ఊపిరితిత్తులలో ‘ఉచ్చ్వాసం’, ‘నిశ్వాసం’ ప్రక్రియల్లో జరిగే మార్పులు ?
1. ఊపిరితిత్తులలో ‘ఉచ్చ్వాసం’, ‘నిశ్వాసం’ ప్రక్రియల్లో జరిగే మార్పులు వరసగా..
1) లోపలి పీడనం తగ్గుతుంది - లోపలి పీడనం పెరుగుతుంది
2) లోపలి పీడనం పెరుగుతుంది - లోపలి పీడనం తగ్గుతుంది
3) లోపలి పీడనం తగ్గుతుంది - లోపలి పీడనం తగ్గుతుంది
4) లోపలి పీడనం పెరుగుతుంది - లోపలి పీడనం పెరుగుతుంది
- View Answer
- సమాధానం: 1
వివరణ: గాలిని బయటి నుంచి లోపలికి తీసుకోవడం ఉచ్ఛ్వాసం అయితే గాలిని బయటకు వదలడాన్ని నిశ్వాసం అంటారు. ఈ ప్రక్రియలో మొదట లోపలి పీడనం తగ్గి తర్వాత పీడనం పెరుగుతుంది. అంటే ఉరఃకుహరం పెరగడం వల్ల లోపల పీడనం తగ్గుతుంది. ఫలితంగా బయటి నుంచి గాలి లోపలికి వస్తుంది. అదే విధంగా నిశ్వాసంలో పీడనం పెరగడం వల్ల గాలి బయటకు వెళ్తుంది.
- సమాధానం: 1
2. మన దేహంలో కదలని కీలు, మడతబందు కీలు ఉన్న అవయవాలు ఏవి?
1) భుజం, మెడ
2) పై దవడ - తల, ముంజేయి
3) కింది దవడ - తల, భుజం
4) మోకాలు, మెడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: శరీరంలో రెండు ఎముకలు కలిసే చోటును కీలు అంటారు. ఇవి కదిలే కీళ్లు, కదలని కీళ్లు అని రెండు రకాలు. తలలోని పుర్రెలో ఉన్న ఎముకలన్నీ కదలని కీళ్లు. అలాగే పై దవడ కూడా ముంజేయిలో మడత బంధు కీలు ఉంటుంది. దీని ద్వారా చేయిని ఒకవైపు మాత్రమే ముడవగలం.
- సమాధానం: 2
3. ద్విపార్శ్వ సౌష్ఠవం, త్రిస్తరిత లక్షణంతోపాటు ఖండితయుత దేహం కలిగివున్న జీవులు ఏవి?
1) జలగలు
2) ఆల్చిప్పలు
3) ఏలిక పాములు
4) సీ ఆర్చిన్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: అనెలిడా వర్గానికి చెందిన జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉండి, మూడు స్తరాలను కలిగి ఉంటాయి. బాహ్య, మధ్య, అంతస్త్వచాలతో ఏర్పడిన శరీరం ఖండీభవనాన్ని చూపుతాయి. జలగలో 33 ఖండితాలు ఉంటాయి.
- సమాధానం: 1
4. ‘తారక’ పరిమాణాన్ని కాంతి తీవ్రతను బట్టి సర్దుబాటు చేయగల కండర నిర్మాణం?
1) శైలికామయ కండరాలు
2) అవలంబిత స్నాయువులు
3) కంటిపాప
4) స్నాయువులు, కండరాలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐరిస్ లేదా కంటిపాప కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణాన్ని సర్దుబాటు చేస్తుంది. కాంతి తీవ్రంగా ఉన్నపుడు కంటిపాప చిన్నదిగా మారుతుంది. అదే విధంగా కాంతి లేనపుడు కంటిపాప పెద్దదిగా మారి ఎక్కువ కాంతిని తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
- సమాధానం: 3
5. సూక్ష్మమైన మొక్కలు, జంతువులపై కీటకనాశనులు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని తన గ్రంథంలో సూచించిన శాస్త్రవేత్త ఎవరు?
