Skip to main content

Agriculture, Horticulture, Veterinary

నాకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సుల గురించి తెలపండి?
+

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పి.వి.నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సులు అందిస్తున్నాయి.

అగ్రి పాలిటెక్నిక్‌లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. హార్టికల్చర్‌లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వెటర్నరీ పాలిటెక్నిక్‌లో భాగంగా డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ, డిప్లొమా ఇన్ ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులున్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. దరఖాస్తుకు సమయం ఉంది. మరిన్ని వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్స్ చూడొచ్చు.

బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సు వివరాలను తెలపండి?
+
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు కాలేజీలు బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అవి.. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-సంగారెడ్డి (మెదక్ జిల్లా), కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-మడకశిర (అనంతపురం జిల్లా), కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-బాపట్ల (గుంటూరు జిల్లా).
అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ). ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు. బ్యాచిలర్ కోర్సుల తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్, పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులను చదివే అవకాశం ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (వెబ్‌సైట్: www.angrau.ac.in ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్ (వెబ్‌సైట్: www.manage.gov.in ), డాక్టర్ యశ్వంత్ సింగ్ పామర్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.yspuniversity.ac.in ) వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
అగ్రికల్చర్‌లో డిప్లొమా అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి?
+
  • ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్‌లో డిప్లొమా అందిస్తోంది.
    అర్హత:
    పదో తరగతి.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. ఇందులో ఉత్తీర్ణత ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు.
    వెబ్‌సైట్:  www.pjtsau.ac.in
  • ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
    అర్హత:
    పదో తరగతి.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. ఇందులో ఉత్తీర్ణత ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు.
    వెబ్‌సైట్:  www.angrau.ac.in
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్‌లో బీఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    బయాలజీ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్ పరీక్ష ఉత్తీర్ణత ఆధారంగా. ఈ పరీక్ష ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో కూడా ప్రవేశం పొందవచ్చు.
    వెబ్‌సైట్:  www.angrau.ac.in
  • హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్‌లో బీఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    బయాలజీ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ పరీక్షలో ర్యాంకు ఆధారంగా. ఇందులో ర్యాంకు ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న 3 కళాశాలల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.
    వెబ్‌సైట్:  www.pjtsau.ac.in
  • తమిళనాడులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • ఇదే విశ్వవిద్యాలయం.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు కూడా అందిస్తోంది.
    వెబ్‌సైట్:
      www.tnau.ac.in
అగ్రికల్చర్ కోర్సులో బ్యాచిలర్స్ డిగ్రీని అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలు అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తున్నాయి.
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బాపట్ల
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మడకశిర.
    అర్హత: ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది.
    కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు.
    అర్హత: ఎంపీసీ లేదా బైపీసీతో ఇంటర్మీడియెట్/10+2.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.angrau.ac.in
  • హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది.
    కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు.
    అర్హత: ఎంపీసీ లేదా బైపీసీతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.pjtsau.ac.in
  • కేరళలోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.kau.in
  • తమిళనాడులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • ఇదే సంస్థ అగ్రికల్చర్‌లో బీఎస్సీ అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.tnau.ac.in

ఉద్యోగావకాశాలు:
  • ఐకార్‌లోని అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులవటం ద్వారా ప్రభుత్వ సంస్థల్లో పరిశోధనలు చేయవచ్చు.
  • అగ్రికల్చరల్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించవచ్చు.
  • ట్రైనింగ్ ఆర్గనైజర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాలను కృషి విజ్ఞాన కేంద్రాలు ఆఫర్ చేస్తున్నాయి.
  • రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్, అగ్రికల్చరల్ ఫైనాన్స్ ఆఫీసర్స్ వంటి బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.
హార్టీకల్చర్ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
Which Institutes offers Horticulture Courses in India
  • హార్టీకల్చర్‌లోబీఎస్సీ(ఆనర్స్)అందించే ఇన్‌స్టిట్యూట్‌లు
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, పశ్చిమ గోదావరి
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, మహబూబ్‌నగర్
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, హైదరాబాద్
  • కాలేజ్ ఆఫ్ హార్టీకల్చర్, కడప
అర్హత: ఫిజిక్స్, బయలాజికల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా అగ్రికల్చరల్ సెన్సైస్, అగ్రికల్చర్‌లో వొకేషనల్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.

