Skip to main content

కామన్వెల్త్ క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930-50 కాలంలో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా, 1954-66 మధ్య బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గా, 1970-74 కాలంలో బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగుసార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.
20వ కామన్వెల్త్ క్రీడలు
20వ కామన్వెల్త్ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్ తరపున షూటర్ విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని చేబూని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది.

భారత స్వర్ణపతక విజేతలు
సంజిత కుముక్‌చామ్ మహిళల వెయిట్ లిఫ్టింగ్
సుఖేన్ డే పురుషుల వెయిట్ లిఫ్టింగ్
అభినవ్ బింద్రా షూటింగ్
అపూర్వి చందేల మహిళల షూటింగ్
రాహి సర్నోబత్ మహిళల షూటింగ్
సతీష్ శివలింగం వెయిట్ లిఫ్టింగ్
జీతూ రాయ్ షూటింగ్
అమిత్ కుమార్ రెజ్లింగ్
వినేష్ ఫోగత్ మహిళల రెజ్లింగ్
సుశీల్ కుమార్ రెజ్లింగ్
బబిత కుమారి మహిళల రెజ్లింగ్
యోగేశ్వర్ దత్ రెజ్లింగ్
వికాస్ గౌడ డిస్కస్ త్రో
దీపికా పల్లికల్, జ్యోత్స్న చిన్నప్ప స్క్వాష్ (మహిళల డబుల్స్)
పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్

కామన్వెల్త్ క్రీడలు- వేదికలు
ఇప్పటివరకు 20 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.కొన్నింటి వివరాలు.

సంవత్సరం

నగరం

దేశం

1930

హామిల్టన్

కెనడా

1934

లండన్

ఇంగ్లండ్

1938

సిడ్నీ

ఆస్ట్రేలియా

1950

అక్లాండ్

న్యూజిలాండ్

1954

వాంకోవర్

కెనడా

1998

కౌలాలంపూర్

మలేసియా

2002

మాంచెస్టర్

ఇంగ్లండ్

2006

మెల్‌బోర్న్

ఆస్ట్రేలియా

2010

న్యూఢిల్లీ

ఇండియా

2014

గ్లాస్గో

స్కాట్లాండ్

Published date : 24 Jan 2017 02:30PM

Photo Stories