1868లో భారత్ తలసరి ఆదాయాన్ని దాదాభాయ్ నౌరోజీ ఎంతగా అంచనా వేశారు?
1. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తిని కింది వాటిలో దేనిగా పరిగణిస్తారు?
1) వాస్తవిక జాతీయాదాయం
2) వ్యష్టి ఆదాయం
3) వ్యయార్హ ఆదాయం
4) ప్రభుత్వ వ్యయం
- View Answer
- సమాధానం: 1
2. విదేశీ కారక నికర ఆదాయం ధనాత్మకంగా కింది ఏ పరిస్థితుల్లో ఉంటుంది?
1) స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉన్నప్పుడు
2) నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉన్నప్పుడు
3) స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి కంటే అధికంగా ఉన్నప్పుడు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
3. ఆదాయ పంపిణీ, ప్రజల జీవన ప్రమాణ స్థాయిపై 1960లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు ఎవరు?
1) గౌరవ్ దత్
2) మహలనోబిస్
3) లిందాల్
4) ఎన్.ఎస్. అయ్యంగార్
- View Answer
- సమాధానం: 2
4. 1868లో భారత్ తలసరి ఆదాయాన్ని దాదాభాయ్ నౌరోజీ ఎంతగా అంచనా వేశారు?
1) రూ. 20
2) రూ. 31
3) రూ. 50
4) రూ. 80
- View Answer
- సమాధానం: 1
5. శాస్త్రీయ పద్ధతిలో భారత్‌లో తలసరి ఆదాయాన్ని మొదటిసారిగా అంచనా వేసినవారు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) లార్డ కర్జన్
3) వి.కె.ఆర్.వి. రావు
4) వాడియా, జోషి
- View Answer
- సమాధానం: 3
6. జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల సమ్మేళనాన్ని ఉపయోగించిన వారెవరు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) వి.కె.ఆర్.వి. రావు
3) ఖంబట్టా
4) విలియం డిగ్బీ
- View Answer
- సమాధానం: 2
7. 2017-18లో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి శాతం?
1) 5.4
2) 6.1
3) 7.1
4) 8.2
- View Answer
- సమాధానం: 1
8.భారత్‌లో జాతీయాదాయ వృద్ధి తక్కువగా ఉండటానికి కారణం ఏది?
a) జనాభా వృద్ధి అధికం
b)పెట్టుబడి రేటు తక్కువ
c) వృత్తి నిర్మాణతలో మార్పు వేగంగా లేకపోవడం
d) అల్ప సాంకేతిక ప్రగతి
1)aమాత్రమే
2) b, cమాత్రమే
3) dమాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
9. 2017-18లో స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి ఎంత శాతం?
1) 3.1
2) 3.4
3) 3.6
4) 3.8
- View Answer
- సమాధానం: 2
10.గాడ్గిల్, వి.కె.ఆర్.వి. రావు, మహలనోబిస్లు కింది ఏ కమిటీలో సభ్యులు?
1) మొదటి ఆర్థిక సంఘం
2) జాతీయాదాయ కమిటీ
3) జాతీయాభివృద్ధి మండలి
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
11. నిరంతర సాంకేతిక ప్రగతి కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) హిందూ వృద్ధి రేటు
2) అసంతులిత వృద్ధి
3) ఆధునిక ఆర్థిక వృద్ది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
12. స్థూల పెట్టుబడికి, నికర పెట్టుబడికి మధ్య ఉన్న వ్యత్యాసం నికర జాతీయోత్పత్తితో పోల్చినప్పుడు కింది వాటిలో దేనిలో అధికం?
1) నికర దేశీయోత్పత్తి
2) స్థూల జాతీయోత్పత్తి
3) తలసరి ఆదాయం
4) జి.డి.పి. డిఫ్లీటర్
- View Answer
- సమాధానం: 2
13.స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వ రంగ కార్యకలాపాలు కింది వాటిలో ఏ విభాగాలకు పరిమితమైంది?
1) రైల్వే
2) నీటి పారుదల
3) సమాచారం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో ద్వితీయ రంగ కార్యకలాపం కానిది ఏది?
1) నిర్మాణ రంగం
2) బ్యాంకింగ్
3) వస్తువుల తయారీ
4) విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా
- View Answer
- సమాధానం: 2
15. వైయక్తిక ఆదాయ పంపిణీని పంచవర్ష ప్రణాళికల రెండో దశాబ్దంలో అంచనా వేసిన వారెవరు?
1) పి.డి. ఓఝా, వి.వి. భట్
2) మహలనోబిస్, గాడ్గిల్
3) ఎన్ఎస్ఎస్ఓ, సీఎస్ఓ
4) వి.కె.ఆర్.వి. రావు
- View Answer
- సమాధానం: 1
16. కింది వారిలో జాతీయాదాయ అకౌంటింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనతో ముడిపడి ఉన్న వ్యక్తి?
1) ఫిండ్లే షిర్రాస్
2) నౌరోజీ
3) గున్నార్ మిర్థాల్
4) వి.కె.ఆర్.వి. రావు
- View Answer
- సమాధానం: 4
17. కేంద్ర గణాంక సంస్థకు అవసరమైన గణాంకాలను జాతీయాదాయాన్ని అంచనావేసే క్రమంలో సేకరణ సంస్థ ఏది?
1) రిజర్వ్ బ్యాంక్
2) ఎన్ఎస్ఎస్ఓ
3) ఆర్థిక సంఘం
4) జాతీయాదాయ కమిటీ
- View Answer
- సమాధానం: 2
18. జె.ఆర్. హిక్స్ కింది వాటిలో దేనిని రూపొందించాడు?
