శాతవాహనులు, ఇక్ష్వాకులు
1. గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-II, 2003)
1) గాథాసప్తశతి - హాలుడు
2) బుద్ధచరితం - నాగార్జునుడు
3) కామసూత్రం - వాత్స్యాయనుడు
4) బృహత్కథ - గుణాఢ్యుడు
- View Answer
- సమాధానం: 2
2. అశోకుడి శిలా శాసనాలను ఏ లిపిలో చెక్కారు? (Gazetted, 2005)
1) పాళీ
2) ఖరోష్టి
3) బ్రాహ్మి
4) దేవనాగరి
- View Answer
- సమాధానం: 3
3.‘కవివత్సలుడు’ అనేది ఎవరి బిరుదు?(Group-II, 2008)
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) హల శాతవాహనుడు
3) మూడో మాధవ వర్మ
4) రాజరాజ నరేంద్రుడు
- View Answer
- సమాధానం: 2
4. ‘ఆంధ్ర’ అనే పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
1) రుగ్వేదం
2) సామవేదం
3) ఐతరేయ బ్రాహ్మణం
4) మాండ్యూకోపనిషత్తు
- View Answer
- సమాధానం: 3
5. ఆంధ్ర ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’ అని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
1) భీమసేన జాతకం
2) శక్తి సంగమ తంత్రం
3) సెరివణిజ జాతకం
4) సింహళ జాతకం
- View Answer
- సమాధానం: 2
6. పురాణాల్లో పేర్కొన్న ‘ఆంధ్ర భృత్యులు’, శాతవాహనులు ఒక్కరేనని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు?
1) విష్ణువాసుదేవ మిరాశీ
2) వి.ఎన్. సుక్తాంకర్
3) పి.టి. శ్రీనివాస అయ్యంగార్
4) ఆర్.జి. భండార్కర్
- View Answer
- సమాధానం: 4
7. శాతవాహన రాజులు వారి పేర్ల ముందు మాతృ గోత్ర నామాలను చేర్చుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది?(Group-II, 2008)
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) శ్రీముఖుడు
3) వాసిష్టీపుత్ర పులోమావి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 1
8. ‘ఓడ ముద్రలు’ ఉన్న సీసపు నాణేలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?
1) హాలుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) రెండో పులోమావి
4) కుంతల శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
9. కింద పేర్కొన్న వారిలో ఎవరిని శాతవాహన పాలనా స్థాపకుడిగా గుర్తించారు? (Group-II, 2008)
1) మొదటి శాతకర్ణి
2) సిముఖుడు
3) కుంతల శాతకర్ణి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
10. కింది వాటిలో ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?(Group-I, 1991)
1) నాసిక్ గుహ శాసనం
2) నానాఘాట్
3) అమరావతి
4) హాతిగుంఫా
- View Answer
- సమాధానం: 4
11. ‘అమరావతి స్తూపం’ను ఎవరి కాలంలో నిర్మించారు?(Group-II, 2008)
1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) శాలంకాయనులు
- View Answer
- సమాధానం:2
12.‘నానాఘాట్’ శాసనాన్ని వేయించింది ఎవరు?(Gazetted, 2009)
1) గౌతమీ బాలాశ్రీ
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) దేవీ నాగానిక
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 3
13. ‘గాథాసప్తశతి’ ప్రాకృత పదాల్లో ప్రధాన అంశం ఏది? (Civils Prelims, 2002)
1) జానపద పదాల వివరణ
2) శృంగార పదాల వివరణ
3) చిలుక చెప్పిన కథలు
4) పురాణాల కథనం
- View Answer
- సమాధానం: 2
14. గౌతమీపుత్ర బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించారు?(Group-II, 2008)
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) వాసిష్టీపుత్ర పులోమావి
3) సుందర శాతకర్ణి
4) శివశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
15.నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? (Group-I, 1994)
1) సిముఖుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) రెండో శాతకర్ణి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
16. శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడు ఎవరు? (Group-II, 2008)
1) ఆర్.జి. భండార్కర్
2) వి.ఎన్. సుక్తాంకర్
3) రాప్సన్
4) గోపాలాచారి
- View Answer
- సమాధానం: 1
17. గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
1) పితల్ కోరా
2) నాసిక్
3) నానాఘాట్
4) జున్నార్
- View Answer
- సమాధానం: 2
18. శాతవాహనులకు చెందిన ఏ పాలకుడి కాలంలో ప్రాకృత భాష స్థానంలో ‘సంస్కృతం’ రాజభాషగా మారింది?
