Skip to main content

ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో(న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి.
17వ ఆసియా క్రీడలు
17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9,501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్ స్విమ్మర్ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు.

భారత స్వర్ణ పతక విజేతలు
జీతూ రాయ్ (షూటింగ్)
యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)
సానియా మీర్జా(టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్)
సాకేత్ మైనేని
సీమా పూనియా (మహిళల డిస్కస్ త్రో)
మేరీ కోమ్ (మహిళల బాక్సింగ్)
4 X 400 మీటర్ల రిలే (భారత మహిళల జట్టు)
భారత హాకీ జట్టు
పురుషుల కబడ్డీ జట్టు
మహిళల కబడ్డీ జట్టు
స్వ్కాష్ పురుషుల జట్టు
పురుషుల కాంపౌండ్ జట్టు (ఆర్చరీ)

ఆసియా క్రీడలు - వేదికలు
ఇప్పటివరకు 17 ఆసియా క్రీడలు జరిగాయి.కొన్ని వేదికల వివరాలు
.

సంవత్సరం

నగరం

దేశం

1982

న్యూఢిల్లీ

ఇండియా

1986

సియోల్

దక్షిణ కొరియా

1990

బీజింగ్

చైనా

1994

హిరోషిమా

జపాన్

1998

బ్యాంకాక్

థాయిలాండ్

2002

బుసాన్

దక్షిణ కొరియా

2006

దోహా

ఖతార్

2010

గ్వాంగ్

జు చైనా

2014

ఇంచియాన్

ద క్షిణ కొరియా


మాదిరి ప్రశ్నలు
  1. 2018లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా నగరం?
    1) సిడ్నీ
    2) పెర్త్
    3) హోబర్ట్
    4) గోల్డ్ కోస్ట్
  2. 22వ కామన్వెల్త్ క్రీడలు 2022లో ఎక్కడ జరగనున్నాయి?
    1) కౌలాలంపూర్, మలేసియా
    2) ఎడ్మంటన్, కెనడా
    3) డర్బన్, దక్షిణాఫ్రికా
    4) వెల్లింగ్‌టన్, న్యూజిలాండ్
  3. దీపా కర్మాకర్ భారత్‌కు తొలి కామన్వెల్త్ పతకాన్ని ఏ క్రీడలో సాధించింది?
    1) జిమ్నాస్టిక్స్
    2) స్క్వాష్
    3) జావెలిన్ త్రో
    4) డిస్కస్ త్రో
  4. ఆసియా క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంవత్సరం?
    1) 2010
    2) 1986
    3) 1982
    4) 1998
  5. భారత హాకీ జట్టు 2014 ఆసియా క్రీడల ఫైనల్లో ఏ దేశాన్ని ఓడించి స్వర్ణపతకాన్ని దక్కించుకుంది?
    1) దక్షిణ కొరియా
    2) జపాన్
    3) ఇరాన్
    4) పాకిస్థాన్
  6. ఆసియా క్రీడలు 2018లో ఏ నగరంలో జరగనున్నాయి?
    1) మనీలా
    2) టోక్యో
    3) జకర్తా
    4) న్యూఢిల్లీ
  7. 19వ ఆసియా క్రీడలు 2022 సెప్టెంబర్‌లో చైనాలోని ఏ నగరంలో జరుగుతాయి?
    1) బీజింగ్
    2) షాంఘై
    3) గ్వాంగ్ జు
    4) హాంగ్ జు
  8. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను 2019లో ఏ దేశంలో నిర్వహిస్తారు?
    1) బ్రెజిల్
    2) అర్జెంటీనా
    3) పెరూ
    4) బొలీవియా
  9. దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు ఆసియా క్రీడలు నిర్వహించని నగరం?
    1) సియోల్
    2) బుసాన్
    3) ఇంచియాన్
    4) నామ్‌వన్
  10. 2016లో వందేళ్లు పూర్తి చేసుకున్న టోర్నమెంట్?
    1) ప్రపంచకప్ ఫుట్‌బాల్
    2) కోపా అమెరికా
    3) ఆసియా క్రీడలు
    4) కామన్వెల్త్ క్రీడలు

సమాధానాలు
1) 4 2) 3 3) 1 4) 3 5) 4 6) 3 7) 4 8) 1 9) 4 10) 2
Published date : 24 Jan 2017 02:37PM

Photo Stories