1) రేచల్ కార్సన్
2) జూలియట్ క్యూరి
3) మేరీ ఎన్నింగ్
4) రోసాలిండ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రేచల్ కార్సన్ అనే శాస్త్రవేత్త, రచయిత అమెరికా దేశానికి చెందినవారు. ఈమె ‘సెలైంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని 1962లో రాశారు. రసాయన క్రిమిసంహారకాల వల్ల అనేక రకాల జీవ జాతి నశిస్తుందని ఆమె ప్రతిపాదించారు. దీని ప్రభావంతోనే DDT వంటి మందులను నిషేధించారు.
- సమాధానం: 1
6. కింది వాటిలో నీటి నుంచి ఆహారాన్ని వడపోసి గ్రహించడానికి తమ దంతాలను ఉపయోగించుకొనేవి ఏవి?
1) కొంగ - కప్ప
2) చేప - బాతు
3) చేప - బల్లి
4) కప్ప - బాతు
- View Answer
- సమాధానం: 2
వివరణ: నీటిలో అనేక జీవ జాతులు నివశిస్తాయి. అందులో చేప, బాతులు ముఖ్యమైనవి. ఇవి నీటి నుంచి ఆహారాన్ని తమ దంతాల ద్వారా వడపోసి గ్రహిస్తాయి. ఇది నీటి యొక్క అనుకూలనం.
- సమాధానం: 2
7. సాక్యులస్, యుట్రిక్యులస్ల నుంచి బయలుదేరిన నాడీ తంతువులు కలసి ఏర్పడేది?
1) కర్ణావర్త నాడి
2) పేటికా నాడి
3) శ్రవణ నాడి
4) దృక్ నాడి
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర చెవిలో సాక్యులస్, యుట్రిక్యులస్లు ఉంటాయి. ఇవి శరీరానికి సమతాస్థితిని కల్పించడానికి పనికి వస్తాయి. వీటి నుంచి పేటికా నాడి ఏర్పడుతుంది. ఇది 8వ కపాల నాడి. ఇది అంతర చెవి నుంచి సమతాస్థితి సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది.
- సమాధానం: 2
8. రవి రక్తవర్గం 'A', రవి తండ్రి రక్తవర్గం 'O'. అత్యవసర సమయంలో రవికి, రవి తండ్రికి రక్తదానం అవసరమైతే ఎక్కించాల్సిన రక్త వర్గాలు?
రవి రవి తండ్రి
1) A, O O
2) AB AB
3) B, O A
4) B B, O
- View Answer
- సమాధానం: 1
వివరణ: రక్తవర్గాలు రక్తంలోని కారకాల వల్ల ఏర్పడతాయి. A, B, AB, O రక్తవర్గాలను గుర్తించారు. రవి రక్తవర్గం 'A' అయితే అతనికి A, O వర్గం రక్తాన్ని, రవి తండ్రిది 'O' కాబట్టి ’O' రక్తవర్గం నుంచి మాత్రమే ఇవ్వాలి. 'O' రక్తవర్గాన్ని విశ్వదాత అని, 'AB' రక్తవ ర్గాన్ని విశ్వగ్ర హీత అంటారు.
- సమాధానం: 1
9. క్లోమం స్రవించే ఎంజైములు ఏవి?
1) అమైలేజ్, సుక్రేజ్, లైపేజ్
2) ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్
3) లైపేజ్, పెప్సిన్, టయలిన్
4) పెప్సిన్, లైపేజ్, సుక్రేజ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్లోమం జీర్ణగ్రంథి. ఇది ఆంత్రమూలం వంపులో ఉండే బల్లపరుపు నిర్మాణం ఉన్న గ్రంథి. ఇది ట్రిప్సిన్ (ప్రోటిన్లపై) అమైలేజ్ (పిండి పదార్థాలపై), లైపేజ్ (కొవ్వులు)లను స్రవిస్తుంది.
- సమాధానం: 2
10. మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు ఉన్న కవాటాలు?
