ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2021
Sakshi Education
పిల్లలు, వ్యక్తులు, సంస్థల నుంచి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2021కు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఏటా రిపబ్లిక్ డే (జనవరి 26) ముందు వారంలో ఈ అవార్డులను భారత రాష్ట్రపతి ఇస్తారు.
ప్రధానాంశాలు
ఈ అవార్డులను రెండు కేటగిరీల కింద ఇస్తారు. అవి..
1.బాల్ శక్తి పురస్కార్
2.బాల్ కల్యాణ్ పురస్కార్
బాల్ శక్తి పురస్కార్:
- వివిధ రంగాలలో అసాధారణమైన విజయాలను సాధించిన పిల్లలకు ఏటా భారత ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. ఉదా.. ఆవిష్కరణ, విద్యాపరంగా విజయాలు, సామాజిక సేవ, కళలు & సంస్కృతి, క్రీడలు, ధైర్యం.
- ఒక పతకం, రూ.1,00,000, రూ .10,000 విలువైన బుక్ వోచర్లు, సర్టిఫికేట్, ప్రశంసాపత్రం ఇస్తారు.
- ఇది 1996లో జాతీయ చైల్డ్ అవార్డు ఫర్ ఎక్స్‌ప్షనల్ అచీవ్‌మెంట్ పేరుతో స్థాపించారు. 2018 నుంచి బాల శక్తి పురస్కార్ అని పేరు మార్చారు.
బాల్ కల్యాణ్ పురస్కార్:
- పిల్లల అభివృద్ధి, రక్షణ, శిశు సంక్షేమ రంగాలలో పిల్లల మంచి కోసం చేసిన విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు ఇస్తారు.
- భారతీయ పౌరుడు, భారతదేశంలో నివసిస్తున్న 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి (సంబంధిత సంవత్సరం ఆగస్టు 31 నాటికి) ఉండాలి. వారు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పిల్లల ప్రయోజనాల కోసం పని చేసి ఉండాలి.
- అవార్డుకు ఆప్లై చేసే సంస్థకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిధులు పొందకూడదు.
- పిల్లల సంక్షేమ రంగంలో 10 సంవత్సరాలు ఉండి, ఈ రంగంలో నిలకడగా పనిచేయాలి.
అవార్డు: నగదు బహుమతులతో పాటు వరుసగా వ్యక్తిగత,సంస్థ విభాగాలలో మూడు అవార్డులు ఇస్తారు. (వరుసగా రూ.1,00,000, రూ.5,00,000).
Published date : 10 Sep 2020 04:59PM