బ్రిటిషర్ల కాలంలో భారతదేశం
1. భారతదేశానికి సముద్రమార్గం కనుగొనడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) బార్తలోమియా డయాజ్
బి) వాస్కోడగామా
సి) హెన్రీ
డి) జామెరిన్
- View Answer
- సమాధానం: ఎ
2. యురోపియన్లు - భారతదేశంలో వారి ప్రధాన స్థావరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - 1 | జాబితా - 2 |
1. పోర్చుగీస్‌వారు | a. కొచ్చిన్, గోవా |
2. ఫ్రెంచ్‌వారు | b. పాండిచ్చేరి |
3. బ్రిటిషర్లు | c. కలకత్తా |
4. డచ్‌వారు | d. పులికాట్, నాగపట్నం |
5. డేన్లు | e. శ్రీరాంపూర్ |
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-c, 3-a, 4-b, 5-e
డి) 1-c, 2-a, 3-e, 4-d, 5-b
- View Answer
- సమాధానం: ఎ
3. ఫ్రెంచ్ వర్తక సంఘాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) 14వ లూయీ
బి) కోల్బర్ట్
సి) 15వ లూయీ
డి) 16వ లూయీ
- View Answer
- సమాధానం: బి
4. ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వర్తక స్థావరం నిర్మాణానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు?
ఎ) తానీషా
బి) సుల్తాన్ కులీ
సి) మహమ్మద్ కులీ
డి) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: సి
5. కింది వాటిలో భారతదేశంలో ఆధిపత్యం కోసం ఆంగ్లేయులు, ఫ్రెంచివారికి మధ్య జరిగిన యుద్ధాలు ఏవి?
ఎ) మైసూరు యుద్ధాలు
బి) మరాఠా యుద్ధాలు
సి) సిక్ యుద్ధాలు
డి) కర్ణాటక యుద్ధాలు
- View Answer
- సమాధానం: డి
6. పోర్చుగీసువారితో స్నేహ సంబంధాలు సాగించిన ప్రముఖ భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) శ్రీకృష్ణదేవరాయలు
బి) జహంగీర్
సి) రెండో దేవరాయలు
డి) మహమ్మద్ షా
- View Answer
- సమాధానం:ఎ
7. భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కోడగామా మొదట ఏ తీరానికి చేరుకున్నాడు?
ఎ) కాలికట్
బి) కొచ్చిన్
సి) కన్ననూర్
డి) గోవా
- View Answer
- సమాధానం: ఎ
8. సముద్ర ఆధిపత్యం కోసం ‘నీలి నీటి విధానం’ (Blue Water Policy) అనుసరించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
ఎ) ఆల్బూకర్క్
బి) ఫ్రాన్సిస్-డి-ఆల్మడా
సి) నునా డి కన్హా
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
9. భారతదేశంలో మొదటిసారిగా క్రైస్తవ మత వ్యాప్తి కోసం వచ్చిన జెసూట్ మతాచార్యుడు ఎవరు?
ఎ) సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్
బి) సెయింట్ థామస్
సి) సెయింట్ జార్జ్
డి) సెయింట్ విలియం
- View Answer
- సమాధానం: ఎ
10. సూరత్‌లో మొదటి వర్తక స్థావరం ఏర్పాటు చేసిన యురోపియన్లు ఎవరు?
ఎ) బ్రిటిషర్లు
బి) ఫ్రెంచ్‌వారు
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
11. కింద పేర్కొన్న వారిలో భారతదేశంలో ప్రవేశించిన మొదటి ఆంగ్లేయుడు, కొంకణీ భాషలో రచనలు చేసిన వ్యక్తి ఎవరు?
ఎ) ఫాదర్ థామస్ స్టీవెన్స్
బి) మిల్టెన్ హాల్
సి) రాల్ పిచ్
డి) కెప్టెన్ హాకిన్స్
- View Answer
- సమాధానం: ఎ
12. ఆంగ్లేయులకు ఏ సంధి వల్ల బెంగాల్లో దివానీ హక్కులు లభించాయి?
