Soup Fuel: రామెన్ సూప్‌తో రైలు పరుగులు!!
కానీ జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ ఏకంగా నూడుల్స్ సూప్‌తో రైలును పరుగులు పెట్టించి అందరినీ ఆశ్చర్యపరించింది. జపానీయుల ఫేవరేట్ వంటకాలైన టొంకుట్సు రామెన్ సూప్ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలు లేదా మాంసంతో కూడిన డీప్ ఫ్రై) వ్యర్థాలను కలిపి తయారు చేసిన బయోఫ్యూయల్‌తో ఈ రైలు నడిచింది. పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా బయోడిజిల్‌తో రైలును నడపాలని నిర్ణయించిన టాకచిహో రైల్వే కంపెనీ...
Also read: WHO: ఇష్టారాజ్యంగా యాంటీ‘భయో’టిక్స్!.. నిజంగా అవసరమైనప్పుడు మందులు పనిచేయవంటున్న అధ్యయనాలు
ఈ బాధ్యతను నిషిడా షౌన్ అనే రవాణా కంపెనీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ జపాన్ రెస్టారెంట్ల నుంచి రామెన్ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాలను 9:1 నిష్పత్తిలో సేకరించి వాటిని రసాయనాలతో శుద్ధి చేసింది. ఈ కొత్త ఇంధనంతో జూన్ నుంచి కొన్ని రైలింజన్లను ప్రయోగాత్మకంగా నడిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తాజాగా అదే ఇంధనంతో ప్రయాణికుల రైలును టకాచిహో ప్రాంతంలోని మియాజకీ పట్టణంలో నడిపింది. ఈ రైలు ప్లాట్‌ఫారంపై కూతపెడుతుంటే ఆ ప్రాంతమంతా ఫ్రైల సువాసన వ్యాపించిందట. రామెన్ సూప్‌తో రైలు నడవడం, ఆ దృశాన్ని తామంతా చూడటం అద్భుతంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. సాధారణ డీజిల్ వాడకానికి అయ్యే ఖర్చు తరహాలోనే ఈ కొత్త ఇంధన సేకరణ ఖర్చు ఉందని టాకచిహో రైల్వే కంపెనీ తెలిపింది.
Also read: Foxfire: చీకటి పడితే.. జంగిల్ జిగేల్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP