గాడ్గిల్ - ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు నిధులు అందించే క్రమంలో ప్రత్యేక సమస్యలు అనే అంశానికి ఎంత వెయిటేజీ ఇచ్చారు?
1. గాడ్గిల్ - ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు నిధులు అందించే క్రమంలో ప్రత్యేక సమస్యలు అనే అంశానికి ఎంత వెయిటేజీ ఇచ్చారు?
1) 7.5 శాతం
2) 8 శాతం
3) 8.5 శాతం
4) 9 శాతం
- View Answer
- సమాధానం: 1
2. 2000 సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ఏర్పాటుచేసిన వ్యయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడు?
1) రాజా చెల్లయ్య
2) రేఖీ
3) వి.పి. సింగ్
4) కె.పి. గీతా క్రిష్ణన్
- View Answer
- సమాధానం: 4
3. 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర నిధులను రాష్ట్రాల మధ్య పంచే క్రమంలో అటవీ విస్తీర్ణానికి సంబంధించి ఎంత వెయిటేజీ ఇచ్చారు?
1) 5.5 శాతం
2) 7.5 శాతం
3) 10 శాతం
4) 15 శాతం
- View Answer
- సమాధానం: 2
4. భారత ప్రభుత్వం ప్రత్యక్ష పన్నుల కోడ్‌కు సంబంధించి డ్రాఫ్ట్‌ను మొదటిసారిగా ఎప్పుడు విడుదల చేసింది?
1) 2009 ఆగస్టు 12
2) 2010 ఆగస్టు 12
3) 2010 సెప్టెంబర్ 5
4) 2010 సెప్టెంబర్ 29
- View Answer
- సమాధానం: 1
5. సేవలపై పన్నును కింది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1992 - 93
2) 1993 - 94
3) 1994 - 95
4) 1995 - 96
- View Answer
- సమాధానం: 3
6. విలువ ఆధారిత పన్నును ఏ విధంగా విధిస్తారు?
1) ఉత్పత్తి, అంతిమ అమ్మకం మధ్య అన్ని దశల్లో
2) ప్రత్యక్షంగా వినియోగదారునిపై
3) ఉత్పత్తిలో అంతిమ దశ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
7. ప్రభుత్వానికి లభించే ఆదాయానికి, వ్యయానికి మధ్య ఉన్న తేడాను రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణ సేకరణ ద్వారా భర్తీ చేసే విధానం?
1) ద్రవ్యలోటు
2) ప్రాథమిక లోటు
3) లోటు ఆర్థిక విధానం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
8. విత్తలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చేది?
1) రెవెన్యూ లోటు
2) కరెంట్ అకౌంట్ లోటు
3) మూలధన అకౌంట్ లోటు
4) ప్రాథమిక లోటు
- View Answer
- సమాధానం: 4
9.కేంద్ర నిధుల పంపిణీకి సంబంధించి 2013 మేలో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
1) కె.ఎల్. రేఖీ
2) ఎ.ఎం. ఖుస్రో
3) సి.రంగరాజన్
4) రఘురామ్ రాజన్
- View Answer
- సమాధానం: 4
10. 1997లో స్వచ్ఛంద ఆదాయ పథకం అమలు సమయంలో ఆర్థిక మంత్రి?
1) వి.పి. సింగ్
2) చిదంబరం
3) ప్రణబ్ ముఖర్జీ
4) పైవేవి కావు
- View Answer
- సమాధానం: 2
11. బహుముఖ గణాంకాన్ని కింది ఏ కమిటీ ప్రతిపాదించింది?
1) రఘురామ్ రాజన్
2) గీతాకృష్ణన్
3) విజయ్‌కేల్కర్
4) అరవింద్ సుబ్రమణియన్
- View Answer
- సమాధానం: 1
12. పరోక్ష పన్నులపై సిఫార్సులు చేయడానికి 1992లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
1) వై.బి. చవాన్
2) ఎన్.కె.పి. సాల్వే
3) కె.సి. పంత్
4) కె.ఎల్. రేఖీ
- View Answer
- సమాధానం: 4
13. వ్యవసాయ ఆదాయం రూ.25,000కు మించినప్పుడు పన్ను విధించాలని సిఫార్సు చేసిన కమిటీ?
1) రాజా చెల్లయ్య కమిటీ
2) విజయ్ కేల్కర్ కమిటీ
3) రంగరాజన్ కమిటీ
4) ఎల్.కె. ఝా కమిటీ
- View Answer
- సమాధానం: 1
14. కేంద్ర రెవెన్యూ శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన కోర్టు కేసులు కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ 1998 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించి న పథకం?
1) స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం
2) కర్ వివాద్ సమాధాన్
3) టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 2
15. భారత్‌లో జీరోబేస్డ్ బడ్జెటింగ్‌ను కింది ఏ డిపార్ట్మెంట్లో మొదటిగా ప్రవేశపెట్టారు?
