ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర - 2
1. హంపీ-విజయ నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది?
1) 1975
2) 1982
3) 1980
4) 1986
- View Answer
- సమాధానం: 4
2. శాతవాహనుల కాలంలో ‘నిగమ సభలు’ వేటి పాలనను నిర్వహించేవి?(Group-II, 2008)
1) గ్రామాలు
2) నగరాలు
3) ప్రాదేశికులు
4) మత విషయాలు
- View Answer
- సమాధానం: 2
3. ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?Group-I, 1995)
1) కొరవి గోపరాజు
2) గౌరన
3) మారన
4) పోతన
- View Answer
- సమాధానం: 1
4. ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది?(Group-II, 2003)
1) న్యాయ వ్యవస్థ
2) రెవెన్యూ పాలన
3) ఆర్థిక వ్యవస్థ
4) పరిపాలనా వ్యవస్థ
- View Answer
- సమాధానం: 1
5. రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది?
1) రాజమహేంద్రవరం
2) పిఠాపురం
3) దేవరకొండ
4) అద్దంకి
- View Answer
- సమాధానం: 4
6. కొండవీటి దుర్గాన్ని ఎవరు నిర్మించారు?
1) కుమార గిరిరెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) అనపోతారెడ్డి
4) కాటయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 3
7. రాజధానిని ‘అద్దంకి’ నుంచి ‘కొండవీటి’కి మార్చిన రెడ్డిరాజు ఎవరు?
1) అనపోతారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) ప్రోలయ వేమారెడ్డి
4) కుమార గిరిరెడ్డి
- View Answer
- సమాధానం: 1
8. ‘కర్పూర వసంతరాయలు’ అనే ఆధునిక కావ్యాన్ని ఎవరు రచించారు?
1) ఆరుద్ర
2) దాశరథీ
3) సి. నారాయణ రెడ్డి
4) శ్రీశ్రీ
- View Answer
- సమాధానం: 3
9.పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు ఎవరు?
1) అన వేమారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కుమారగిరి రెడ్డి
- View Answer
- సమాధానం: 2
10. ‘చాటు కృతులు’ అంటే ఏమిటి?
1) హాస్య గీతాలు
2) నాటకాలు
3) శతకాలు
4) రాజులను కీర్తించే గీతాలు
- View Answer
- సమాధానం: 4
11. చోళ సింహాసనం అధిష్టించిన రాజేంద్రుడు (కులోత్తుంగ చోళుడు) ఎవరి కుమారుడు? (Civils prelims, 1997)
1) విమలాదిత్యుడు
2) గుణగ విజయాదిత్యుడు
3) రాజరాజ నరేంద్రుడు
4) చాళుక్య భీముడు
- View Answer
- సమాధానం: 3
12.గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద ‘సంతాన సాగరం’ అనే పెద్ద చెరువును ఎవరు తవ్వించారు?
1) కాటయ వేమారెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) కుమార గిరిరెడ్డి
4) సూరమాంబ
- View Answer
- సమాధానం: 4
13. రెడ్డిరాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) పులి
2) సింహం
3) వరాహం
4) వృషభం
- View Answer
- సమాధానం: 4
14. రెడ్డిరాజుల కాలంలో భూమిని దేనితో కొలిచేవారు?
1) తాడు
2) గొలుసు
3) కేసరపాటి గడ
4) మూరలు
- View Answer
- సమాధానం: 3
15. అవచి తిప్పయ్య చెట్టిని ఏ రెడ్డిరాజు కాలంలో ‘సుగంధ భాండాగారికుడు’గా నియమించారు?
