Skip to main content

Pharma

ఎంఫార్మసీ కోర్సును అందించే సంస్థల వివరాలు తెలపండి?
+
 • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ (నైపర్).. ఫార్మాస్యూటికల్ సెన్సైస్‌కు సంబంధించిన మొదటి జాతీయ స్థాయి సంస్థ. దీన్ని మొదటగా పంజాబ్‌లోని మొహాలీలో నెలకొల్పారు. ఇది పరిశోధనలకు సంబంధించి దేశీయ, విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకు తోడ్పాటు అందిస్తుంది. కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కింద నైపర్ పనిచేస్తుంది. ఫార్మసీకి సంబంధించి పరిశోధన, విద్య, శిక్షణను ఈ సంస్థ చేపడుతుంది. నైపర్.. మాస్టర్స్, డాక్టరేట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ప్రస్తుతం వివిధ మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌ల సహాయంతో అనేక ప్రదేశాల్లో పనిచేస్తోంది.
 • హైదరాబాద్‌లోని నైపర్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తోంది.
  వెబ్‌సైట్:
    www.niperhyd.ac.in
 • కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ.
  వెబ్‌సైట్:
    www.iicb.res.in
  అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ.
  ప్రవేశం: నైపర్‌జేఈఈ/జీప్యాట్/ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
 • నైపర్‌జేఈఈ సిలబస్.. జీప్యాట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది.
 • నైపర్‌జేఈఈ: మెడిసినల్ కెమిస్ట్రీతో పోల్చితే.. బేసిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 120 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇందులో నెగెటివ్ మార్కులు ఉంటాయి.
 • ఇదే సంస్థ ఫార్మాలో ఎంబీఏ అందిస్తోంది.
  అర్హత:
  కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ/కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్. లేదా లైఫ్ సైన్స్/కెమికల్ సైన్స్‌లలో ఎంఎస్సీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.niper.ac.in
 • విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మా బయోటెక్నాలజీ, ఫార్మ్ అనాలిసిస్, క్వాలిటీ అస్యూరెన్స్ వంటి స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీ అందిస్తోంది.
  అర్హత: బీఫార్మసీ.
  ప్రవేశం: జీప్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in/pharmacy/
 • హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎంఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది.
  అర్హత:
  బీఫార్మసీ.
  ప్రవేశం: బిట్‌శాట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.bits-pilani.ac.in/hyderabad/
 • హైదరాబాద్‌లోని పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఎంఫార్మసీ అందిస్తోంది. ఈ సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.
  అర్హత: బీఫార్మసీ.
  ప్రవేశం: పీజీఈసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.gprcp.ac.in
డీ ఫార్మసీ అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
 • మందుల తయారీ, సరఫరా/పంపిణీ బాధ్యతలను ఫార్మసీ చదివిన అభ్యర్థులు నిర్వర్తిస్తారు. వివిధ రకాల మందులపై రోగులకు అవగాహన కల్పిస్తారు.
 • ఒక అకడమిక్ కోర్సుగా దీన్ని అందిస్తున్నారు. డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఆరేళ్ల ఫార్మ్-డీ లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రామ్‌ను ఆరంభించాయి. ఈ ఆరేళ్లలో విద్యార్థులకు ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ ఫార్మసీలో శిక్షణ లభిస్తుంది. మొదటి 5 ఏళ్లు అకడమిక్స్ ఉంటాయి. చివరి సంవత్సరం ఒక హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలి. కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు ఫార్మసిస్ట్ బాధ్యతలు అన్నీ తెలుస్తాయి.