1) అగ్రత్రయ కవాటం, పుపుస ధమని కవాటం
2) అగ్రత్రయ కవాటం, మహాధమని కవాటం
3) అగ్రద్వయ కవాటం, మహాధమని కవాటం
4) మిట్రల్ కవాటం, పుపుస ధమని కవాటం
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుండెలో కుడి పార్శ్వంలో అగ్రత్రయ కవాటం, పుపుస ధమని కవాటాలు ఏర్పడి ఉంటాయి. అగ్రత్రయ కవాటం కుడి కర్ణికా - జఠరికా విభాజకంపైన, అదే విధంగా పుపుస ధమనీ చాపం వద్ద పుపుస ధమనీ కవాటాలు ఏర్పడి ఉంటాయి. ఇవి రక్తాన్ని ఏకముఖంగా ప్రవహింపజేస్తాయి.
- సమాధానం: 1
11. రక్తకేశనాళికా గుచ్ఛంలో పీడనం పెరగడానికి కారణమేమిటి?
1) సన్నని నాళం ఉన్న అభివాహి ధమనిక
2) పోడోసైట్ల మధ్య ఉన్న సూక్ష్మరంధ్రాలు
3) సన్నని నాళం ఉన్న అపవాహి ధమనిక
4) సన్నని నాళం ఉన్న అపవాహి సిరిక
- View Answer
- సమాధానం: 3
వివరణ: రక్తకేశనాళికా గుచ్ఛం అభివాహి నాళికలతో ఏర్పడుతుంది. ఇందులో నుంచే అపవాహిక నాళికలు ప్రారంభమవుతాయి. అపవాహి ధమనిక వ్యాసం అభివాహి ధమనిక కంటె తక్కువగా ఉండటం వల్ల గ్లామరులస్లో పీడనం పెరుగుతుంది.
- సమాధానం: 3
12. కింది వాటిలో ఒకే సందర్భంలో జరిగే ప్రతీకారచర్య, సహజాత ప్రవృత్తి ఏది?
1) కదులుతున్నది ఏదైనా మొదటిసారి కనిపిస్తే దాని వెనకే వెళ్లడం
2) మొనదేలిన వస్తువును తాకినపుడు కలిగే ప్రతిస్పందన
3) సంతానోత్పత్తి కోసం భిన్న లింగ జీవులను ఎన్నుకోవడం
4) బడిగంట మోగగానే విద్యార్థులు మైదానాన్ని వదలి వెళ్లడం
- View Answer
- సమాధానం: 2
వివరణ: మొనదేలిన వస్తువును తాకినపుడు అసంకల్పిత ప్రతీకార చర్య జరుగుతుంది. ఫలితంగా మనం చేయిని వెంటనే వెనక్కు తీసుకుంటాం. ఇది మనకు పుట్టుకతో వచ్చిన లక్షణం.
- సమాధానం: 2
13. హేమంత్ తన ఆహారంలో నీటిలో కరిగే, కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. కింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్, నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
1) ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం
2) బయోటిన్, కాల్సిఫెరాల్
3) టోకోఫెరాల్, ఫిల్లోక్వినోన్
4) రెటినాల్, పైరిడాక్సిన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: విటమిన్ శరీరానికి ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు. ఇవి రెండు రకాలు.
1. కొవ్వులో కరిగేవి - విటమిన్ ఎ, డి, ఇ, కెలు
2. నీటిలో కరిగేవి - బి, సిలు.
రెటినాల్ (విటమిన్-ఎ), పైరిడాక్సిన్ (విటమిన్-బి6)లు
- సమాధానం: 4
14. కింది వాటిలో ‘దండాల’ ప్రత్యేక లక్షణం ఏమిటి?
1) అతి తక్కువ కాంతిలో వస్తువులను గుర్తించడం
2) కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తించడం
3) రంగుల్లోని ప్రత్యేకతల్ని గుర్తించడం
4) దృష్టి స్పష్టంగా ఉండేలా చేయడం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కంటిలో రెండు రకాల కణాలు ఉంటాయి.
1) దండాలు (రాడ్స్)
2) శంఖువులు (కోన్స్)
అతి తక్కువ కాంతిలో వస్తువులను గుర్తించడానికి దండాలు ఉపయోగపడతాయి. శంఖువులు కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తించడానికి సహాయపడతాయి.