1) అన వేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
16. కృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు ఎవరు? (Civils prelims, 2000)
1) నంది తిమ్మన
2) అల్లసాని పెద్దన
3) ధూర్జటి
4) భట్టుమూర్తి
- View Answer
- సమాధానం: 2
17.కింది వాటిలో క్రీ.శ. 1565 నాటి విజయనగర రాజు ‘అలియ రామరాయలు’ కాలం నాటి ‘తాళికోట (తల్లికోట) యుద్ధం’లో పాల్గొనని దక్కన్ రాజ్యం ఏది?(Civils prelims, 2000)
1) బీరార్
2) బీజాపూర్
3) గోల్కొండ
4) బీదర్
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో సరైన జత ఏది?(Civils prelims, 1999)
1) శ్రీకృష్ణదేవరాయలు - మనుచరిత్ర
2) మొదటి బుక్కరాయలు - వైదిక మార్గ ప్రవర్తక
3) అల్లసాని పెద్దన - ఆముక్త మాల్యద
4) గంగాదేవి - అమరు శతకం
- View Answer
- సమాధానం: 2
19. జైనులు, వైష్ణవుల మధ్య ఘర్షణలను నివారించిన విజయనగర పాలకుడు ఎవరు?(Group-I, 2001; Group-II, 2003)
1) మొదటి దేవరాయలు
2) మొదటి హరిహరరాయలు
3) మొదటి బుక్కరాయలు
4) సాళువ నరసింహుడు
- View Answer
- సమాధానం: 3
20. వాగ్గేయకారుడు అన్నమయ్య కింద పేర్కొన్నవారిలో ఎవరి సమకాలీకుడు? (Civils prelims, 1997)
1) హరిహరరాయలు
2) మొదటి దేవరాయలు
3) రెండో దేవరాయలు
4) సాళువ నరసింహరాయలు
- View Answer
- సమాధానం: 4
21. కృష్ణ దేవరాయల పాలనా కాలం ఏది? Civils prelims, 1998)
1) క్రీ.శ. 1485 1502
2) క్రీ.శ. 1509 1530
3) క్రీ.శ. 1533 1545
4) క్రీ.శ. 1550 1565
- View Answer
- సమాధానం: 2
22. తన సైన్యంలో పది వేల మంది మహమ్మదీయులను నియమించిన విజయ నగర రాజు ఎవరు?(Civils prelims, 1998; Group-II, 2011)
1) మొదటి దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) రామరాయలు
- View Answer
- సమాధానం: 2
23. ‘ఫర్గాటెన్ ఎంపైర్’ గ్రంథ రచయిత ఎవరు? Civils prelims, 1997)
1) రాబర్ట్ సీవెల్
2) జేమ్స్ ఫెర్గూసన్
3) ఫాదర్ హీరాస్
4) హెచ్.జి. వేల్స్
- View Answer
- సమాధానం: 1
24. చైనా దేశానికి తన రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి బుక్కరాయలు
2) రెండో హరిహరరాయలు
3) రెండో దేవరాయలు
4) శ్రీకృష్ణ దేవరాయలు
- View Answer
- సమాధానం: 1
25. విజయనగర సామ్రాజ్యంలో వివాహ సుంకాలను రద్దు చేసిన పాలకుడు ఎవరు?
1) తుళువ వీరనరసింహుడు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) మొదటి హరిహర రాయలు
4) బుక్కరాయలు
- View Answer
- సమాధానం: 2
26. కింది వాటిలో యాచక వృత్తిపై విధించిన పన్ను ఏది?
1) పుల్లం పన్ను
2) అడికాసు పన్ను
3) గణాచారి పన్ను
4) పింజుణి సిద్ధాయం
- View Answer
- సమాధానం: 3
27. ‘పింజుణి సిద్ధాయం’ అనే పన్నును ఎవరి/ దేనిపై విధించేవారు?
1) వేశ్యలు
2) దూదిని ఏకి దారం తీసేవారు
3) చేనేత పనివారు
4) పశువులు మేసే పచ్చిక బయళ్లు
- View Answer
- సమాధానం: 2
28. ‘బ్రహ్మదేవ గ్రామాలు’ అంటే ఏమిటి?
1) మఠాధిపతులకు ఇచ్చే భూములు
2) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే పన్నులు లేని గ్రామాలు
3) రాజోద్యోగులకు ఇచ్చే గ్రామాలు
4) శాస్త్రవేత్తలకు ఇచ్చే గ్రామాలు
- View Answer
- సమాధానం: 2
29. ‘భండార వార గ్రామాలు’ అంటే ఏమిటి?
1) వృత్తి పనివారికి ఇచ్చే గ్రామాలు
2) మఠాధిపతులకు ఇచ్చే గ్రామాలు
3) రాచగ్రామాలు (రాజులకు ఇచ్చేవి)
4) పండితులు, కవులకు ఇచ్చే గ్రామాలు
- View Answer
- సమాధానం: 3
30. విజయనగర రాజుల కులదైవం?
1) విరూపాక్షుడు
2) శివుడు
3) విష్ణువు
4) సూర్యుడు
- View Answer
- సమాధానం: 1
31. విజయనగర రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) ఎద్దు
2) సింహం
3) వరాహం
4) చేప
- View Answer
- సమాధానం: 3
32. కుమార కంపన భార్య గంగాదేవి ‘మధురా విజయం’ గ్రంథాన్ని ఏ భాషలో రాశారు?
1) తెలుగు
2) కన్నడం
3) ప్రాకృతం
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 4
33. ‘కృష్ణలీలా తరంగిణీ’ గ్రంథ రచయిత ఎవరు?
1) విద్యారణ్యుడు
2) బండారు లక్ష్మీనారాయణ
3) నారాయణ తీర్థులు
4) రాజనాథ డిండిముడు
- View Answer
- సమాధానం: 3
34.కృష్ణదేవరాయలు ‘విద్యాగోష్టులు’ జరిపే సభా భవనం పేరేమిటి?
