గుప్త సామ్రాజ్యం
1. గుప్తుల కాలంనాటి అధికారులను సరిగా జతపరచండి?
అ) టిలుపతి 1) గజదళ అధ్యక్షుడు
ఆ) పుష్టపాల 2) భూవిక్రయాల రికార్డులు
ఇ) దివిర 3) లేఖకుడు
ఈ) శౌల్కిక 4)సుంకాల వసూలుఅధికారి
అ ఆ ఇ ఈ
ఎ) 1 2 3 4
బి) 2 1 4 3
సి) 4 3 2 1
డి) 3 4 1 2
- View Answer
- సమాధానం: ఎ
2. నవరత్నాలు ఏ రాజ దర్బారులో ఉండేవారు?
ఎ) అయోధ్య
బి) పాటలీపుత్ర
సి) ఉజ్జయినీ
డి) ప్రయాగ
- View Answer
- సమాధానం: సి
3. గుప్తుల కాలంలో గుజరాత్ నుంచి మాందసోర్కు వలస వెళ్లిన వ్యాపార సంఘం ఏ వృత్తికి సంబంధించింది?
ఎ) కుండల తయారీ
బి) సిల్క్ తయారీ
సి) దంతపు వస్తువుల తయారీ
డి) ఇనుప వస్తువుల తయారీ
- View Answer
- సమాధానం: బి
4. సుదర్శన తటాకాన్ని వివిధ కాలాల్లో మరమ్మతు చేసిన మహారాజులు వారి రాష్ర్ట పాలకు(గవర్నర్ల)ల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి?
ఎ) మౌర్య చంద్రగుప్తుడు - యవన రాజ తుషస్ప
బి) అశోకుడు - చక్రపాణి
సి) రుద్ర దమనుడు - పుష్యగుప్తుడు
డి) స్కందగుప్తుడు - పార్ణదత్తుడు
- View Answer
- సమాధానం: డి
5. గుప్తుల అధికార భాష?
ఎ) సంస్కృతం
బి) ప్రాకృతం
సి) పాళీ
డి) మాగధి
- View Answer
- సమాధానం: ఎ
6. గుప్తుల అధికారిక చట్టంగా భావించిన స్మృతి ?
ఎ) నారద స్మృతి
బి) పరాశర స్మృతి
సి) యాజ్ఞవల్క్య స్మృతి
డి) బృహస్పతి స్మృతి
- View Answer
- సమాధానం: సి
7. కాళిదాసురచించని గ్రంథం?
ఎ) మేఘదూతం
బి) కుమార సంభవం
సి) రఘువంశం
డి) కిరాతార్జునీయం
- View Answer
- సమాధానం: డి
8. బృహజ్జాతక గ్రంథకర్త?
ఎ) బ్రహ్మగుప్తుడు
బి) వరాహమిహిరుడు
సి) ఆర్యభట్టుడు
డి) భేదుడు
- View Answer
- సమాధానం: బి
9. నలంద విశ్వవిద్యాలయ నిర్మాత?
ఎ) కుమార గుప్తుడు
బి) సముద్ర గుప్తుడు
సి) బుధ గుప్తుడు
డి) విష్ణు గుప్తుడు
- View Answer
- సమాధానం: ఎ
10. చంద్రగుప్త, కుమారదేవి నాణేలు లభించని ప్రాంతం?
ఎ) మధుర
బి) లక్నో
సి) మగధ
డి) బయానా
- View Answer
- సమాధానం: సి
11. గుప్త రాజులు - వారి రాణులను సరిగా జతపర్చండి?
అ) చంద్రగుప్త-1 1) దత్తాదేవి
ఆ) సముద్రగుప్తుడు 2) కుమార దేవి
ఇ) చంద్రగుప్త-2 3) మహాదేవి
ఈ) కుమారగుప్త-1 4) ధ్రువాదేవి
అ ఆ ఇ ఈ
ఎ) 2 1 4 3
బి) 1 2 3 4
సి) 2 1 3 4
డి) 4 3 2 1
- View Answer
- సమాధానం: ఎ
12. గుప్తుల రాజధాని కానిది?