- సమాధానం: 1
15. వేర్వేరు మట్టి నమూనాలు, ప్లాస్టిక్ గరాటు, వడపోత కాగితం, నీరు, కొలజాడి, డ్రాపర్లను ఉపయోగించి నిర్వహించే ప్రయోగం ద్వారా తెలుసుకోగలిగేది?
1) మట్టిలో తేమ శాతం
2) మట్టి నీటిని పీల్చుకునే స్వభావం
3) మట్టిలోని ఖనిజ లవణాలు
4) మట్టిలో ఉండే పదార్థాలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: మట్టి నీటిని పీల్చుకునే స్వభావంను తెలుసుకోవడానికి ప్రయోగాన్ని నిర్వహించడానికి ఈ వస్తువులు అవసరం. మట్టి నమూనాలను సేకరించి వడపోత కాగితం ద్వారా ప్రయోగాన్ని నిర్వహిస్తారు.
- సమాధానం: 2
16. కింది ఏ ఆల్కలాయిడ్ స్క్రీజోఫ్రీనియాను నివారిస్తుంది?
1) థియీన్
2) మార్ఫీన్
3) రిసర్పిన్
4) అట్రోపిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మొక్కలలో ఏర్పడే ద్వితీయ జీవక్రియోత్పన్నాలు ఆల్కలాయిడ్లు. రావుల్ఫియా సర్పంటైనా (సర్పగంధి) మొక్క వేర్లు, బెరడులో రిసర్పిన్ దొరుకుతుంది. ఇది పాము కాటుకు ప్రధాన మందు. అంతేకాకుండా మానసిక వ్యాధి అయిన స్క్రీజోఫ్రీనియా నివారణలోనూ ఉపయోగిస్తారు.
- సమాధానం: 3
17. సకశేరుకాల కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లోపిస్తే?
1) ప్రొటీన్ల సంశ్లేషణ జరగదు
2) జీర్ణరసాల ఉత్పత్తి జరగదు
3) కొవ్వుల సంశ్లేషణ జరగదు
4) విషపదార్థాల నిర్వీర్యం జరగదు
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జీవ ద్రవ్యజాలంను కణ అస్థిపంజరం అంటారు. ఇది కేంద్రక త్వచం నుంచి కణత్వచం వరకు విస్తరించి ఉంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
- సమాధానం: 4
18. A, B ల నుంచి సరైన వాటిని ఎన్నుకొని కింది పట్టికను పూరించండి.
వినాళ గ్రంథి పేరు విడుదలచేసే హార్మోన్
స్త్రీ బీజకోశం - A
B - ల్యూటినైజింగ్ హార్మోన్
1) A : ప్రొలాక్టిన్, B: క్లోమం
2) A : ప్రొజెస్టిరాన్, B: పిట్యుటరీ
3) A : అడ్రినలిన్, B: అడ్రినల్
4) A : థైరాక్సిన్, B : థైమస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: A. ప్రొజెస్టిరాన్ - స్త్రీబీజకోశం స్రవిస్తుంది. ఇది గర్భాశయం అంతర పొరను ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
B. పిట్యూటరీ గ్రంథి - ల్యూటినైజింగ్ హార్మోన్ను స్రవిస్తుంది. ఇది పురుషులలో టెస్టోస్టిరాన్ స్రవించడంలోను, స్త్రీలలో అండోత్సర్గానికి సహాయపడుతుంది.
- సమాధానం: 2
19. కస్క్యుట రెఫ్లెక్సా దేని ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది?
1) అంటు వేర్లు
2) చూషకాలు
3) వాయుగత వేర్లు
4) లెంటికణాలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: కస్క్యుట లేదా బంగారు తీగ మొక్క పరాన్న జీవనం జరిపే మొక్క. ఇది ఇతర మొక్కలపై అంటు వేళ్లతో అంటిపెట్టుకొని హాస్టోరియాలు (చూషకాలు) ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తాయి.
- సమాధానం: 2