కోర్సును అందిస్తున్న సంస్థలు
 • హైదరాబాద్‌లోని దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ.
  వెబ్‌సైట్: www.deccanpharmacy.org
 • రాజమండ్రిలోని జీఐఈటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ.
  వెబ్‌సైట్: www.gietpharmacy.in
 • మెదక్‌లోని పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ.
  వెబ్‌సైట్: www.gprcp.ac.in
 • బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.
  వెబ్‌సైట్: www.msrcp.edu.in
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

ఉద్యోగావకాశాలు:
కోర్సు పూర్తయ్యాక అకడమిక్ అర్హతలు, పని అనుభవం ద్వారా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. ప్రొడక్షన్ సూపర్‌వైజర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, కెమికల్స్, కాస్మెటిక్స్ వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
క్లినికల్ రీసెర్చ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
 • మెడికల్ డ్రగ్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్, డయాగ్నాస్టిక్ పద్ధతులు, ట్రీట్‌మెంట్ వంటి వాటిపై క్లినికల్ రీసెర్చ్ అధ్యయనం చేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ పేరుతో వివిధ రకాలుగా మెడికల్ డ్రగ్స్‌పై పరిశోధనలు చేస్తూ, వాటి సైడ్ అఫెక్ట్స్‌పై అధ్యయనం చేస్తారు.
 • హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్, ఇండియా.. క్లినికల్ రీసెర్చ్‌లో ఎంఎస్సీని అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బయోసైన్స్/లైఫ్‌సైన్స్ సబ్జెక్టులతో బీఎస్సీ/ఎంఎస్సీ లేదా కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో బీఎస్సీ/ఎంఎస్సీ.
  ప్రవేశం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.icriindia.com
 • హైదరాబాద్‌లోని క్లిన్నోవో ఆరు నెలల క్లినికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాతోపాటు మూడు నెలల శిక్షణ అందిస్తోంది.
  అర్హత: సైన్స్ స్ట్రీంలో డిగ్రీ
  వెబ్‌సైట్: www.clinnovo.com
 • విధులు: మెడికల్ ప్రాక్టీస్ చేసేవారికి.. తయారుచేసిన డ్రగ్స్‌ను అందించటం, దాని వల్ల వచ్చే ప్రభావాలను తెలుసుకొని నివేదికలు తయారుచేసి విశ్లేషించి, ఒక కంక్లూజన్‌కి రావటం వీరి విధులు. అకడమిక్ అర్హతలతోపాటు ఇందులో పని అనుభవం ఆధారంగా వీటిలో ఏదో ఒక టాస్క్‌ను నిర్వహిస్తారు.
 • ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తిచేశాక హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉద్యోగాలు పొందవచ్చు.
ఇండస్రియల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీని అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ముడి సరుకుగా ఉన్న పదార్థాన్ని మార్చి మనుషులకు ఉపయోగకరంగా ఉండే పదార్థాలను తయారుచేయటమే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ.
 • తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎంఎస్సీ కెమిస్ట్రీని అందిస్తోంది.
  అర్హత: కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బీఎస్సీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.svuniversity.ac.in
 • అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సెన్సైస్.. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీని అందిస్తోంది.
  అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.amity.edu/aias
జీప్యాట్ పరీక్ష విధానాన్ని వివరించండి?
+
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ప్రవేశపరీక్ష ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నియమించిన నేషనల్ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులవడం ద్వారా ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు అర్హత లభిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు జూనియర్ ఫెలోషిప్‌కు కూడా అర్హులు. సీఎస్‌ఐఆర్ ల్యాబొరేటరీలు, సీఎస్‌ఐఆర్/యూజీసీ స్పాన్సర్ చేస్తున్న ప్రాజెక్టులకు పనీచేసేందుకు అర్హత లభిస్తుంది.

అర్హత: బీఫార్మసీ

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అన్ని వివరాలు పూర్తిచేశాక ఫీజు చెల్లించి, వివరాలు పూర్తిచేసిన ప్రింటవుట్‌తోపాటు ఫీజు చెల్లించిన చలానా, ఫోటోలను జతచేసి జీప్యాట్ ఆఫీసుకు పంపాలి.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. 125 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది.
వెబ్‌సైట్: www.gpat.in  