ఎ) ప్రయాగ
బి) అయోధ్య
సి) ఉజ్జయినీ
డి) వారణాసి
- View Answer
- సమాధానం: డి
13. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోని నవరత్నాల్లో లేనివారు?
ఎ) కాళిదాసు
బి) శుశ్రుతుడు
సి) వరరుచి
డి) చరకుడు
- View Answer
- సమాధానం: డి
14.మొట్టమొదటి హూణుల దాడి ఏ రాజు కాలంలో జరిగింది?
ఎ) మొదటి కుమార గుప్తుడు
బి) రెండో చంద్రగుప్తుడు
సి) స్కంద గుప్తుడు
డి) నరసింహ గుప్తుడు
- View Answer
- సమాధానం: ఎ
15. కింద పేర్కొన్న శకాలు - ప్రారంభమైన సంవత్సరాలను జతపర్చండి?
అ)గాంగ శకం 1) క్రీ.శ. 606
ఆ)అభీర శకం 2) క్రీ.శ. 498
ఇ)గుప్త శకం 3) క్రీ.శ. 249
ఈ)హర్ష శకం 4)క్రీ.శ. 319/320
అ ఆ ఇ ఈ
ఎ) 4 2 3 1
బి) 2 3 1 4
సి) 2 3 4 1
డి) 1 3 2 4
- View Answer
- సమాధానం: సి
16. గుప్తుల కాలంనాటి పరిపాలనా విభాగాలను సరైన క్రమంలో గుర్తించండి?
ఎ) భుక్తి- విషయ- విధి- గ్రామ
బి) విషయ- విధి -భుక్తి- గ్రామ
సి) గ్రామ- విధి -భుక్తి- విషయ
డి) విధి- విషయ- గ్రామ -భుక్తి
- View Answer
- సమాధానం: ఎ
17. కింది వాటిలో వ్యాకరణంపై రాయని గ్రంథం?
ఎ) కాతంత్రం
బి) ప్రాకృత ప్రకాశం
సి) కాశిక వ్రిత్తి
డి) పంచ సిద్ధాంతిక
- View Answer
- సమాధానం: డి
18. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్య క్షీణతకు కారణం కానిది?
ఎ) రోమ్ సామ్రాజ్య పతనం
బి) ఎగుమతి అయ్యే వస్తువుల నాణ్యతలో క్షీణత
సి) నౌకా నిర్మాణంలో అరబ్బులు, చైనీయుల పోటీ
డి) స్మృతి గ్రంథాల్లో సముద్రయానంపై నిషేధం విధించడం
- View Answer
- సమాధానం: బి
19. ‘ఆర్య మంజుశ్రీ మూలకల్ప’ ప్రకారం బౌద్ధులను హింసించిన గుప్తరాజు?
ఎ) సముద్ర గుప్తుడు
బి) కచ గుప్తుడు
సి) నరసింహ బాలాదిత్యుడు
డి) విష్ణు గుప్తుడు
- View Answer
- సమాధానం: బి
20.భూమిపై ఉన్న సమస్త రాజులను ఓడించినట్లు ఎరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) రెండో చంద్రగుప్తుడు
సి) సముద్రగుప్తుడు
డి) స్కంద గుప్తుడు
- View Answer
- సమాధానం: సి
21. గుప్తుల అధికారిక చిహ్నాం?
ఎ) పులి
బి) గరుడ
సి) వీణ
డి) సింహం
- View Answer
- సమాధానం: బి
22. కామరూపలో సముద్రగుప్తుడి ప్రతినిధిగా నియమితుడైన రాజు?
ఎ) భాస్కర వర్మన్
బి) సూర్య వర్మన్
సి) పుష్య వర్మన్
డి) గృహ వర్మన్
- View Answer
- సమాధానం: సి
23. సముద్రగుప్తుడికి కానుకలు పంపిన గాంధార రాజు?
ఎ) కిదార
బి) చిరాతదత్త
సి) సిద్ధార్థ
డి) నరసింహన్
- View Answer
- సమాధానం: ఎ
24. రోమ్కు రాయబార బృందాన్ని పంపిన గుప్తరాజు?
ఎ) పురు గుప్తుడు
బి) సముద్ర గుప్తుడు
సి) కుమార గుప్తుడు
డి) బుధ గుప్తుడు
- View Answer
- సమాధానం: బి
25. బోధ్‌గయలో సింహళ విహారాన్ని నిర్మించిన శ్రీలంక రాజు?
ఎ) శ్రీ మార విజయోత్తుంగ వర్మ
బి) శ్రీ మేఘవర్మ
సి) విజయబాహు
డి) కుమార బాహు
- View Answer
- సమాధానం: బి
26. తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు?
ఎ) కుమార గుప్తుడు
బి) చంద్రగుప్తు విక్రమాదిత్యుడు
సి) సముద్ర గుప్తుడు
డి) శ్రీ గుప్తుడు
- View Answer
- సమాధానం: సి
27. ‘కృష్ణ చరితం’ గ్రంథాన్ని రచించిన గుప్తరాజు?
ఎ) సముద్ర గుప్తుడు
బి) నరసింహ గుప్తుడు
సి) మొదటి చంద్రగుప్తుడు
డి) రెండో చంద్రగుప్తుడు
- View Answer
- సమాధానం: ఎ
28. అశ్వమేధ నాణేలు జారీ చేసిన గుప్తరాజు?
ఎ) విష్ణు గుప్తుడు
బి) సముద్ర గుప్తుడు
సి) కుమార గుప్తుడు
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
29. కింది వాటిలో గుప్తుల రాజధానిగా వర్థిల్లిన నగరం ఏది?
ఎ) పాటలీపుత్రం
బి) ఉజ్జయిని
సి) ఎ, బి
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
30. గుప్తవంశ మూల పురుషుడు ఎవరు?
ఎ) శ్రీగుప్తుడు
బి) చంద్రగుప్తుడు
సి) సముద్రగుప్తుడు
డి) కుమారగుప్తుడు
- View Answer
- సమాధానం: ఎ
31.కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e గ్రూపు - ఎ గ్రూపు - బి 1. గుప్తశకం ప్రారంభకులు a. మొదటి చంద్రగుప్తుడు 2. గుప్తుల్లో అగ్రగణ్యుడు b. సముద్రగుప్తుడు 3. నలందా విశ్వవిద్యాలయ స్థాపకుడు c. కుమారగుప్తుడు 4. ‘నవరత్నాలు’ అనే కవులను పోషించినవారు d. రెండో చంద్రగుప్తుడు 5. గుప్తవంశ చివరి పాలకుడు e. విష్ణుగుప్తుడు
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-a, 3-d, 4-e, 5-b
డి) 1-b, 2-e, 3-d, 4-c, 5-a
- View Answer
- సమాధానం:ఎ
32. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గుప్తుల రాజభాష ‘సంస్కృతం’
బి) గుప్తుల రాజముద్రిక ‘గరుడ’
సి) గుప్తుల అధికారిక న్యాయపుస్తకం ‘యజ్ఞవల్కస్మృతి’
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు?
ఎ) ఆర్యభట్ట
బి) బ్రహ్మగుప్త
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం:సి
34. రెండో చంద్రుగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
ఎ) పాహియాన్
బి) హుయాన్‌త్సాంగ్
సి) స్ట్రాబో
డి) మార్కొపొలో
- View Answer
- సమాధానం: ఎ
35. కింది వాటిలో సముద్రగుప్తుడి బిరుదు ఏది?
ఎ) కవిరాజు
బి) పరాక్రమాంక
సి) ఇండియన్ నెపోలియన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
36.సముద్రగుప్తుడి విజయాలు తెలిపే అలహాబాద్ స్తంభ శాసనం రచయిత ఎవరు?
ఎ) రవికీర్తి
బి) హరిసేన
సి) బుధకీర్తి
డి) శర్వవర్మ
- View Answer
- సమాధానం: బి
37. మౌర్యులకు అర్థశాస్త్రం ఎలాంటిదో గుప్తులకు కింద పేర్కొన్న ఏ గ్రంథం అలాంటిది?
ఎ) మృచ్ఛకటికం
బి) కథాసరిత్సాగరం
సి) నీతిసారం
డి) రఘువంశం
- View Answer
- సమాధానం: సి
38.గుప్తుల వంశక్రమాన్ని వివరిస్తున్న పురాణం ఏది?