హార్టీకల్చర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అందిస్తున్న సంస్థలు:
పశ్చిమ గోదావరిలోని డా.వైఎస్సార్ హార్టీకల్చరల్ విశ్వవిద్యాలయం.. ఫ్రూట్ సైన్స్, వెజిటెబుల్ సైన్స్‌లలో ఎంఎస్సీ హార్టీకల్చర్‌ను అందిస్తోంది. ఫ్లోరీకల్చర్, ల్యాండ్‌స్కేపింగ్, స్పైసెస్, మెడిసినల్, ప్లాంటేషన్ క్రాప్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: బీఎస్సీ హార్టీకల్చర్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.drysrhu.edu.in

హిమాచల్‌ప్రదేశ్‌లోని డా.యశ్వంత్ సింగ్ పార్మర్ యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చర్ అండ్ ఫారెస్ట్రీ.. ఎంఎస్సీ హార్టీకల్చర్‌ను అందిస్తోంది.
బయోటెక్నాలజీ, ఎంటమాలజీ అండ్ ఎపీకల్చర్, ఫ్లోరీకల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ఫ్రూట్ బ్రీడింగ్ అండ్ జెనిటిక్ రిసోర్సెస్, మైకాలజీ అండ్ ప్లాంట్ పాథాలజీ, ఫ్రూట్ సైన్స్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ వెజిటెబుల్ సైన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: బీఎస్సీ హార్టీకల్చర్/అగ్రికల్చర్
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.yspuniversity.ac.in
ఎంఎస్సీ డెయిరీ సైన్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో వివరించండి?
+
ఈ మధ్యకాలంలో డెయిరీ సైన్స్/టెక్నాలజీలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. అందువల్ల డెయిరీ రంగ విస్తృతి పెరిగి,అభివృద్ధి జరిగి ఉద్యోగావకాశాలు పెరిగాయి. డెయిరీ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా డెయిరీ టెక్నాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనిటిక్స్, డెయిరీ ఎకనామిక్స్ లాంటి అనేక అంశాలపై అధ్యయనం సాగిస్తారు. దీంతో ఈ కోర్సు పూర్తి చేశాక మిల్క్ ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్ లాంటి రంగాల్లో పనిచేసేందుకు అవసరమైన స్కిల్స్‌ను పెంపొందించుకుంటారు. డెయిరీ ప్లాంట్స్, డెయిరీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. భారతదేశం లేదా విదేశాల్లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం ఉంది. పరిశోధనపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందుకోసం ప్రయత్నించవచ్చు.
అగ్రికల్చర్ బీటెక్ చేసిన తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయో వివరించండి?
+
ఇందులో ఉద్యోగావకాశాలు మెరుగుపరచుకోవడానికి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. 12
విభాగాల్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
అర్హత: నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్సీ (సీఏబీఎం)/బీఎస్సీ (అగ్రికల్చర్)
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.angrau.net

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్.. అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్‌లలో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చరల్ సైన్స్/అనుబంధ సబ్జెక్టుల్లో డిగ్రీతోపాటు అగ్రిబిజినెస్ కంపెనీలు, ఎన్జీఓలు, కోఆపరేటివ్స్, ఇతర ప్రై వేటు రంగ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.
ప్రవేశం: క్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.manage.gov.in

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని డాక్టర్ యశ్వంత్ సింగ్ పార్‌మార్ యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చర్ అండ్ ఫారెస్ట్రీ.. ఎపీకల్చర్, ఫ్లోరీకల్చర్, ఎంటమాల జీ, ఫ్రూట్ బ్రీడింగ్, ల్యాండ్‌స్కేపింగ్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, వెజిటెబుల్ సైన్స్, మైకాలజీ, ప్లాంట్ పాథాలజీ, జెనెటిక్ రిసోర్సెస్ లాంటి స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ హార్టీకల్చర్ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీఎస్సీ హార్టీకల్చర్/అగ్రికల్చర్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.yspuniversity.ac.in

ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో:
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్).. వ్యవసాయంలో పరిశోధన విభాగంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులను రిక్రూట్ చేసుకునే సంస్థ.. ఏటా రిక్రూట్ చేస్తుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిస్ట్రిక్ట్ హార్టీకల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టుల నియామకాలను చేపడుతుంది. ఆర్గనైజర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ లాంటి పోస్టులకు కృషి విజ్ఞాన్ కేంద్రాలు శిక్షణ ఇస్తున్నాయి. రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్ల పోస్టుల కోసం అనేక బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ పోస్టుల కోసం ప్రయత్నించవచ్చు.

ప్రైవేటు సంస్థల్లో: ప్రైవేటు సీడ్ కంపెనీల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రయత్నించవచ్చు. హార్టీకల్చరిస్టు సర్వీసుల కోసం ఫార్మస్యూటికల్ కంపెనీలు హెర్బల్ మెడిసిన్స్ తయారీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఇందుకోసం ప్రయత్నించవచ్చు. టీచింగ్‌పై ఆసక్తి ఉంటే హార్టీకల్చర్, అగ్రికల్చర్ విద్యా సంస్థల్లో బోధించవచ్చు. లెక్చరర్, రీడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.
ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలేవి?
+
మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 12 డిసిప్లెయిన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోంది. అర్హత: బీఎస్సీ(సీఏబీఎం)లేదా బీఎస్సీ(అగ్రికల్చరల్‌). ఇవేకాకుండా ఎంఎస్సీ(అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ), ఎంఎస్సీ (అగ్రి విత్‌ వాటర్‌ మేనేజ్‌మెం ట్‌), ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను కూడా ఈ వర్సిటీ అందిస్తోంది.
వివరాలకు: www.angrau.net
యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సెన్సైస్‌, గాంధీ కృషి విజ్ఞాన్‌ కేంద్ర-బెంగళూరు, వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌) కోర్సును ఆఫర్‌ చేస్తోంది. అంతే కాకుండా ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ విత్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ ఇంజనీరింగ్‌/పోస్ట్‌ హార్వెస్ట్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌) కోర్సులను కూడా అందిస్తోంది.
వివరాలకు: www.uasbangalore.edu.in
సామ్‌ హిగ్గిన్‌బాథమ్‌(అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ టెక్నాలజీ అండ్‌ సెన్సైస్‌ పిలుస్తారు డీమ్డ్‌ యూనివర్సిటీ), అలహాబాద్‌ వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ (అగ్రికల్చరల్‌), ఎంబీఏ (అగ్రిబిజినెస్‌) కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.
వివరాలకు: www.aaidu.org
అగ్రికల్చర్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సు ఆఫర్‌ చేస్తున్న విశ్వవిద్యాలయాల గురించి వివరించండి?
+
వ్యవసాయ రంగానికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కొత్త పద్ధతులను కనిపెట్టడం, నూతన ఆవిష్కరణలు చేపట్టడం వంటి కార్యకలాపాలకు ఇంజనీరింగ్‌ అభ్యర్థులు అవసరమవుతారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచే క్రమంలో ఇంజనీర్లు వ్యవసాయదారులకు అందించే సూచ నలు, సలహాలు ఎంతో విలువైనవి. కాబట్టి వ్యవసాయ రంగానికి ఇంజనీర్ల అవసరం ఎంతో ఉంది.
కోర్సులు ఆఫర్‌ చేసే విద్యాసంస్థలు:
ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)-ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
అర్హత: కనీసం 50శాతం మార్కులతో (ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులు 40 శాతం) బీటెక్‌ (అగ్రికల్చర్‌) పూర్తి చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.angrau.net
ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌తో అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)/ ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌ అండ్‌ డ్రై నేజ్‌ ఇంజనీరింగ్‌/ సాయిల్‌ వాటర్‌ కన్వర్జేషన్‌ ఇంజనీరింగ్‌ ప్రత్యేకాం శాలుగా అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టి ట్యూట్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ) కోర్సును ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: బీఈ/బీటెక్‌ (మెకానికల్‌/అగ్రికల్చ రల్‌ ఇంజనీరింగ్‌) చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.aaidu.org
హార్టికల్చర్‌ కోర్సు వివరాలను తెలపండి?
+