జీప్యాట్‌లో ర్యాంకు ఆధారంగా ఎంఫార్మసీ కోర్సును అందించే సంస్థలు:
 • విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ.. ఎంఫార్మసీ కోర్సును అందిస్తోంది. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు:
  ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మా బయోటెక్నాలజీ, ఫార్మ్ అనాలిసిస్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫైటోకెమిస్ట్రీ.
  అర్హత: బీఫార్మసీ ప్రవేశం: జీప్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 • ఉస్మానియా యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మసీ.. ఎంఫార్మసీ కోర్సును అందిస్తోంది. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్.
  అర్హత: బీఫార్మసీ
  ప్రవేశం: గేట్/జీప్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.osmania.ac.in
డి.ఫార్మసీలో ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
+
ఫార్మసీ అంటే మందులను తయారుచేయడం, వాటిని సరఫరా చేయడంలో సైన్స్‌ను మేళవించడం. వివిధ రకాలైన మందులపై రోగులకు అవగాహన కల్పించడం ఫార్మసిస్టుల పని. అకడమిక్ విషయానికొస్తే డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ లెవల్స్‌లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఆరేళ్ల డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రాం/ఫార్మ్‌డీ కోర్సు మొదలుపెట్టింది. దీని ద్వారా ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ ఫార్మసీ సర్వీస్‌లో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. మొదటి ఐదేళ్ల కోర్సు అకడమిక్స్‌కు సంబంధించి ఉంటుంది. ఒకేడాది హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తవడంతోనే హెల్త్‌కేర్‌లో ఫార్మసిస్టుల బాధ్యతలు, డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్, డ్రగ్స్ వాడాల్సిన విధానంపై అవగాహన వస్తుంది.

ఫార్మసీ కోర్సును అందించే కొన్ని సంస్థల వివరాలు:
 • దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్.
  వెబ్‌సైట్: www.deccanpharmacy.org.

 • జీఐఈటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, రాజమండ్రి.
  వెబ్‌సైట్: www.gietpharmacy.ac.in.

 • పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, మెదక్.
  వెబ్‌సైట్: www.prip.ac.in

 • ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బెంగళూరు.
  వెబ్‌సైట్: www.msrcp.edu.in

 • అమృతా స్కూల్ ఆఫ్ ఫార్మసీ, అమృతా స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కోచి
  వెబ్‌సైట్: www.aims.amrita.edu

అర్హత: ఇంటర్మీడియెట్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.

