: మేథ్స్‌లో తిప్పలు... కెమిస్ట్రీలో స్కోర్‌..

ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణలో 1.5 లక్షల మంది జేఈఈ మెయిన్స్‌ రాస్తున్నారు. రాష్ట్రంలోని 17 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. జనవరి 24 ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ భాగం క్రితం సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే గణితంలో ఇచ్చిన ప్రశ్నలు కష్టంగానే ఉన్నట్టు చెప్పారు. ఫిజిక్స్‌ మధ్యస్తంగా ఉందని, కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్‌ చేసే వీలుందని తెలిపారు. పూర్తిగా ఆన్‌లైన్‌ మోడ్‌లో జరిగిన ఈ పరీక్షలో మేథ్స్‌ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందన్నారు.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్

రీజనింగ్‌ ఈజీనే...

మేథమెటిక్స్‌లో కొన్ని బేసిక్‌ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. అయితే చాలా ప్రశ్న లకు సుదీర్ఘంగా విశ్లేషించక తప్పలేదని చెప్పారు. త్రీడీ, వెక్టర్‌ఆల్‌జీబ్రా, మేథమెటికల్‌ రీజనింగ్‌ ప్రశ్న లకు కష్టపడకుండా సమాధానాలు ఇవ్వగలి గారు. ఫిజిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, మ్యాగ్నటిజం, మోడ్రన్‌ ఫిజిక్స్, ఈఎంఐ, ఫిక్షన్‌ న్యూక్లియర్‌ ఫిజిక్స్, ఏసీ కరెంట్‌ నుంచి వచ్చాయి. థియరీ ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకా లు అనుసరించిన వారికి పేపర్‌ తేలికగానే ఉన్నట్టు కెమిస్ట్రీ అధ్యాపకులు చెబుతున్నారు. ఆర్గా నిక్, ఇన్‌ ఆర్గానిక్, కెమికల్‌ కైనటిక్స్, గ్రాఫ్‌ బేస్డ్‌ ప్రశ్నలు, కెమికల్‌ బాండింగ్‌ ప్రశ్నలు తేలికగానే సమాధానా లిచ్చే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు.

చదవండి: JEE Main & Advanced: ఏటా తగ్గిపోతున్న అభ్యరులు! కారణాలివే..

Published date : 25 Jan 2023 03:32PM

Photo Stories