మన రాష్ట్ర ప్రభుత్వం 2007-08 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక హార్టికల్చర్‌ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని వెంకటరామన్న గూడెంలో ప్రారంభించింది. యూనివర్సిటీతోపాటు అను బంధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మోజెర్ల, కడప జిల్లా అనంతరాజుపేట, హైదరాబాద్‌లోని ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలోని హార్టికల్చర్‌ విభాగంలో కళాశాలల్ని కూడా ప్రారంభించారు. వీటిలో హార్టికల్చర్‌ సైన్స్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నారుు. బీఎస్సీ (హార్టికల్చర్‌)కి అర్హత ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్‌, బయాలజీ సబ్జెక్టులు లేదా అగ్రికల్చరల్‌ ఓకేషనల్‌ కోర్సు. ఎంసెట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌:  www.aphu.edu.in

దేశంలో వ్యవసాయ పరిశోధనలో ప్రసిద్ధిగాంచిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ప్రతి ఏటా హార్టికల్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యా బోధన కేంద్రాల్లో 15 శాతం సీట్లను కేటాయిస్తారు. ఈ పరీక్ష నోటిఫికేషన్‌ ప్రతి ఏటా డిసెంబర్‌ లేదా జనవరి నెలల్లో వెలువడుతుంది.
వెబ్‌సైట్‌: www.icar.org.in

ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ (డైరీయింగ్‌) కోర్సు చదువుతున్నాను. ఈ అంశంలో ఉన్నత చదువుల కోసం కోర్సులు ఏమైనా ఉన్నాయూ? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటారుు?
+

అంతర్జాతీయ డైరీ మార్కెట్‌లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ తయూరయ్యే పాల ఉత్పత్తులు, అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలు, నాణ్యత కలిగి ఉండటంతో మన దేశానికి మంచి ఖ్యాతి లభిస్తోంది. ఫలితంగా ఈ పరిశ్రమ భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించగలదన్నది నిపుణులు అభిప్రాయం. 2020 నాటికి దేశంలో పాల ఉత్పత్తి 168 మిలియన్‌ టన్నులకు చేరుకోనుంది. పబ్లిక్‌, ప్రైవేట్‌, సహకార రంగాల్లో భారీ ఆధునిక డైరీ ప్లాంట్స్‌ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగినట్టుగా పెద్ద సంఖ్యలో మానవ వనరులు కూడా అవసరం.
ఉన్నత విద్యావకాశాలు - డైరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులు ఉన్నాయి. ‘ఇగ్నో’ దూరవిద్య విధానంలో పీహెచ్‌డీ, డిప్లొమా ఇన్‌ డైరీ టెక్నాలజీ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. డిప్లొమా కోర్సును ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సహకారంలో అందిస్తోంది. డైరీ పరిశ్రమలో టెక్నీషియన్‌ స్థాయి మానవ వనరులను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కోర్సు రూపొందించారు. డైరీ ప్లాంట్స్‌ లో ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫ్‌ మిల్క్‌, ఫూడ్‌ మిల్క్‌ ప్రాసెసింగ్‌, ప్రొడక్షన్‌ ఆఫ్‌ వ్యాల్యూ యూడెడ్‌ ప్రొడక్ట్‌, క్వాలిటీ కంట్రోల్‌ యూక్స్పెక్ట్స్‌కు సంబంధించిన అంశాలు ఈ కోర్సులో ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. డిప్లొమా కోర్సులో చేరేందుకు 10+2 ఉత్తీ ర్ణులు, ‘ఇగ్నో’ అందిస్తోన్న బ్యాచ్‌లర్‌ ప్రిపరేటరీ ప్రోగ్రాం (బీపీపీ) చేసిన అభ్యర్థులు అర్హులు.