1) వ్యవసాయ, నీటిపారుదల
2) రక్షణ
3) రైల్వే
4) చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయాధార గ్రామీణ పరిశ్రమలు
- View Answer
- సమాధానం: 4
16. విలువ ఆధారిత పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2004 ఏప్రిల్ 1
2) 2005 ఏప్రిల్ 1
3) 2006 ఏప్రిల్ 1
4) 2008 ఏప్రిల్ 1
- View Answer
- సమాధానం: 2
17. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసే పెట్టుబడి వ్యయాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
1) రెవెన్యూ వ్యయం
2) మూలధన ఆదాయం
3) మూలధన వ్యయం
4) రెవెన్యూ ప్రణాళికేతర వ్యయం
- View Answer
- సమాధానం: 3
18. గిని గుణకాన్ని రూపొందించిన కోరాడో గిని ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త?
1) ఫ్రాన్స్
2) రష్యా
3) బ్రెజిల్
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 4
19. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951లో కింది ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
1) కె.సి. నియోగి
2) కాల్డర్
3) డి.ఆర్. గాడ్గిల్
4) విజయ్ కేల్కర్
- View Answer
- సమాధానం: 1
20. 14వ ఆర్థిక సంఘంలో కింది వారిలో ఎవరు సభ్యులు కారు?
1) ఎం. గోవిందరావు
2) అభిజిత్ సేన్
3) సుష్మానాథ్
4) విజయ్ కేల్కర్
- View Answer
- సమాధానం: 4
21. 13వ ఆర్థిక సంఘాన్ని కింది ఏ కాలానికి సంబంధించి నియమించారు?
1) 2000-2005
2) 2005-2010
3) 2010-2015
4) 2015-2020
- View Answer
- సమాధానం: 3
22. చిన్న దుకాణదారుల నుంచి సంభావన పన్ను(presumptive tax) వసూలు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?
1) కె.ఎల్. రేఖీ కమిటీ
2) రాజా చెల్లయ్య కమిటీ
3) విజయ్ కేల్కర్ కమిటీ
4) రఘురామ్ రాజన్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
23. ఎస్టేట్ సుంకాన్ని మొదటిగా భారత్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1951
2) 1952
3) 1953
4) 1954
- View Answer
- సమాధానం: 3
24. కింది వాటిలో పరోక్ష పన్ను కానిది ఏది?
1) కస్టమ్స్ సుంకం
2) సంపద పన్ను
3) ఎక్సైజ్ పన్ను
4) సేవల పన్ను
- View Answer
- సమాధానం: 2
25. 1976 జూలైలో ఏర్పాటైన పరోక్ష పన్నుల ఎంక్వయిరీ కమిటీ అధ్యక్షుడు?
1) ఎల్.కె. ఝా
2) సంతానం
3) వై.బి. చవాన్
4) కాసు బ్రహ్మానంద రెడ్డి
- View Answer
- సమాధానం: 1
26. కింది వాటిలో అభివృద్ధేతర వ్యయం కానిది ఏది?
1) రక్షణ
2) వడ్డీ చెల్లింపులు
3) సాంఘిక సేవలపై వ్యయం
4) పన్ను వసూలు చార్జీలు
- View Answer
- సమాధానం: 3
27.కోశ బాధ్యత, నిర్వహణ చట్టానికి సంబంధించి 2000లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
1) కె.సి. నియోగి
2) విజయ్ కేల్కర్
3) రంగరాజన్
4) వై.వి. రెడ్డి
- View Answer
- సమాధానం: 2
28. రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందే తాత్కాలిక ట్రెజరీ బిల్లుల స్థానంలో కింది ఏ ఒప్పందం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య జరిగింది?
1) వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్
2) టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్
3) ఈక్విటీ సబ్సిడీ
4) క్రమబద్ధీకరణ సబ్సిడీ
- View Answer
- సమాధానం: 1
29. ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కింది వాటిలో కారణం ఏది?
1) పట్టణీకరణ
2) పరిపాలన యంత్రాంగం విస్తరణ
3) జి.డి.పి. పెరుగుదల
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. దేశంలోని నల్లధనం పెరుగుదల కింది ఏ పరిణామానికి దారితీయదు?
1) అధిక ద్రవ్యోల్బణం
2) ఆర్థిక సమానత
3) పోటీ సమాంతర ఆర్థిక వ్యవస్థ
4) అనుత్పాదక కార్యక్రమాలపై అధిక వ్యయం
- View Answer
- సమాధానం: 2
31. కేంద్ర ప్రభుత్వానికి అధిక రాబడినిస్తున్న పన్ను?
1) కార్పొరేషన్ పన్ను
2) ఆదాయ పన్ను
3) సంపద పన్ను
4) కాపిటల్ గెయిన్స్ టాక్స్
- View Answer
- సమాధానం: 1
32. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ నష్ట పరిహారాన్ని ఎంత చెల్లించింది?
1) రూ. 45,844 కోట్లు
2) రూ. 46,844 కోట్లు
3) రూ. 47,844 కోట్లు
4) రూ. 89,885 కోట్లు
- View Answer
- సమాధానం: 3
33. సంపద పన్నును సిఫార్సు చేసింది ?
1) కాల్డర్
2) ఆసిందాస్ గుప్తా
3) కె.సి. నియోగి
4) వై.బి. చవాన్
- View Answer
- సమాధానం: 1