1) శ్రీముఖుడు
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) హాలుడు
4) కుంతల శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
19. మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
1) మొదటి శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం:4
20. శకరాజైన విదేశీయుడు మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం ఏది?
1) గిర్నార్ శాసనం
2) నాసిక్ శాసనం
3) హాతిగుంఫా శాసనం
4) నానాఘాట్ శాసనం
- View Answer
- సమాధానం:1
21. ప్రముఖ వర్తక కేంద్రం ‘ప్రతిష్టానపురం’ ఏ నది తీరాన ఉంది?(Gazetted, 2005)
1) కృష్ణా
2) నర్మద
3) గోదావరి
4) తుంగభద్ర
- View Answer
- సమాధానం: 3
22. మాకడోని శాసనంలో పేర్కొన్న ‘గుల్మిక’ పదానికి అర్థం? (Group-II, 2008)
1) గ్రామపెద్ద
2) బానిస
3) వాణిజ్య సుంకం
4) భూస్వామ్య ప్రభువు
- View Answer
- సమాధానం: 1
23. గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-I, 2003)
1) బృహత్కథ - గుణాఢ్యుడు
2) గాథాసప్తశతి - హాలుడు
3) హర్షచరిత్ర - బాణుడు
4) రాజశేఖర చరితం - మల్లన
- View Answer
- సమాధానం: 4
24. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
1) తొండవాడ
2) గుడిమల్లం
3) రేణిగుంట
4) జోగుల మల్లవరం
- View Answer
- సమాధానం: 2
25.ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్‌గా టాలెమీ వర్ణించాడు? (Gazetted, 2005)
1) మైసోలియా (మచిలీపట్నం)
2) నిజాం పట్నం
3) కళింగ పట్నం
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 1
26. మధ్యయుగ భారతదేశంలో రసాయన శాస్త్ర ప్రక్రియలను తెలిపే ‘రసరత్నాకరం’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?(Gazetted, 2005)
1) నాగార్జున సిద్ధుడు
2) వాగ్భటాచార్యుడు
3) మాధవాచార్యుడు
4) నిత్యనాథ సిద్ధుడు
- View Answer
- సమాధానం: 1
27.శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక, మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?(Group-II, 2008)
1) శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ వారి రాజుల్లో కొందరు బౌద్ధమతాన్ని పోషించారు.
2) చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది.
3) స్త్రీలను తక్కువగా చూసేవారు.
4) నౌకాయానం అభివృద్ధి దశలో ఉంది.
- View Answer
- సమాధానం: 3
28. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ‘పూర్ణకుంభం’ను దేని నుంచి గ్రహించారు?
1) నాగార్జున కొండ శిల్పం
2) కాకతీయ శిల్పం
3) విజయనగర శిల్పం
4) అమరావతి శిల్పం
- View Answer
- సమాధానం: 4
29. ‘కథాసరిత్సాగరం’ రచయిత ఎవరు?
1) ధనపాలుడు
2) సోమదేవసూరి
3) క్షమేంద్రుడు
4) హాలుడు
- View Answer
- సమాధానం: 2
30.‘స్కంధా వారం’ దేన్ని సూచిస్తుంది?
1) సైనిక శిబిరం
2) భోజన శాల
3) వ్యాపార కేంద్రం
4) విద్యా శాల
- View Answer
- సమాధానం: 1
31. ‘దక్షిణ భారతదేశ మనువు’గా ఎవరిని అభివర్ణిస్తారు?
1) అగస్త్యుడు
2) ఆపస్తంభుడు
3) రామానుజుడు
4) ధర్మకీర్తి
- View Answer
- సమాధానం: 2
32. ‘కులరికలు’ పదం దేన్ని సూచిస్తుంది?
1) వ్యాపారులు
2) కుమ్మరివారు
3) చర్మకారులు
4) ఔషధాలు తయారు చేసేవారు
- View Answer
- సమాధానం: 2
33. ‘సార్థవాహులు’ అంటే?
1) ధనికులు
2) వ్యవసాయదారులు
3) యంత్రాలు తయారుచేసేవారు
4) వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి వర్తకం చేసేవారు
- View Answer
- సమాధానం: 4
34.శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే ‘సచివాలయం’ కార్యాలయం పేరు?
1) గ్రామేయ
2) నిగమసభ
3) అక్షపటల
4) స్కంధావారం
- View Answer
- సమాధానం: 3
35.దక్షిణ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులు, బౌద్ధ బిక్షువులకు భూదానా లు చేసిన రాజవంశం ఏది?
1) ఇక్ష్వాకులు
2) విష్ణుకుండినులు
3) కాకతీయులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 4
36. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే సుంకం?
