ఆంధ్ర జనసంఘం ఎప్పుడు ఏర్పడింది?
1. ఆంధ్ర జనసంఘం ఎప్పుడు ఏర్పడింది?
1) 1921 నవంబర్ 14
2) 1922 డిసెంబర్ 16
3) 1923 మే 26
4) 1924 ఆగస్ట్ 18
- View Answer
- సమాధానం: 1
2. ఎవరి నివేదిక ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రాన్ని విజయవాడ నుంచి వాల్తేరుకు మార్చారు?
1) కట్టమంచి రామలింగారెడ్డి
2) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
- View Answer
- సమాధానం: 2
3. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి ఎస్.కె. ధార్ అధ్యక్షతన క మిటీని నియమించిదెవరు?
1) డా. బాబు రాజేంద్రప్రసాద్
2) జవహర్లాల్ నెహ్రూ
3) టి.టి. కృష్ణమాచారి
4) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 2
4. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు?
1) ఢిల్లీ
2) మద్రాసు
3) కర్నూలు
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 3
5. 1934లో ఏర్పడిన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ శాఖ కేంద్రం ఎక్కడ ఉంది?
1) రాజమండ్రి
2) చీరాల
3) తెనాలి
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 4
6. కందుకూరి వీరేశలింగం పంతులు ‘వితంతు పునర్వివాహ సంఘం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1882
2) 1881
3) 1880
4) 1879
- View Answer
- సమాధానం: 3
7. వహాబిలతో రహస్య మంతనాలు జరుపుతున్నాడనే నెపంతో అరెస్టయిన గులాం రసూల్‌ఖాన్ ఏ ప్రాంత వాసి?
1) కర్నూలు
2) విశాఖపట్నం
3) గుంటూరు
4) చిత్తూరు
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో సరైన జత ఏది?
1) వీనం వీరన్న - ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం
2) కెప్టెన్ ఓర్ - విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణం
3) సర్ థామస్ మన్రో- రాయలసీమలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
9. సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఏయే ప్రాంతాలను కలుపుతుంది?
1) ధవళేశ్వరం - విజ్జేశ్వరం
2) ధవళేశ్వరం- తుని
3) ధవళేశ్వరం- ర్యాలీ
4) ధవళేశ ్వరం - పాలకొల్లు
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో సరైన జత ఏది?
1) కర్నూలు జిల్లా ఏర్పాటు- 1858
2) అనంతపురం జిల్లా ఏర్పాటు- 1882
3) చిత్తూరు జిల్లా ఏర్పాటు- 1911
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
11. మచిలీపట్నంలో ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి అయిన కాండ్రేగుల జోగి పంతులును ఉత్తర సర్కారుల కోసం హైదరాబాద్ నిజాం వద్దకు ఎవరు పంపారు?
1) జాన్ విక్లిఫ్
2) జాన్ పైబస్
3) రేమండ్
4) కెప్టెన్ సైడన్
- View Answer
- సమాధానం: 2
12. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
A) ముస్తఫానగరు
B) మోటుపల్లి
C) జగ్గయ్యపేట
D) ఘంటసాల
జాబితా-II
i) దేశీయ కొండ పట్టణం
ii) బేతవోలు
iii) చోళ పాండ్యపురం
iv) కొండపల్లి
1) A-ii, B-iv, C-i, D-iii
2) A-iv, B-i, C-ii, D-iii
3) A-i , B-ii,, C-iii, D-iv
4) A-iv, B-iii, C-ii, D-i
- View Answer
- సమాధానం: 2
13. సర్కారు ప్రాంతం నుంచి ఫ్రెంచ్ వారిని పూర్తిగా అంతం చేసిన యుద్ధం ఏది?
1) ప్లాసీ యుద్ధం(1757)
2) వందవాసి యుద్ధం (1760)
3) చందుర్తి యుద్దం(1758)
4) బొబ్బిలి యుద్ధం(1757)
- View Answer
- సమాధానం: 3
14. బాల భారతాన్ని రాసిందెవరు?
1) అగస్త్యుడు
2) దూబగుంట నారాయణకవి
3) చేమకూర వేంకటకవి
4) పిల్లలమర్రి పినవీరభద్రుడు
- View Answer
- సమాధానం: 1
15. కృష్ణదేవరాయల మత గురువు ఎవరు?
1) అల్లసాని పెద్దన
2) విద్యారణ్య స్వామి
3) వ్యాసతీర్థులు
4) తిమ్మరుసు
- View Answer
- సమాధానం: 3
16. కింది వాటిలో సరికాని జత ఏది?