1) రాచ భవనం
2) మలయ కూటం
3) భువనవిజయం
4) ముత్యాల శాల
- View Answer
- సమాధానం: 3
35. ‘అమరు నాయంకర వ్యవస్థ’ దేన్ని సూచిస్తుంది?
1) రెవెన్యూ పరిపాలనా వ్యవస్థ
2) సైనిక వ్యవస్థ
3) గ్రామ పరిపాలన
4) నాడుల పరిపాలన
- View Answer
- సమాధానం: 2
36. ‘తలారి’ అని ఎవరిని పిలిచేవారు?
1) గ్రామ రక్షక భటుడు
2) నగర పాలకుడు
3) దేవదాసీల నిర్వాహకుడు
4) పన్నులు వసూలు చేసేవాడు
- View Answer
- సమాధానం: 1
37. ‘రాయ వాచకం’ రచయిత ఎవరు?
1) ధూర్జటి
2) స్థానాపతి
3) భట్టుమూర్తి
4) ముక్కు తిమ్మన
- View Answer
- సమాధానం: 2
38. తన తల్లి నాగలాంబ పేరుతో ‘నాగలాపురం’ పట్టణాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి దేవరాయలు
2) మొదటి బుక్కరాయలు
3) అళియ రామరాయలు
4) శ్రీకృష్ణదేవరాయలు
- View Answer
- సమాధానం: 4
39. అచ్చ తెలుగు కావ్యమైన ‘యయాతి చరితం’ రచయిత ఎవరు?
1) పొన్నెగంటి తెలగనాచార్యుడు
2) అద్దంకి గంగాధర కవి
3) సారంగు తమ్మయ్య
4) కందుకూరి రుద్రకవి
- View Answer
- సమాధానం: 1
40. కవులు తమ రచనల్లో ‘ఇభరాముడు’గా కీర్తించిన గోల్కొండ నవాబు ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) ఇబ్రహీం కుతుబ్షా
3) మహమ్మద్ కుతుబ్షా
4) అబ్దుల్లా కుతుబ్షా
- View Answer
- సమాధానం: 2
41. ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని ఎవరు రచించారు?
1) పొన్నెగంటి తెలగనార్యుడు
2) సారంగు తమ్మయ్య
3) కందుకూరి రుద్రకవి
4) అద్దంకి గంగాధర కవి
- View Answer
- సమాధానం: 2
42. ‘దాశరథీ శతకం’ రచయిత ఎవరు?
1) క్షేత్రయ్య
2) కంచర్ల గోపన్న (రామదాసు)
3) కందుకూరి రుద్రకవి
4) సారంగు తమ్మయ్య
- View Answer
- సమాధానం: 2
43. కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల సేవలకు గుర్తింపుగా ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసిన గోల్కొండ నవాబు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్షా
4) మహమ్మద్ కులీ కుతుబ్షా
- View Answer
- సమాధానం: 2
44. తెలుగులో మొదటి యక్షగాన నాటకమైన ‘సుగ్రీవ విజయం’ రచయిత ఎవరు?
1) కందుకూరి రుద్రకవి
2) సారంగు తమ్మయ్య
3) సంకుశాల నృసింహకవి
4) పొన్నెగంటి తెలగనాచార్యులు
- View Answer
- సమాధానం: 1
45. ‘మువ్వ గోపాల’ శృంగార పదాల రచయిత క్షేత్రయ్య కింద పేర్కొన్న ఏ కుతుబ్షాహీ పాలకుడి సమకాలీకుడు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) అబ్దుల్లా కుతుబ్షా
3) అబుల్ హసన్ తానీషా
4) మహమ్మద్ కుతుబ్షా
- View Answer
- సమాధానం: 2
46. కుతుబ్షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) ఇబ్రహీం కుతుబ్షా
3) అబ్దుల్లా కుతుబ్షా
4) సుల్తాన్ కుతుబ్ - ఉల్ - ముల్క్
- View Answer
- సమాధానం: 4
47. శ్రీశైలం, అహోబిలంలోని దేవాలయాలకు సోపానాలు (మెట్లు) ఎవరు నిర్మించారు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) అనవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 1
48. హంపీ - విజయ నగరం శిథిలాలను మొట్ట మొదట (క్రీ.శ.1800లో) ఎవరు వెలుగులోకి తీసుకువచ్చారు?
1) కల్నల్ కోలిన్ మెకంజీ
2) రాబర్ట్ సీవెల్
3) జనరల్ కన్నింగ్హామ్
4) మార్షల్
- View Answer
- సమాధానం: 1
49. కింద పేర్కొన్న వారిలో విజయనగర సామ్రాజ్యం గురించి వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
1) నికితిన్ - రష్యా
2) దూర్తె బార్బొసా - పోర్చుగల్
3) డొమింగో పయస్ - పోర్చుగల్
4) ఫెర్నావో న్యూనిజ్ - పోర్చుగల్
- View Answer
- సమాధానం: 3