ఉద్యోగావకాశాలు: డీఫార్మసీ చేశాక ఎక్స్‌పీరియన్స్, అకడమిక్ అర్హతలు, ఆసక్తి ప్రధాన భూమిక పోషిస్తాయి. ప్రొడక్షన్ సూపర్‌వైజర్, డ్రగ్ ఇన్స్‌పెక్టర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లాంటి ఉద్యోగాలు చేయొచ్చు. డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్ బయోటెక్నాలజీ, కెమికల్స్, కాస్మటిక్స్ లాంటి రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. హాస్పిటల్స్, డ్రగ్‌స్టోర్స్, పరిశోధన సంస్థలు, విద్యాసంస్థల్లో ఎన్నో అవకాశాలుంటాయి.
కెమీఇన్ఫర్మేటిక్స్‌లో షార్ట్ టర్మ్ కోర్సుల వివరాలు తెలపండి?
+
 • హైదరాబాద్‌లోని జీవీకే బయోసెన్సైస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రోటీన్ మోడలింగ్ అండ్ రేషనల్ డ్రగ్ డిజైన్‌లో సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది.
  అర్హత:
  బీఫార్మసీ/బీటెక్ ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్/ బయోటెక్నాలజీ లేదా లైఫ్‌సెన్సైస్/కెమికల్ సైన్స్‌స్‌లో ఎంఎస్సీ. ఈ సంస్థ ప్లేస్‌మెంట్ అవకాశాలను కూడా అందిస్తోంది.
  వెబ్‌సైట్:  www.gvkbio.com
 • హైదరాబాద్‌లోని అరవింద బయోసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు అందిస్తోంది.
  కోర్సులు:
  1. డిప్లొమా ఇన్ కెమీఇన్ఫర్మేటిక్స్(3-6నెలలు)
  2. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ కెమీఇన్ఫర్మేటిక్స్(6-12 నెలలు)
  3. కెమీఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజ్డ్ కోర్సు(ఒక నెల)
  అర్హత: బయోఇన్ఫర్మేటిక్స్/మైక్రోబయాలజీ/అగ్రికల్చర్/ఫుడ్‌టెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/బోటనీ/ జువాలజీ/స్టాటిస్టిక్స్/ లైఫ్ సైన్స్‌స్‌లో బీఎస్సీ/ఎంఎస్సీ లేదా లైఫ్ సెన్సైస్‌లో ఇతర విభాగాలైన బీవీఎస్సీ/ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీఫార్మసీ/ఎంఫార్మసీ/ బీఏఎంఎస్/బీఈ/బీటెక్‌లలో ఉత్తీర్ణత.
వెబ్‌సైట్:  www.aravindabio.com
బీ ఫార్మసీ అనంతరం ఏం చేస్తే బాగుంటుంది?
+
బీ ఫార్మసీ అనంతరం ఎం-ఫార్మసీ చేయాలి. ఇందులో ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయి.
 • నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్- ముంబై, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏని అందిస్తోంది.
  వెబ్‌సైట్:
  www.nmims.edu
 • హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ ఎంఎస్సీలో క్లినికల్ రీసెర్చ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రవేశ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  వెబ్‌సైట్:
  www.icriindia.com
 • అరవింద్ బయో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్- హైదరాబాద్, కెమ్ ఇన్ఫర్మేటిక్స్ అనే 3-6 నెలల డిప్లొమాను అందిస్తోంది. 6-12 నెలల వ్యవధి గల బయో ఇన్ఫర్మేటిక్స్, కెమ్ ఇన్ఫర్మేటిక్స్ అనే డిప్లొమాలు, ఏడాది కెమ్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలైజేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
  అర్హతలు:
  బీఎస్సీ/ ఎంఎస్సీ(బయో ఇన్ఫర్మేటిక్స్/ మైక్రోబయాలజీ/బయో కెమిస్ట్రీ/బయో టెక్నాలజీ/అగ్రికల్చర్/ఫుడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ/ స్టాటిస్టిక్స్/ లైఫ్ సెన్సైస్). లేదా బీవీఎస్సీ, బీఏఎమ్‌ఎస్, బీహెచ్‌ఎమ్‌ఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్/బీఫార్మా/ఎంఫార్మా/ బీఈ/ బీటెక్‌లో లైఫ్‌సెన్సైస్ చదివి ఉండాలి.
  వెబ్‌సైట్: www.aravindabio.com
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) అందించే కోర్సుల వివరాలను తెలపండి?
+
భారత ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పని చేస్తుంది. దీనికి ..మొహాలీ, హైదరాబాద్, హాజీపూర్, గౌహతి, రాయ్‌బరేలీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఏడు క్యాంపస్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రత్యేకంగా మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉంటాయి. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్, పీహెచ్‌డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
మాస్టర్ విభాగంలో ఎంఎస్(ఫార్మా), ఎంటెక్ (ఫార్మా), ఎంఫార్మసీ కోర్సులు ఉన్నాయి. స్పెషలైజేషన్స్:
క్లినికల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివెజైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ,ఫార్మాస్యూటిక్స్, ఫార్మకోఇన్ఫర్మాటిక్స్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ట్రెడిషనల్ మెడిసిన్.
ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్) పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
కెమికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్.
మాస్టర్ కోర్సుల్లో నైపర్-జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంబీఏ కోర్సుకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి. ఎంబీఏతో కలిపి అన్ని మాస్టర్ కోర్సులకు ఒకే పరీక్షను నిర్వహిస్తారు. పీహెచ్‌డీ కోర్సులకు మాత్రం నైపర్-జేఈఈ, ఇంటర్వ్యూ అనే రెండు దశల విధానాన్ని అనుసరిస్తారు. ప్రవేశ ప్రక్రియ మొత్తం నైపర్-మొహాలీ ఆధ్వర్యంలో జరుగుతుంది.

