సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) త్వరలోనే గ్రూప్-1లో దాదాపు 100 పోస్టులకు, గ్రూప్-2లో 750 ఉద్యోగాలకు నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ పోటీపరీక్షలకు ప్రిపేరయ్య అభ్యర్థులకు గ్రూప్-1 & 2 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.
appsc group 1 and 2 previous question papers pdf
ఈ ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ ద్వారా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..? అనే విషయాన్ని మీరు గ్రహించవచ్చును. అలాగే ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకు అడుగుతున్నారు..? అనే విషయంను కూడా మీరు తెలుసుకోవచ్చును. ఈ ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ ద్వారా మీరు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 & 2 పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్‌ను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.