ఎ) విష్ణుపురాణం
బి) మత్స్యపురాణం
సి) వాయు పురాణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
39.శకుల దండయాత్ర, ధ్రువాదేవితో రెండో చంద్రుగుప్తుడి వివాహం గురించి వివరిస్తున్న గ్రంథం ఏది?
ఎ) దేవీ చంద్రగుప్తం
బి) ముద్రారాక్షసం
సి) స్వప్నవాసవదత్త
డి) కౌముదీ మహోత్సవం
- View Answer
- సమాధానం: ఎ
40.గుప్తుల కాలానికి చెందిన ప్రముఖ రచయితలు, వారి గ్రంథాలను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e గ్రూపు - ఎ గ్రూపు - బి 1. కౌముదీమహోత్సవం a. వజ్జిక 2. దేవీ చంద్రగుప్తం b. విశాఖదత్తుడు 3. నీతిసారం c. కామాంధకుడు 4. కథాసరిత్సాగరం d. సోమదేవసూరి 5. మృచ్ఛకటికం e. శూద్రకుడు
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-b, 2-a, 3-e, 4-d, 5-c
డి) 1-b, 2-e, 3-b, 4-c, 5-a
- View Answer
- సమాధానం: ఎ
41. ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం గుప్తులు ఏ వర్గానికి చెందినవారు?
ఎ) క్షత్రియ
బి) శూద్ర
సి) వైశ్య
డి) బ్రాహ్మణ
- View Answer
- సమాధానం: సి
42. సముద్రగుప్తుడి గురించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) దక్షిణ భారత దండయాత్రలో 12మంది రాజులను ఓడించాడు
బి) రెండో ఆర్యావర్త దండయాత్రలో 9 మంది రాజుల కూటమిని కౌశాంబి యుద్ధంలో ఓడించాడు
సి) వీణ వాయిస్తున్నట్లు నాణేలు విడుదల చేశాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
43. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గుప్తుల కాలంలో వైదిక మతం హిందూమతంగా మారింది
బి) విష్ణువును దశావతారాల్లో పూజించడం ప్రారంభమైంది
సి) గుప్తుల కాలం నుంచే బుద్ధుడిని విష్ణువు దశావతారాల్లో ఒకరిగా భావించారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
44.‘షానామా’ గ్రంథం ప్రకారం అర్ధాషీర్ అనే పారశీక రాజు గుప్తవంశానికి చెందిన ఏ పాలకుడితో స్నేహాన్ని కాంక్షించాడు?
ఎ) శ్రీగుప్తుడు
బి) చంద్రగుప్త విక్రమాదిత్య
సి) బాణుగుప్తుడు
డి) బుధగుప్తుడు
- View Answer
- సమాధానం: బి
45. నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసుకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) కాళిదాసు రచించిన నాటకాలు - మాళవికాగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం
బి) కాళిదాసు రచించిన కావ్యాలు- రఘువంశం, మేఘదూతం, కుమార సంభవం
సి) కాళిదాసు రచించిన పద్యకావ్యం - రుతు సంహారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
46. ఆర్యభట్ట తెలియజేసిన ఖగోళ అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గ్రహణాలు ఏర్పడే విధానాన్ని శాస్త్రీయంగా వివరించారు
బి) భూభ్రమణం గురించి వివరించారు
సి) స్థానం మారితే 0 విలువ మారడం గురించి తెలిపారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
47.న్యూటన్ కంటే ముందే భూమ్యాకర్షణ శక్తి గురించి వివరించిన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు?
ఎ) బ్రహ్మగుప్త
బి) ఆర్యభట్ట
సి) వరాహమిహిరుడు
డి) ఘటకర్ణ
- View Answer
- సమాధానం: ఎ
48. పరంపరంగా కొనసాగుతున్న వైదిక సాహిత్యాన్ని ఏ పాలకుల కాలంలో రచించారు?
ఎ) కుషాణులు
బి) రాజపుత్రులు
సి) గుప్తులు
డి) చోళులు
- View Answer
- సమాధానం: సి
49. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు?