వివరాలకు:  www.niper.ac.in
ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీల వివరాలను తెలపండి?
+
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ చేసిన వారికి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైైవేట్ కంపెనీలు/ఆర్గనైజేషన్స్‌లో విస్తృత స్థాయిలో అవకాశాలుంటాయి. ఈ క్రమంలో టెక్స్‌టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డిస్టలరీలు, మైన్స్, తదితర పరిశ్రమలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా పరిశ్రమలు కాలుష్య స్థాయిని పర్యవేక్షించడానికి ఆర్ అండ్ డీ విభాగంలో వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అంశాల్లో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఎన్విరాన్‌మెంటలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ పరంగా ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రీసోర్సెస్, అగ్రికల్చరల్ తదితర ఏజెన్సీలు/సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.

అందిస్తున్న యూనివర్సిటీలు:
 • ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
  ప్రవేశం:
  రాత పరీక్ష ఆధారంగా
  వెబ్‌సైట్:  www.osmania.ac.in
 • శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
  ప్రవేశం:
  రాత పరీక్ష ఆధారంగా
  వెబ్‌సైట్:  www.svuniversity.in
 • ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
  ప్రవేశం:
  రాత పరీక్ష ఆధారంగా
  వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
ఫార్మసీ రంగానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఆఫర్‌ చేసే విశ్వవిద్యాలయాలను తెలపండి.
+
ఫార్మసీ రంగం ప్రధానంగా జౌషధ పరిశోధన- అభివృద్ధి, వ్యాపార వ్యవహారాల నిర్వహణలో మంచి అవకాశాలను అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులకు ఔషధాలను కనిపెట్టడం, వాటిని తక్కువ ధరకు మార్కెట్లో ప్రవేశ పెట్టడం ఫార్మసీ తయారీ కంపెనీలకు ఇపుడు పెద్ద సవాలుగా మారింది. ఔషధాల తయారీలో నాణ్యత, సరైన వ్యాపార మెలకువలు పాటించడం అనివార్యమైంది. అందుకే నేడు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఔషధ పరిశోధన- అభివృద్ధి/పరీక్ష విధానం, మౌలిక వసతులు, తయారీ నైపుణ్యం, వ్యాపార పద్ధతులు, ధర నిర్ణయం వంటి విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్‌, కెమికల్‌, బయో టెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఆఫర్‌ చేస్తోన్న సంస్థలు:
-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పంజాబ్‌-ఎంబీఏ(ఫార్మా) కోర్సు అందిస్తోంది. బీఫార్మసీ/బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌)/ ఎంఎస్సీ(లైఫ్‌ సెన్సైస్‌/కెమికల్‌ సైన్స్‌) పూర్తి చేసిన వారు అర్హులు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.niper.nic.in

-నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ముంబై-ఎంబీఏ(ఫార్మాస్యుటికల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సును అందిస్తోంది. కనీసం 50 శాతం మార్కులతో లైఫ్‌ సైన్స్‌/ బయోమెడిసిన్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌/ ఫార్మసీ/ మెడిసిన్‌తో గ్రాడ్యుయేషన్‌/పోస్టుగ్రాడ్యుయేషన్‌, లేదా సోషియాలజీ/ సైకాలజీ/ ఆంత్రోపాలజీల్లో ఏవైనా రెండు అంశాలతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, కంప్యూటర్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.nmims.edu