1) దిక్రిసెంట్ పత్రిక- గాజుల లక్ష్మీనరసుశెట్టి
2) అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక- పూండ్ల రామకృష్ణయ్య
3) హాస్య సంజీవని పత్రిక- కాశీనాథుని నాగేశ్వరావు
4) గోల్కొండ పత్రిక- సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 3
17. గుంటూరు సర్కారును ఈస్టిండియా కంపెనీ తరఫున కార్న వాలీస్ ఎప్పుడు పొందాడు?
1) 1761
2) 1764
3) 1782
4) 1788
- View Answer
- సమాధానం: 4
18. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
A) 1891
B) 1907
C) 1835
D) 1919
జాబితా-II
i) బాలభారతి సమితి ఏర్పాటు
ii) సత్యదూత పత్రిక ప్రారంభం
iii) కందుకూరి వీరేశలింగం మరణం
iv) కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఏర్పాటు
1) A-ii, B-iv, C-i, D-iii
2) A-i, B-iii, C-iv, D-ii
3) A-iv, B-i, C-ii, D-iii
4) A-i, B-ii, C-iii, D-iv
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో సరికాని జత ను గుర్తించండి.
1) మాదెళ్ల శౌరయ్య- బిపిన్ చంద్రపాల్‌కు రాజ మండ్రిలో ఆతిథ్యం ఇచ్చారు
2) మునగాల రాజా- బిపిన్ చంద్రపాల్‌కు విజయవాడలో ఆతిథ్యం ఇచ్చారు
3) రామదాసు నాయుడు-బిపిన్ చంద్రపాల్‌కు మచిలీపట్నంలో ఆతిథ్యం ఇచ్చారు
4) చిలకమర్తి లక్ష్మీనరసింహం- బిపిన్ చంద్రపాల్‌కు కాకినాడలో ఆతిథ్యం ఇచ్చారు
- View Answer
- సమాధానం: 4
20. ఈస్టిండియా కంపెనీ పాలనలో తీరాంధ్ర ప్రాంతాన్ని ఎన్ని జిల్లాలుగా విభజించారు?
1) 8
2) 6
3) 5
4) 4
- View Answer
- సమాధానం: 3
21. ఈస్టిండియా కంపెనీ పాలనలో రాయలసీమ జిల్లాల (దత్త మండలాల) పాలనా కేంద్రం ఏది?
1) కంభం
2) అనంతపురం
3) కడప
4) బళ్లారి
- View Answer
- సమాధానం: 2
22. ‘అపర భగీరథుడు’అని ఎవరిని పిలుస్తారు?
1) సర్ థామస్ మన్రో
2) సర్ ఆర్థర్ కాటన్
3) సర్ సి.పి. బ్రౌన్
4) కెప్టెన్ ఓర్
- View Answer
- సమాధానం: 2
23.కింది వాటిలో సరైన జత ఏది?
1) సీతానగరం ఆశ్రమం - బ్రహ్మజోష్యుల సుబ్రమణ్యం
2) ఆంధ్ర స్వరాజ్ పార్టీ - గాడిచర్ల హరిసర్వోత్తమరావు
3) ‘భారతి’ సాహిత్య పత్రిక- కాశీనాథుని నాగేశ్వరావు
4) పైవ న్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
24. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని(1926) బెజవాడ నుంచి వాల్తేరుకు ఎప్పుడు మార్చారు?
1) 1930
2) 1932
3) 1934
4) 1936
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో సరైన జత ఏది?
1) ‘పండిత బిషక్కుల భాషా బేషజం’ గ్రంథం- గిడుగు రామ్మూర్తి పంతులు
2) ‘సూర్యారాయాంధ్ర భాషా నిఘంటువు’ - జయంతి రామయ్య పంతులు
3) ఉత్తర రామాయణ గ్రంథం- కంకంటి పాపరాజు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. దక్షిణాపథంలో ఆర్య సంస్కృతి విస్తరణకు తోడ్పడిన రుషి ఎవరు?
1) వశిష్టుడు
2) అగస్త్యుడు
3) విశ్వామిత్రుడు
4) భరద్వాజుడు
- View Answer
- సమాధానం: 2
27.కింది వారిలో మహారథిత్రాణ కైరో కూమార్తె ఎవరు?
