ICET 2022: ఐసెట్ షెడ్యూల్ విడుదల
కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్ హాల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, కేయూ వీసీ తాటికొండ రమేశ్, టీఎస్‌ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డితో కలసి నోటిఫికేషన్ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతీయ కేంద్రాల్లోని 75 కేంద్రాల్లో ఈ పరీక్షను జూలై 27, 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీ తీసుకుంది. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
చదవండి: ఐసెట్ - MODEL PAPERS | Study Material
12 నుంచి పీజీ సెట్ దరఖాస్తులు
పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజ నీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ సెట్‌ను జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహిస్తున్నట్టు ప్రొఫె సర్ లింబాద్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీల కు రూ.500గా నిర్ణయిం చామని, దరఖాస్తులను ఏప్రిల్ 12 నుంచి స్వీకరిస్తామని చెప్పారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ జూన్ 22 వరకు ఉందని, లేట్ ఫీజుతో జూలై 10 వరకు పంపవచ్చని వెల్లడించారు.
చదవండి: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!
టీఎస్‌ఐసెట్ షెడ్యూల్
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మొదలు: |
6–4–22 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: |
27–6–22 |
ఫీజు: రూ.650, |
27–6–22 |
రూ.వెయ్యి అపరాధ రుసముతో దరఖాస్తుల స్వీకరణ గడువు: |
23–7–22 |
ఆన్ లైన్ డేటా మార్పులు: |
13 నుంచి 17–7–22 |