ఎ) అలీనగర్ సంధి
బి) అలహాబాద్ సంధి
సి) బర్కర్ సంధి
డి) లక్నో సంధి
- View Answer
- సమాధానం: బి
13. బ్రిటిష్ చక్రవర్తి మొదటి జేమ్స్.. వర్తక అనుమతి కోసం మొగల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి ఎవరిని పంపించాడు?
ఎ) కెప్టెన్ హాకిన్స్ (1608)
బి) సర్ థామస్ రో (1615)
సి) ఎ, బి
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
14. భారతదేశంలో యురోపియన్ల ప్రముఖ వర్తక స్థావరాలు, వాటిని అభివృద్ధి చేసిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) మద్రాసు - ప్రాన్సిస్ డే
బి) కలకత్తా - జాబ్ చార్నోక్
సి) బొంబాయి - ఆక్సిన్డన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
15. ఆంగ్లేయులు ఏ కుతుబ్‌షాహీ పాలకుడి నుంచి ‘సువర్ణ ఫర్మానా’ను పొందారు?
ఎ) అబ్దుల్లా కుతుబ్‌షా
బి) సుల్తాన్ కులీ
సి) మహమ్మద్ కుతుబ్‌షా
డి) కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: ఎ
16. యుద్ధాలు - వాటి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1. ప్లాసీ యుద్ధం (1757) a. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన 2. వందవాసి యుద్ధం (1760) b. ఫ్రెంచ్ ప్రాబల్యం అంతం 3. బక్సార్ యుద్ధం (1764) c. మొగల్ చక్రవర్తి ప్రాబల్యం కోల్పోయాడు 4. 3వ మైసూర్ యుద్ధం (1790-94) d. టిప్పు సుల్తాన్ అవమానకరమైన శ్రీరంగపట్నం సంధి షరతులకు అంగీకరించాడు 5. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం (1817-18) e. పీష్వా పదవిని రద్దు చేశారు
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-b, 2-d, 3-e, 4-a, 5-c
డి) 1-c, 2-e, 3-a, 4-b, 5-d
- View Answer
- సమాధానం: ఎ
17. కొంత మంది ఆంగ్లేయుల మరణానికి కారణమైన చీకటి గది ఉదంతం గురించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) 1756 జూన్ 20న కలకత్తాలో జరిగింది
బి) ఈ సంఘటనను హాల్వెల్ వెలుగులోకి తెచ్చాడు
సి) బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్దౌలా దీనికి బాధ్యుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
18. ద్వంద్వ ప్రభుత్వం గురించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో 1765లో ప్రవేశపెట్టాడు
బి) దీని ప్రకారం ఆంగ్లేయులకు దివానీ హక్కు (పన్ను వసూలు), బెంగాల్ నవాబుకు నిజామత్ (పరిపాలన) హక్కు లభించాయి
సి) 1773లో వారన్ హేస్టింగ్స్ దీన్ని రద్దు చేశాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
19. ప్లాసీ యుద్ధం (1757 జూన్ 23) జరిగిన సంవత్సరంలోనే ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ప్రముఖ యుద్ధం ఏది?
ఎ) బొబ్బిలి యుద్ధం
బి) పద్మనాభ యుద్ధం
సి) పల్నాడు యుద్ధం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
20. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా జరిగిన యుద్ధాలు, కుదుర్చుకున్న సంధులను సరైన క్రమంలో జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1. మొదటి కర్ణాటక యుద్ధం a. ఎక్స్-లా-షాపెల్ సంధి 2. 3వ కర్ణాటక యుద్ధం b. పారిస్ సంధి 3. మొదటి మైసూర్ యుద్ధం c. మద్రాసు సంధి 4. 2వ మైసూర్ యుద్ధం d. మంగుళూరు సంధి 5. 3వ మైసూర్ యుద్ధం e. శ్రీరంగపట్నం సంధి
బి) 1-e, 2-b, 3-c, 4-d, 5-a
సి) 1-d, 2-e, 3-c, 4-a, 5-b
డి) 1-c, 2-a, 3-e, 4-b, 5-d
- View Answer
- సమాధానం: ఎ
21.ఆర్కాట్ వీరుడిగా పేరొందిన బ్రిటిష్ అధికారి ఎవరు?