1) మలయవతి
2) నాగానిక
3) కుందవ్వ
4) ఉపాసిక బోధిశ్రీ
- View Answer
- సమాధానం: 2
28. కిందివాటిని జతపరచండి.
జాబితా-I
A) ఆంధ్ర వాల్మీకి
B) దక్షిణ భారత గోఖలే
C) ప్రపిత
D) ఆంధ్రోద్యమ జనకుడు
జాబితా-II
i) మోచర్ల రామచంద్రరావు
ii) న్యాపతి సుబ్బారావు
iii) వావికొలను సుబ్బారావు
iv) కొండా వెంకటప్పయ్య
1) A-i, B-ii, C-iii, D-iv
2) A-iii, B-i, C-ii, D-iv
3) A-ii, B-iv, C-i, D-iii
4) A-iv, B-iii, C-i, D-ii
- View Answer
- సమాధానం: 2
29. ‘ఆంధ్ర విద్యాపీఠగోష్టి’ని ఏ ఉద్యమ కాలంలో స్థాపించారు?
1) వందేమాతర ఉద్యమం
2) హోంరూల్ ఉద్యమం
3) సహాయ నిరాకరణోద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 3
30. జతపరచండి.
జాబితా-I
A) తెల్లగుడ్డల తానులు(లాన్ క్లాత్)
B) సిల్క్ వస్త్రాలు ఇ) రుమాళ్లు
D) డోరియాలు(గళ్లగుడ్డలు)
జాబితా-II
i) విశాఖపట్నం
ii) నెల్లూరు
iii) పెద్దాపురం
iv) ఇంజరం
1) A-iv, B-iii, C-ii, D-i
2) A-ii, B-i, C-iii, D-iv
3) A-iii, B-ii, C-iv, D-i
4) A-i, B-iv, C-ii, D-iii
- View Answer
- సమాధానం: 1
31. మేజువాణీలు అంటే ఏమిటి?
1) ఓడరేవుల్లో నిలిపిన విదేశీ ఓడలు
2) సంగీత కచేరి సహితంగా చేసే విందు భోజనం
3) విదేశీయులు నిర్మించిన విద్యాకేంద్రాలు
4) సంగీత పరికరాలు తయారు చేసే కేంద్రాలు
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
1) 1757 జనవరి 24- బొబ్బిలి యుద్ధం
2) 1758 డిసెంబర్ 7- చందుర్తి యుద్ధం
3) 1794 జూలై 10- పద్మనాభ యుద్ధం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
33. కింది వాటిలో సరికాని జత ఏది?
1) డా. ఎ.ఎల్. నారాయణ- మద్రాసు విశ్వ విద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స డిగ్రీ పొందిన తొలి ఆంధ్రుడు
2) కె.వి. రంగారెడ్డి - ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి
3) చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథం రాశాడు
4) బెజవాడ గోపాలరెడ్డి- ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి
- View Answer
- సమాధానం: 4
34. ప్రజా నాట్యమండలి ఏ పార్టీకి చెందిన సాంస్కృతిక సంస్థ ?
1) కమ్యూనిస్ట్ పార్టీ
2) ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ
3) ఆంధ్ర స్వరాజ్ పార్టీ
4) జస్టిస్ పార్టీ
- View Answer
- సమాధానం: 1
35. రెడ్డి రాజుల తొలి రాజధాని ఏది?
1) కందుకూరు
2) అద్దంకి
3) రాజమహేంద్రవరం
4) గురజాల
- View Answer
- సమాధానం: 2
36. ఆంధ్రలో 1935లో ప్రథమ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ ఎక్కడ జరిగింది?
1) విజయవాడ
2) కాకినాడ
3) తెనాలి
4) ప్రొద్దుటూరు
- View Answer
- సమాధానం: 2
37. ఆంధ్రరాష్ర్ట తొలి గవర్నర్ ఎవరు?
1) కైలాస్నాథ్ వాంఛూ
2) సి.ఎం. త్రివేది
3) కోకా సుబ్బారావు
4) సయ్యద్ ఫజల్ అలీ
- View Answer
- సమాధానం: 2
38. జైఆంధ్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభ మైంది?
1) 1972
2) 1974
3) 1976
4) 1978
- View Answer
- సమాధానం: 1
39. ‘మాలదాసరి కథ’ ఉన్న గ్రంథం ఏది?