ఎ) సుశ్రుతుడు
బి) ధన్వంతరి
సి) వాగ్భటుడు
డి) పాలకాశ్యపుడు
- View Answer
- సమాధానం: ఎ
50. గుప్తుల కాలం నాటి వైద్యశాస్త్ర గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d గ్రూపు - ఎ గ్రూపు - బి 1. ధన్వంతరి a. వైద్యశాస్త్రం 2. పాలకాశ్యపుడు b. హస్తాయుర్వేదం 3. సుశ్రుతుడు c. సుశ్రుత సంహిత 4. వాగ్భటుడు d. అష్టాంగసంగ్రహం
బి) 1-d, 2-c, 3-b, 4-a
సి) 1-b, 2-d, 3-a, 4-c
డి) 1-c, 2-a, 3-d, 4-b
- View Answer
- సమాధానం: ఎ
51. ఏ పాలకుడి కాలం నుంచి గుప్త సామ్రాజ్యంపై హుణులనే విదేశీ తెగల దండయాత్ర ప్రారంభమైంది?
ఎ) బుధగుప్త
బి) కుమారగుప్త
సి) స్కందగుప్త
డి) నరసింహ బలాదిత్య
- View Answer
- సమాధానం: బి
52. రెండో చంద్రగుప్తుడి (చంద్రగుప్త విక్రమాదిత్య) విజయాలను వివరించే ప్రముఖ శాసనం ఏది?
ఎ) మెహ్రౌలి ఇనుపస్తంభ శాసనం
బి) ఎరాన్ శాసనం
సి) భింతారీ శాసనం
డి) జునాఘడ్ శాసనం
- View Answer
- సమాధానం: ఎ
53. చరిత్రకారులు భారతదేశంలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించారు?
ఎ) గుప్తులు
బి) మౌర్యులు
సి) కుషాణులు
డి) రాజపుత్రులు
- View Answer
- సమాధానం: ఎ
54.హుణుల ప్రముఖ నాయకుడైన తోరమానుడిని ఓడించిన గుప్త పాలకుడు ఎవరు?
ఎ) స్కందగుప్త
బి) నరసింహ బలాదిత్య
సి) విష్ణుగుప్త
డి) కుమారగుప్త
- View Answer
- సమాధానం: బి
55. గుప్తుల కాలంలో బాణుగుప్త వేయించిన ఏ శాసనం సతీసహగమనం గురించి మొదటి శాసనాధారంగా ఉంది?
ఎ) ఎరాన్ శాసనం
బి) నలంద శాసనం
సి) మాండసోర్ శాసనం
డి) సాంచి శాసనం
- View Answer
- సమాధానం: ఎ
56. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గుప్తులు రాజ్యాన్ని ‘భుక్తి’ అనే రాష్ట్రాలుగా విభజించారు.
బి) భుక్తికి పాలకుడు ‘ఉపారికుడు’
సి) గ్రామ పాలనలో ‘పంచమండల సభ’ తోడ్పడేది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
57. గుప్తుల వాస్తు నిర్మాణ శైలిని ఏమంటారు?
ఎ) నగర శైలి
బి) ద్రవిడ శైలి
సి) దేశీయ శైలి
డి) మధుర శైలి
- View Answer
- సమాధానం: ఎ
58. కింది వాటిలో గుప్తుల కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం ఏది?
ఎ) తూర్పున ‘తామ్రలిప్తి’
బి) పశ్చిమాన ‘బ్రోచ్’
సి) ఎ, బి
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
59. గుప్తుల కాలంలో నిర్మించిన గుహాలయాలు ఏవి?
ఎ) అజంతా
బి) భాగ్
సి) ఉదయగిరి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
60. కింది వాటిలో గుప్తుల కాలంలో నిర్మించిన ప్రముఖ ఆలయం ఏది?
ఎ) దేవఘర్ - దశావతార దేవాలయం
బి) భూమన - శివాలయం
సి) నాచనకుథారా - పార్వతీ ఆలయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
61. గుప్తుల కాలంలో పంటలో ఎంతభాగం భూమి శిస్తుగా ఉండేది?
ఎ) 1/6
బి) 2/5
సి) 1/2
డి) 3/5
- View Answer
- సమాధానం: ఎ