Central Government: ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన ఆర్థికవేత్త?
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఆర్థికవేత్త డాక్టర్ వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ నియమితులయ్యారు. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. తన మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబర్ 2021లో సీఈఏ బాధ్యతల నుంచి వైదొలిగిన కేవీ సుబ్రమణియన్ స్థానంలో నాగేశ్వరన్ నియామకం జరిగింది. ఆర్థిక రంగంలో విశేష అనుభవం ఉన్న నాగేశ్వరన్ ఇంతక్రితం క్రెడిట్ సూసీ గ్రూప్ ఏజీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.
నాజల్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం
కోవిడ్– 19కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. దీన్ని బూస్టర్ డోసుగా ఇవ్వడం కోసం తుదిదశ ప్రయోగాలు జరిపేందుకు డీసీజీఐ అనుమతించింది. సాధారణ వ్యాక్సిన్ కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: బుజ్జాయి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన రచయిత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులైన ఆర్థికవేత్త?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : డాక్టర్ వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్
ఎందుకు : మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత.. సీఈఏ బాధ్యతల నుంచి కేవీ సుబ్రమణియన్ వైదొలిగిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్