Skip to main content

ISRO Jobs 2023 : ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండానే.. ఇస్రోలో 435 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : వ‌రుస విజ‌యాల‌తో దూసుక‌పోతున్న.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు మ‌రో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ISRO, Successive Victories, isro jobs recruitment 2023 telugu news, ISRO Job Announcements,Unemployed Opportunities
isro jobs recruitment 2023

ఈ మేరకు తాజాగా 435 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

☛ TSGENCO AE Jobs 2023 : 339 ఏఈ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త‌లు ఇవే..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు(273), టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు(162) ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం :

isro jobs telugu news

ఇంటర్వ్యూ, పరీక్షల్లో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌ 7వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 435
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 273
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 162

ఈ విభాగాల్లోనే..: 
ఏరోనాటికల్/ ఏరోస్పేస్, కెమికల్‌, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలార్జీ, ప్రొడక్షన్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు ఇవే..:

isro jobs news

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీఏ/ బ్చాచిలర్ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి.
వ‌యోప‌రిమితి : అభ్యర్థుల వయసు 28 ఏళ్లు ఉండాలి.
అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి : 12 నెలలు.
స్టైపెండ్ : నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : పరీక్షలో మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


టెక్నీషియన్‌ అప్రెంటిస్ : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయసు : 30 ఏళ్లు ఉండాలి.
అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి : 12 నెలలు.
స్టైపెండ్ : నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, పరీక్షలో మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, కమలసెరి, ఎర్నాకుళం జిల్లా, కేరళ.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీ : అక్టోబర్‌ 7, 2023
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://www.vssc.gov.in/

☛ Inspirational Story: పేదరికంపై ఉన్న క‌సితోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించానిలా..

Published date : 07 Oct 2023 09:17AM

Photo Stories