అండర్-19 ప్రపంచకప్
Sakshi Education
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను తొలిసారి 1988లో నిర్వహించారు. ఆ తర్వాత పదేళ్లపాటు టోర్నీని నిర్వహించలేదు. రెండో ప్రపంచకప్ 1998లో జరిగింది. అప్పటి నుంచి రెండేళ్లకోసారి ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.
మొత్తం 16 జట్లు
12వ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ 2018, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వర కు న్యూజిలాండ్‌లో జరిగింది. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ఫిబ్రవరి 3న మౌంట్ మౌంగనుయ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరిగింది. ఇందులో భార త్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసింది. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్లో భారత ఓపెనర్ మన్‌జోత్ కల్రా అజేయ శత కం (101 నాటౌట్) సాధించడంతో సునాయాసంగా విజయం సాధించింది. దీంతో నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుని, భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
భారత్ తొలిసారి అండర్-19 క్రికెట్ పపంచకప్‌ను మహ్మద్ కైఫ్ సారథ్యంలో 2000లో సాధించింది. రెండోసారి 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, మూడోసారి 2012లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలో కప్పును అందుకుంది. 2018లో భారత్ పృథ్వీ షా నాయకత్వంలో నాలుగోసారి టైటిల్ సాధించింది.
ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మన్‌జోత్ కల్రాకు దక్కింది. ఈ టోర్న మెంట్లో 372 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. జగజ్జేతగా నిలిచిన భారత జట్టుకు కోచ్ రాహుల్ ద్రవిడ్.
అండర్-19 ప్రపంచకప్ విజేతలు
మాదిరి ప్రశ్నలు
1. 2020లో అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
1) దక్షిణాఫ్రికా
2) వెస్టిండీస్
3) బంగ్లాదేశ్
4) ఆస్ట్రేలియా
2. భారత్ తర్వాత అత్యధికంగా మూడుసార్లు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను ఏ దేశం గెలుచుకుంది?
1) పాకిస్తాన్
2) ఆస్ట్రేలియా
3) ఇంగ్లండ్
4) దక్షిణాఫ్రికా
3.అతిచిన్న వయసులో (18 ఏళ్ల 86 రోజులు) అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్?
1) విరాట్ కోహ్లీ
2) ఉన్ముక్త్ చంద్
3) మహ్మద్ కైఫ్
4) పృథ్వీ షా
సమాధానాలు
1) 1; 2) 2; 3) 4;

సంవత్సరం | ఆతిథ్యదేశం | విజేత |
1988 | ఆస్ట్రేలియా | ఆస్ట్రేలియా |
1998 | దక్షిణాఫ్రికా | ఇంగ్లండ్ |
2000 | శ్రీలంక | భారత్ |
2002 | న్యూజిలాండ్ | ఆస్ట్రేలియా |
2004 | బంగ్లాదేశ్ | పాకిస్తాన్ |
2006 | శ్రీలంక | పాకిస్తాన్ |
2008 | మలేసియా | భారత్ |
2010 | న్యూజిలాండ్ | ఆస్ట్రేలియా |
2012 | ఆస్ట్రేలియా | భారత్ |
2014 | యూఏఈ | దక్షిణాఫ్రికా |
2016 | బంగ్లాదేశ్ | వెస్టిండీస్ |
2018 | న్యూజిలాండ్ | భారత్ |
మాదిరి ప్రశ్నలు
1. 2020లో అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
1) దక్షిణాఫ్రికా
2) వెస్టిండీస్
3) బంగ్లాదేశ్
4) ఆస్ట్రేలియా
2. భారత్ తర్వాత అత్యధికంగా మూడుసార్లు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను ఏ దేశం గెలుచుకుంది?
1) పాకిస్తాన్
2) ఆస్ట్రేలియా
3) ఇంగ్లండ్
4) దక్షిణాఫ్రికా
3.అతిచిన్న వయసులో (18 ఏళ్ల 86 రోజులు) అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్?
1) విరాట్ కోహ్లీ
2) ఉన్ముక్త్ చంద్
3) మహ్మద్ కైఫ్
4) పృథ్వీ షా
సమాధానాలు
1) 1; 2) 2; 3) 4;
Published date : 03 Mar 2018 03:35PM