-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ మార్కెటింగ్‌, లక్నో - పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఫార్మామార్కెటింగ్‌) సెల్ఫ్‌ స్టడీ పద్ధతిలో అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చే సిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: www.iipmindia.com
-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌, లక్నో- పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఫార్మా మార్కెటింగ్‌)ను దూరవిద్యా విధానంలో ఆఫర్‌ చేస్తోంది. అర్హత-ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: www.iictindia.com
ఫార్మాస్యుటికల్‌ కెమిస్ట్రీలో ఎంటెక్‌ చేశాను. తర్వాత ఏం చేయాలి?
+
మీ ముందు రెండు అవకాశాలు. అవి ఉద్యోగ ప్రయత్నం, పరిశోధన రంగంలో అడుగు పెట్టడం. ఉద్యోగమే లక్ష్యమైతే ఫార్మాస్యుటికల్‌ కంపెనీలు, క్వాలిటీ కంట్రోల్‌ యూనిట్లు, ప్రభుత్వ ఏజెన్సీల్లో అవకాశాలుంటాయి. రీసెర్చ్‌ వైపు వెళ్లాలంటే.. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పరిశోధన సంస్థలకు దరఖాస్తు చేయొచ్చు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల్లో ఆసక్తి ఉన్న వారిని స్పాన్సర్‌ చేసి రీసెర్చ్‌కి పంపిస్తాయి. వాటిలో చేరడం ప్రయోజనకరం. బెంగళూరులోని అల్‌-అమీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ ఆఫర్‌ చేస్తోన్న ఫార్మాస్యుటికల్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో కూడా చేరవచ్చు. వెబ్‌సైట్‌: www.alameenpharmacy.edu
ఇంటర్‌ చదువుతున్నాను. ఫార్మ్‌-డి కోర్సు వివరాలు తెలపండి?
+
భారత్‌లో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ రంగంలో పరిశోధనలు రోజురోజుకూ విస్తృతమవుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఆ స్థాయిలో కావాల్సిన ఫార్మా కోర్సులు అందుబాటులో లేవు. దాంతో వాస్తవ స్థితిని గమనించిన ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియూ... మన దేశంలో ‘ఫార్మ్‌-డి’ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు క్లినికల్‌ థెరఫీ, ఫార్మాకోథెరఫీ, క్లినికల్‌ రీసెర్చ్‌, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాలు నిర్వర్తించే నైపుణ్యం కలిగి ఉంటారు.
ఇది ఆరేళ్ల కోర్సు. ఇందులో ఐదేళ్ల పాటు క్లాస్‌రూం టీచింగ్‌, ప్రాక్టికల్స్‌ ఉంటారుు. చివరి ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ చదివిన అభ్యర్థులు, లేదా డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (డి.ఫార్మసీ) ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. ఎంసెట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారికి ఆసుపత్రులు, క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థలు, డ్రగ్‌ డవలప్‌మెంట్‌,  క్లినికల్‌ ట్రయల్స్‌,  క్లినికల్‌ ఫార్మసీ విభాగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా... దేశంలో భారీ, చిన్నతరహా బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు రెండొందలున్నాయి. వీటిలో దాదాపు ఐదొందల ఫార్ములేషన్‌ యూనిట్లున్నాయి. అందువల్ల ఉపాధి విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. వెబ్‌సైట్‌: www.pci.nic.in
ఫార్మ్‌-డి కోర్సు వివరాలను తెలపండి?
+
ఫార్మసీ విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కోర్సులు పరిశ్రమ అవసరాలను తీర్చేవిధంగా లేవనే భావనతో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా.. 2008లో ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఫార్మ్‌.డి). ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్లినికల్‌ థెరపీ, ఫార్మకోథెరపీ, క్లినికల్‌ రీసెర్చ్‌, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాల్లో సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఫార్మ్‌.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌.తో సమానమైదని చెప్పొచ్చు. థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ఆరేళ్ల ఈ కోర్సులో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇందులో ఐదేళ్లు క్లాస్‌ రూం టీచింగ్‌, ప్రాక్టికల్స్‌ సమ్మిళితంగా ఉంటుంది. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్‌.
 ఫార్మ్‌.డి.కోర్సుకు అర్హత: ఇంటర్మీడియెట్‌(ఎంపీసీ, బైపీసీ). ఎంసెట్‌ ర్యాంక్‌ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ విద్యార్థులకు ఫార్మ్‌-డి కోర్సులో లేటరల్‌ ఎంట్రీ విధానంలో... నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం లభిస్తుంది. దీన్ని ‘పోస్ట్‌ బ్యాకులరేట్‌ ప్రోగ్రామ్‌’గా వ్యవహరిస్తారు. ఇందుకోసం బీ ఫార్మసీ ఉత్తీర్ణులు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) రాయాలి.