ఎ) వాన్ సిట్టార్ట్
బి) రాబర్ట్ క్లైవ్
సి) వెర్టెల్స్
డి) కార్టియర్
- View Answer
- సమాధానం: బి
22. గవర్నర్ జనరల్స్, వారి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1. వారన్ హేస్టింగ్స్ a. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ 2. కారన్ వాలీస్ b. శాశ్వత భూమిశిస్తు విధానం (1793) 3. లార్డ్ వెల్లస్లీ c. సైన్య సహకార పద్ధతి (1798) 4. విలియం బెంటిక్ d. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ 5. లార్డ్ డల్హౌసీ e. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-e, 3-b, 4-a, 5-c
డి) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
- View Answer
- సమాధానం: ఎ
23. డల్హౌసీ తన ‘రాజ్య సంక్రమణ సిద్ధాంతం’ ద్వారా మొదటగా ఏ స్వదేశీ రాజ్యాన్ని ఆక్రమించాడు?
ఎ) ఝాన్సీ
బి) సతారా
సి) ఉదయ్‌పూర్
డి) సంబల్పూర్
- View Answer
- సమాధానం: బి
24. ఏ చట్టం ద్వారా ‘బెంగాల్ గవర్నర్ జనరల్’ పదవిని ‘భారత గవర్నర్ జనరల్’గా మార్చారు?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1784 పిట్స్ ఇండియా చట్టం
సి) 1813 చార్టర్ చట్టం
డి) 1833 చార్టర్ చట్టం
- View Answer
- సమాధానం: డి
25. సర్ విలియం జోన్స్1784లో ‘ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్’ను స్థాపించినప్పుడు అతడికి సహాయం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) కారన్‌వాలీస్
బి) వారన్ హేస్టింగ్స్
సి) లార్డ్ హేస్టింగ్స్
డి) వెల్లస్లీ
- View Answer
- సమాధానం: బి
26. ఫ్రాన్స్ నాయకుడు నెపోలియన్ సహాయం పొందడానికి ప్రయత్నించిన భారతీయ పాలకుడెవరు?
ఎ) టిప్పుసుల్తాన్
బి) హైదరాలీ
సి) కృష్ణరాజ్ వడయార్
డి) శివాజీ
- View Answer
- సమాధానం: ఎ
27. సైన్య సహకార పద్ధతికి ఆమోదం తెలిపిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) షాదత్ అలీ - అయోధ్య
బి) నిజాం అలీ - హైదరాబాద్
సి) పీష్వా - మహారాష్ట్ర
డి) షా ఆలం - మొగల్స్
- View Answer
- సమాధానం: బి
28. పీష్వా 1802లో కుదిరిన ఏ సంధి ద్వారా సైనిక సహకార పద్ధతిని ఆమోదించాడు?
ఎ) సుర్జి అర్జుగావ్ సంధి
బి) దేవ్గావ్ సంధి
సి) బేస్సిన్ సంధి
డి) యాండబూ సంధి
- View Answer
- సమాధానం: సి
29. సైనిక సహకార సంధిలో భాగంగా నిజాం.. బ్రిటిషర్లకు ఇచ్చిన దత్త మండలాలు ఏవి?