1) ఇక్తా
2) భోగ పన్ను
3) కురుకుర
4) దేయభోగం
- View Answer
- సమాధానం: 3
37. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు?
1) రుద్ర పురుష దత్తుడు
2) శ్రీ వీర పురుష దత్తుడు
3) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు
4) ఎహూవల చాంతమూలుడు
- View Answer
- సమాధానం: 3
38.ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఏ రాజు కాలంలో ఆంధ్ర దేశం బౌద్ధ మతానికి స్వర్ణ యుగంగా వర్ధిల్లింది?
1) చాంతమూలుడు
2) రుద్ర పురుషదత్తుడు
3) ఎహూవల చాంతమూలుడు
4) శ్రీ వీర పురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 4
39. భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
1) శాతవాహనులు
2) గుప్తులు
3) ఇక్ష్వాకులు
4) మౌర్యులు
- View Answer
- సమాధానం:3
40. సంస్కృత భాషలో శాసనాలు వేయించిన తొలి ఇక్ష్వాక రాజు ఎవరు?
1) ఎహూవల చాంతమూలుడు
2) శ్రీ వీర పురుషదత్తుడు
3) రుద్ర పురుషదత్తుడు
4) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు
- View Answer
- సమాధానం: 1
41. బృహత్పలాయనుల వంశ చరిత్రను తెలిపే ఏకైక శాసనం ఏది?
1) నాగార్జున కొండ శాసనం
2) మంచికల్లు శాసనం
3) కొండముది తామ్ర శాసనం
4) తుండి శాసనం
- View Answer
- సమాధానం: 3
42. శాలంకాయనుల ఆరాధ్య దైవం ఎవరు?
1) ఇంద్రుడు
2) చిత్రరథ స్వామి
3) విష్ణువు
4) నందీశ్వరుడు
- View Answer
- సమాధానం: 2
43. ‘శ్రీ పర్వత స్వామి’ని కులదైవంగా స్వీకరించిన రాజవంశం ఏది?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) శాలంకాయనులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 4
44. ‘చేజర్ల కపోతేశ్వరాలయం’ నిర్మించిన రాజవంశం ఏది?
1) ఆనంద గోత్రీయులు
2) విష్ణుకుండినులు
3) ఇక్ష్వాకులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 1
45. ఉండవల్లి గుహలు (5), నెల్లూరులోని భైరవుని కొండ గుహలు (8), విజయవాడలోని మొగల్రాజపురం గుహాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) వాకాటకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 4
46. ‘ప్రమాణ సముచ్ఛయం’ గ్రంథ రచయిత ఎవరు?
1) నాగార్జునుడు
2) బుద్ధ పాలితుడు
3) దిగ్నాగుడు
4) భావ వివేకుడు
- View Answer
- సమాధానం: 3
47. ‘పర్ణిక శ్రేణి’ అని ఏ సంఘాన్ని పిలుస్తారు?
1) మిఠాయిలు చేసేవారి సంఘం
2) తమలపాకులు అమ్ముకునే వారి సంఘం
3) కుమ్మరి పనిచేసే వారి సంఘం
4) సాలెపని వారి సంఘం
- View Answer
- సమాధానం: 2
48. ఆంధ్ర దేశంలో ‘సింహళ విహారం’ను ఎక్కడ నిర్మించారు?
1) ధాన్యకటకం
2) ఘంటసాల
3) జగ్గయ్యపేట
4) నాగార్జున కొండ
- View Answer
- సమాధానం: 4
49. శాలంకాయనుల రాజ లాంఛనం ఏది?
1) నందీశ్వరుడు
2) సింహం
3) ఎద్దు
4) చేప
- View Answer
- సమాధానం: 3
50. ‘ఘటికలు’ అంటే ఏమిటి?
1) ఉన్నత విద్యాసంస్థలు
2) గురుకుల పాఠశాలలు
3) సంఘాలు
4) నాటికలు
- View Answer
- సమాధానం: 1
51. బెజవాడలోని ‘అక్కన్న - మాదన్న’ గుహలను ఏ రాజవంశ కాలంలో తొలిచారు?
1) ఇక్ష్వాకులు
2) పల్లవులు
3) శాలంకాయనులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 4
52. విష్ణుకుండినుల కాలం నాటి ప్రఖ్యాతిగాంచిన గుహలు కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) భైరవకొండ
2) బేతంచర్ల
3) ధూళికట్ట
4) ఉండవల్లి - మొగల్రాజపురం
- View Answer
- సమాధానం: 4