1) సాంఘిక పరిగణన
2) పేదరిక విషవలయాలు
3) చక్రీయ ప్రవాహం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
19. ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టాన్ని (ఎంఆర్టీపీ) ఏ సంవత్సరంలో చేశారు?
1) 1952
2) 1956
3) 1966
4) 1969
- View Answer
- సమాధానం: 3
20. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ను ప్రచురించే సంస్థ ఏది?
1) ఎన్ఎస్ఎస్ఓ
2) సీఎస్ఓ
3) ఎన్సీఏఈఆర్
4) ఆర్బీఐ
- View Answer
- సమాధానం: 2
21. కింది వాటిలో సేవారంగ కార్యకలాపం కానిది ఏది?
1) చేపల వేట
2) పర్యాటకం
3) రవాణా
4) బ్యాంకింగ్
- View Answer
- సమాధానం: 1
22. హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని మొదటిగా సంబోధించింది ఎవరు?
1) వి.కె.ఆర్.వి. రావు
2) జాతీయాదాయ కమిటీ
3) ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ
4) ఫిండ్లే షిర్రాస్
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో వి.కె.ఆర్.వి. రావు రాసిన గ్రంథం ఏది?
1) Wealth of Nations
2) An essay on India's national income
3) Asian Drama
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
24. ఆర్థికాభివృద్ధి జరిగేటప్పుడు జాతీయదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతుందని కింది వారిలో ఎవరు అభిప్రాయ పడ్డారు?
1) సైమన్ కుజ్నెట్స్
2) అమర్త్యసేన్
3) కీన్స్
4) మార్షల్
- View Answer
- సమాధానం: 1
25. బదిలీ చెల్లింపులు కింది వాటిలో దేనిలో భాగంగా ఉంటాయి?
1) జాతీయదాయం
2) జి.డి.పి. డిఫ్లేటర్
3) వ్యష్టి ఆదాయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
26. కామర్స్ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 1945-46లో భారత్ జాతీయాదాయం?
1) రూ. 6,234 కోట్లు
2) రూ. 7,550 కోట్లు
3) రూ. 7,650 కోట్లు
4) రూ. 10,200 కోట్లు
- View Answer
- సమాధానం: 1
27. భారత దేశంలో జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి రేటు పెంపునకు కింది వాటిలో ఏ చర్య ఉపకరించదు?
1) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి
2) పురోగామి పన్ను విధాన అమలు
3) తిరోగామి పన్ను విధానం
4) అధిక పెట్టుబడి
- View Answer
- సమాధానం: 3
28. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసవేస్తే వచ్చేది?
1) స్థూల జాతీయోత్పత్తి
2) నికర జాతీయోత్పత్తి
3) వ్యయార్హ ఆదాయం
4) నికర దేశీయోత్పత్తి
- View Answer
- సమాధానం: 4
29. ఇతర దేశాల్లో పనిచేసే దేశ పౌరుల ఆదాయం కింది వాటిలో దేనిలో భాగంగా ఉంటుంది?
1) జి.డి.పి.
2) జి.ఎన్.పి.
3) ఎన్.డి.పి.
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
30.ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారయ్యే అంతిమ వస్తు సేవల ద్రవ్యరూప విలువ మొత్తం?
1) జి.డి.పి.
2) జి.ఎన్.పి.
3) ఎన్.ఎన్.పి.
4) జి.ఎన్.పి. ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్
- View Answer
- సమాధానం: 1
31. వాస్తవిక ఆదాయాన్ని ఎలా సాధించవచ్చు?
1) తలసరి ఆదాయం కార్పొరేట్ పన్నులు
2) నికర దేశీయోత్పత్తి + సబ్సిడీలు
3) ద్రవ్య ఆదాయం / ధరల సూచీ
4) జాతీయాదాయం / జనాభా
- View Answer
- సమాధానం: 3
32. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తిని ఎలా కనుక్కోవచ్చు?
1) మార్కెట్ ధరల వద్ద జి.ఎన్.పి. + పరోక్ష పన్నులు + సబ్సిడీలు
2) మార్కెట్ ధరల వద్ద జి.డి.పి. పరోక్ష పన్నులు + సబ్సిడీలు
3) వ్యష్టి ఆదాయం బదిలీ చెల్లింపులు
4) వ్యయార్హ ఆదాయం బదిలీ చెల్లింపులు
- View Answer
- సమాధానం: 2
33. ‘భారత్‌లో వినియోగదారుల వ్యయం’ గ్రంథ కర్త ఎవరు?
1) ఫిండ్లే షిర్రాస్
2) కీన్స
3) మార్షల్
4) ఆర్.సి. దేశాయ్
- View Answer
- సమాధానం: 4
34. భారత జాతీయాదాయంలో సంస్కరణల కాలంలో కింది ఏ రంగం వాటా ఎక్కువ?
1) వ్యవసాయ రంగం
2) పారిశ్రామిక రంగం
3) వ్యవసాయ అనుబంధ రంగం
4) సేవా రంగం
- View Answer
- సమాధానం: 4
35.పశుపోషణ కింది వాటిలో ఏ రంగానికి సంబంధించింది?
1) ప్రాథమిక రంగం
2) ద్వితీయ రంగం
3) తృతీయ రంగం
4) తయారీ రంగం
- View Answer
- సమాధానం: 1
36. 2016-17లో స్థిర ధరల వద్ద జాతీయాదాయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా శాతం?
1) 13.11
2) 14.5
3) 15.11
4) 17.89
- View Answer
- సమాధానం: 3