JEE Advanced 2021 Results:మెరిసిన తెలుగు విద్యార్థులు.
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1,51,193మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1,41,699మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 41,862మంది అర్హత పొందారు. అర్హత సాధించిన వారిలో 35,410 మంది బాలురు కాగా.. 6452మంది బాలికలు ఉన్నారు.
ఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ విడుదల చేసిన ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా చూస్తే.. జనరల్ కేటగిరీలో మృదుల్ అగర్వాల్‌కు మొదటి ర్యాంకు రాగా.. బాలికల విభాగంలో కావ్య చోప్రాకు ప్రథమ ర్యాంకు లభించింది. అలాగే, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రామస్వామి సంతోష్‌రెడ్డికి తొలి ర్యాంకు, ఎస్సీ కేటగిరిలో నందిగామ నిఖిల్‌కు మొదటి ర్యాంకు లభించాయి. ఈ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన రుషికేశ్‌రెడ్డికి పదో ర్యాంకు రాగా.. విజయవాడకు చెందిన దివాకర్ సాయికి 11వ ర్యాంకు వచ్చింది.
Published date : 15 Oct 2021 12:27PM