ఎ) కర్నూలు
బి) కడప
సి) బళ్లారి, అనంతపురం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
30. క్రీ.శ.1800లో కలకత్తాలో అడ్మినిస్ట్రేటివ్ కళాశాల అయిన ‘పోర్ట విలియం కళాశాల’ను స్థాపించింది ఎవరు?
ఎ) వెల్లస్లీ
బి) ఎలెన్ బరో
సి) లార్డ్ అమ్హరెస్ట్
డి) జాన్ షోర్
- View Answer
- సమాధానం: ఎ
31. భారత్‌లో యురోపియన్ పాలనా విధానం, సివిల్ సర్వీసెస్ విధానాలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ హేస్టింగ్స్
బి) కారన్‌వాలీస్
సి) విలియం బెంటిక్
డి) డల్హౌసీ
- View Answer
- సమాధానం: బి
32. భారత్‌లో ఆంగ్లవిద్యకు ‘మాగ్నాకార్టా’గా ఏ నివేదికను పేర్కొంటారు?
ఎ) హంటర్ నివేదిక
బి) మెకాలే నివేదిక
సి) ఉడ్ నివేదిక
డి) రీడ్ నివేదిక
- View Answer
- సమాధానం: సి
33. గవర్నర్ జనరల్స్, వారికి సంబంధించిన ప్రముఖ సంస్కరణలను సరైన క్రమంలో జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1. కోడ్ ఆఫ్ హిందూ లా a. వారన్ హేస్టింగ్స్ 2. సతీసహగమనం రద్దు చట్టం (1829) b. విలియం బెంటిక్ 3. గోండులలో నరబలి ఆచారం రద్దు c. లార్డ్ హార్డింజ్ 4. పత్రికా స్వేచ్ఛ d. చార్లెస్ మెట్కాఫ్ 5. వితంతు పునర్వివాహ చట్టం (1856) e. లార్డ్ డల్హౌసీ
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-a, 3-c, 4-b, 5-e
డి) 1-c, 2-a, 3-d, 4-e, 5-b
- View Answer
- సమాధానం: ఎ
34. డల్హౌసీ ఏర్పాటు చేసిన వాటికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) మొదటి రైలు మార్గం (బొంబాయి నుంచి థానే) - 1853
2) మొదటి టెలిగ్రాఫ్ మార్గం (కలకత్తా నుంచి ఆగ్రా) - 1853
3) పోస్టల్ శాఖ - 1853
4) ప్రజా పనుల శాఖ (Public Works Departments) స్థాపన
ఎ) 1, 2, 3
బి) 1, 2
సి) 2, 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
35. ‘డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ’ దేనికి సంబంధించింది?
ఎ) న్యాయ వ్యవస్థ
బి) విద్య
సి) పరిపాలన
డి) రెవెన్యూ
- View Answer
- సమాధానం: బి
36. భారతదేశ మొదటి వైస్రాయ్, చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ కానింగ్
బి) లార్డ్ ఎల్జిన్
సి) జాన్ లారెన్స్
డి) లార్డ్ నార్తబ్రూక్
- View Answer
- సమాధానం: ఎ
37. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) స్థానిక సంస్థల పితామహుడు - రిప్పన్
బి) 1871లో లార్డ్ మేయో కాలంలో భారత్‌లో మొదటిసారిగా జనాభా గణాంకాలు సేకరించారు
సి) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో వైస్రాయ్ - డఫ్రిన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
38. కర్జన్ చేపట్టిన చర్యలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1. బిహార్‌లోని పూసాలో వ్యవసాయ పరిశోధన సంస్థ స్థాపన
2. వాయవ్య సరిహద్దు రాష్ట్రం(NWFP) ఏర్పాటు
3. టిబెట్, భారత్ మధ్య మెక్‌మోహన్ సరిహద్దు రేఖ ఏర్పాటు
4. భారత పురావస్తు శాఖ ఏర్పాటు
5. బెంగాల్ విభజన
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3, 4, 5
డి) 2, 3, 4
- View Answer
- సమాధానం: సి