1) హరవిలాసం
2) మనుచరిత్ర
3) ఆముక్త మాల్యద
4) వసు చరిత్ర
- View Answer
- సమాధానం: 3
40. క్షేత్రయ్యను ఆదరించిన గోల్కొండ పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కులీకుతుబ్ షా
2) మహ్మద్ కులీకుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: 3
41.‘కర్పూర వసంత రాయలు’ అని ఎవరిని పిలుస్తారు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) అనవేమారెడ్డి
3) కాటయ వేమారెడ్డి
4) పెదకోమటి వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
42. పల్నాటి బ్రహ్మనాయుడు అనుసరించిన మత విధానం?
1) వీరశైవం
2) వీర వైష్ణవం
3) ఆరాధ్య శైవం
4) మహాయాన బౌద్ధం
- View Answer
- సమాధానం: 2
43. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయకర్త ఎవరు?
1) రాయప్రోలు సుబ్బారావు
2) గురజాడ అప్పారావు
3) పింగళి వెంకయ్య
4) శంకరంబాడి సుందరాచారి
- View Answer
- సమాధానం: 4
44. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అనే గీతాన్ని గరిమెళ్ల సత్యనారాయణ ఏ ఉద్యమ కాలంలో రాశాడు?
1) సహాయ నిరాకరణోద్యమం
2) వందేమాతర ఉద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 1
45. ‘దక్షిణ భారతదేశ దండి’ అని ఏ ఆశ్రమాన్ని పిలుస్తారు?
1) పల్లిపాడు ఆశ్రమం
2) సీతానగరం ఆశ్రమం
3) కొమరవోలు ఆశ్రమం
4) గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం
- View Answer
- సమాధానం: 2
46. అల్లూరి సీతారామరాజును పట్టుకున్న బ్రిటిష్ అధికారి ఎవరు?
1) కంచు మీనన్
2) స్కాట్ కవర్డ్
3) రూథర్ ఫర్డ్
4) కల్నల్ ఫోర్డ్
- View Answer
- సమాధానం: 1
47. ఆంధ్రలో తొలిసారిగా ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన ప్రాంతం ఏది?
1) కాకినాడ
2) మచిలీపట్నం
3) మైపాడు
4) ముత్తుకూరు
- View Answer
- సమాధానం: 2
48. ‘భారత స్వరాజ్య యుద్ధం’ అనే గీతాన్ని రాసిందెవరు?
1) భోగరాజు పట్టాభి సీతారామయ్య
2) దామరాజు పుండరీకాక్షుడు
3) ఉన్నవ లక్ష్మీనారాయణ
4) ముదిగంటి జగ్గన్న శాస్త్రి
- View Answer
- సమాధానం: 4
49. ‘గుంటూరి కేసరి’ అని ఎవరిని పిలుస్తారు?
1) నడింపల్లి నర్సింహారావు
2) ఎన్.జి. రంగా
3) కన్నెగంటి హనుమంతు
4) బులుసు సాంబమూర్తి
- View Answer
- సమాధానం: 1
50. శ్రీకాకుళం ఫౌజ్దార్ జాఫర్ అలీ ఎవరి చేతిలో ఓడిపోయాడు?
1) బుస్సీ
2) కల్నల్ ఫోర్డ్
3) రాజర్ట్ క్లైవ్
4) డూప్లే
- View Answer
- సమాధానం: 1
51. ఆంధ్రలో బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది?
1) బొబ్బిలియుద్ధం (1757)
2) చందుర్తి యుద్ధం (1758)
3) పద్మనాభయుద్ధం (1794)
4) తుమ్మలపాలెం యుద్ధం (1756)
- View Answer
- సమాధానం: 2
52. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1917- జస్టిస్ పార్టీ ఆవిర్భావం
2) 1938- హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళ నాడులో జరిగింది
3) 1944- ద్రవిడ కజగం పార్టీ ఆవిర్భావం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
53. కింది వాటిని జతపరచండి.
జాబితా-I (గ్రంథం)
A) ముంతాజ్ మహాల్
B) మాలపల్లి
C) గాంధీ- గారడీ
D) జపాన్ చరిత్ర
జాబితా-II (రచయిత)
i) ఉన్నవ లక్ష్మీనారాయణ
ii) ఆదిపూడి సోమనాథరావు
iii) గుర్రం జాషువా
iv) ముదిగంటి జగ్గన్న శాస్త్రి
1) A-i, B-iii, C-iv, D-ii
2) A-iv, B-ii, C-i, D-iii
3) A-iii, B-i, C-iv, D-ii
4) A-ii, B-iv, C-i, D-iii
- View Answer
- సమాధానం: 3