Skip to main content

Management

దేశంలో ఎంబీఏకు బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏవో తెలపండి? -రామారావు
+
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2019 ప్రకారం మేనేజ్‌మెంట్ విద్యలో ఐఐఎం బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ (టీఎల్‌ఆర్)లో 92.85(100), రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అండ్ కొలాబరేటివ్ పెర్ఫార్మెన్స్(ఆర్‌పీసీ)లో 55.03(100), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్(ఓసీ)లో 98.35(100), ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ)లో 73.09(100), పెర్‌సెప్షన్‌లో100(100) స్కోరుతో ఐఐఎం-బి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తా, ఐఐఎం లక్నో, ఐఐఎం ఇండోర్‌లు నిలిచాయి. ఐఐఎంలో ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం కోర్సులను అభ్యసించాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఐఐఎం, ఐఐటీలను పక్కనె బెట్టి చూస్తే జంషెడ్‌పూర్‌లోని గ్జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్, గుర్‌గావ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎండీఐ), ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, చెన్నైలోని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, పుణెలోని సింబయాసిస్, ముంబైలోని నర్సిమోంజీ తదితర ఇన్‌స్టిట్యూట్‌లు టాప్‌లో నిలిచాయి.
నేను 2020లో డిగ్రీ పూర్తి చేసుకోబోతున్నాను. నాకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసక్తి ఉంది. కోర్సులు, కాలేజీలు, ఫీజులు, కెరీర్‌ అవకాశాల గురించి తెలపండి?
+
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి ప్రస్తుతం పీజీ స్థాయిలో పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్‌. వైఎస్‌ఆర్‌ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ఎంబీఏ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఉంది. దీంతోపాటు అమిటీ యూనివర్సిటీ, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌వంటి పలు ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ స్థాయిలో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉంది. క్యాట్, సీమ్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ స్కోర్ల ఆధారంగా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి  ప్రవేశం పొందొచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హోటల్స్, ఎయిర్‌ పోర్ట్స్, ట్రావెల్‌ ఏజెన్సీలలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలో ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ మేనేజర్, ఆపరేషన్స్‌ మేనేజర్, కీ అకౌంట్స్‌ మేనేజర్‌ వంటి హోదాలతో కెరీర్‌ ప్రారంభించొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటరాక్షన్‌ స్కిల్స్‌ వంటి పర్సనల్‌ స్కిల్స్‌ తప్పనిసరి. అదే విధంగా ఇంగ్లిష్‌తోపాటు ఏదైనా ఫారెన్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యం కూడా సొంతం చేసుకున్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ఆఫర్‌ చేస్తున్న ఎంబీఏ కోర్సుల వివరాలు తెలియజేయండి?
+
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)కు దేశంలో న్యూఢిల్లీ, కోల్‌కతాలో క్యాంపస్‌లు ఉన్నాయి. దీన్ని భారత ప్రభుత్వం ఓ స్వయం ప్రతిపత్తి సంస్థగా 1963లో ఏర్పాటు చేసింది. విదేశీ వర్తక నిర్వహణలో మానవ వనరులను అభివృద్ధి చేసి, తద్వారా ఎగుమతులను పెంచేందుకు ఈ సంస్థ దోహదం చేస్తోంది.

ఆఫర్‌ చేస్తున్న కోర్సులు: రెండేళ్ల వ్యవధితో ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌–ఫుల్‌టైం); మూడేళ్ల వ్యవధితో ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌–పార్ట్‌టైం) కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.

అర్హతలు, ఎంపిక విధానం..
 రెండేళ్ల ఎంబీఏ:
ఏదైనా విభాగంలో మూడేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ డిగ్రీ. రాత పరీక్ష, ఎస్సే రైటింగ్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. విదేశీ విద్యార్థులు/ఎన్నారై/ఎన్నారై పిల్లలకు జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్షను మల్టిపుల్‌ ఛాయిస్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇంగ్లిష్‌ కాంప్రెహెన్షన్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ అవేర్‌నెస్‌; లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
మూడేళ్ల ఎంబీఏ: బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం. కంపెనీ స్పాన్సర్‌షిప్‌/ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌. గ్రూప్‌ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఐఐఎఫ్‌టీ ఆఫర్‌ చేస్తున్న ఇతర కోర్సులు:  ఇంటర్నేషనల్‌ బిజినెస్, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌; క్యాపిటల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా. ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌; క్యాపిటల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌; గ్లోబల్‌ ట్రేడ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐఎఫ్‌టీ పీహెచ్‌డీని కూడా ఆఫర్‌ చేస్తోంది.
వెబ్‌సైట్‌: http://tedu.iift.ac.in/iift/index.php
రూరల్ డెవలప్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి.
+
అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్... రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ., ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.gbpssi.nic.in
 
 గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్
 (ఐఆర్‌ఎంఏ), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.irma.ac.in
 
రాంచీలోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (ఎక్స్‌ఐఎస్‌ఎస్), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.xiss.ac.in
 
ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.  వెబ్‌సైట్: www.ignou.ac.in
 
అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సు అందిస్తోంది. 
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.skuniversity.org
 
వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.
వెబ్‌సైట్: www.sdlceku.co.in
కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+

పుణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్.. కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తోంది. బ్రాండ్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.simc.edu

అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్.. కమ్యూనికేషన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/ ఎంఐఏసీటీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.mica.ac.in  

నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్.. అడ్వర్‌టైజింగ్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.niaindia.org

ట్రావెల్ అండ్ టూరిజం కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
 • ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ సూపర్‌వైజర్, యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టూర్ ప్లానర్ వంటి పోస్టుల్లో పనిచేయవచ్చు.
 • హైదరాబాద్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఎంబీఏ అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/ఐసెట్ ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 • ఇదే సంస్థ టూరిజం మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: మ్యాట్/ఏటీఎంఏ/ఐసెట్/క్యాట్ ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.nithm.ac.in
 • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్(ఎంటీటీఎం)కోర్సును అందిస్తోంది.
  అర్హత:ఏదైనా డిగ్రీ
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.anu.ac.in
 • ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. దూరవిద్య విధానంలో టూరిజం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అందిస్తోంది.
  అర్హత:
  బీటీఎస్/బీహెచ్‌ఎం/బీఏ(టూరిజం) లేదా ఏదైనా డిగ్రీతోపాటు టూరిజంలో డిప్లొమా.
  వెబ్‌సైట్:  www.ignou.ac.in
ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి?
+
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది.
అర్హత:
గ్రాడ్యుయేషన్
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను కొన్ని రకాల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను కూడా ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేస్తుంది.
రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి?
+
 • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 • ఇదే విశ్వవిద్యాలయం, రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో డిప్లొమా అందిస్తోంది. ఏడాది పాటు కోర్సు అందిస్తారు.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
  వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in  
 • హైదరాబాద్‌లోని నర్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పార్ట్‌టైం విధానంలో రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.nmimshyderabad.org  
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
 • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ అందిస్తోంది.
  అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.ihmhyd.org
 • హైదరాబాద్‌లోని రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ.. హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందిస్తోంది.
  అర్హత: ఇంటర్మీడియెట్/10+2
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.rchmct.org
 • హైదరాబాద్‌లోని కలినరీ అకాడెమీ ఆఫ్ ఇండియా.. హోటల్ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులను అందిస్తోంది.
 • క్యాటరింగ్ టెక్నాలజీ కలినరీ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
  అర్హత:
  ఇంటర్మీడియెట్/10+2
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 • కలినరీ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
  అర్హత: హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ/ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్/ హోటల్ లేదా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ/ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్/ హోటల్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ/ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో బీఏ/ కుల్నరీ ఆర్ట్ గ్రాడ్యుయేట్లు.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 • ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాటిస్సెరీ
  అర్హత: ఇంగ్లిష్ మీడియంతో పదో తరగతి.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.iactchefacademy.com
ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
 • హాస్పిటాలిటీ, ఈవెంట్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. వీటిలో మంచి కెరీర్‌తో పాటు అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
  • ఈవెంట్ అంటే పెళ్లి, బిజినెస్ మీటింగ్, ఫ్యాషన్ షో, ప్రొడక్ట్ లాంచ్, అవార్డు ఫంక్షన్, కాంటెస్ట్ వంటివి ఏదైనా కావొచ్చు. పర్సనల్ ఫంక్షన్స్ క్లయింట్ స్టేటస్‌కు తగ్గట్టుగా నిర్వహిస్తారు. భారీ ఎత్తున జరిగే కార్పొరేట్, అవార్డ్ ఫంక్షన్స్‌కు కమ్యూనికేషన్, మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • టెక్నికల్ నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే గుణం, చిన్న విషయాలకు సైతం ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, ఉత్సాహం వంటి లక్షణాలు ఉండాలి.

 • బంజారాహిల్స్‌లోని రచనోత్సవ్ ఈవెంట్స్ అకాడమీ.. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్ ఫౌండేషన్ కోర్సు, అడ్వాన్స్‌డ్ మాస్టర్స్ కోర్సును అందిస్తోంది.
  అర్హత: ప్రొఫెషనల్ ఫౌండేషన్ కోర్సుకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్. అడ్వాన్స్‌డ్ కోర్సుకు ఏదైనా డిగ్రీ. ఆరు నెలల పని అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.rachnoutsaveventsacademy.com
 • హైదరాబాద్‌లోని గురుకుల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్‌లో 9 నెలల ఫౌండేషన్ కోర్సు అందిస్తోంది.
  అర్హత: ఇంటర్మీడియెట్/10+2
  దీంతోపాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్‌లో అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ కోర్సు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఈ కోర్సులు ఆన్‌లైన్‌లో, రెగ్యులర్ విధానంలో కూడా అందుబాటులో ఉన్నాయి.
  వెబ్‌సైట్: www.gurucooledutech.com
ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
 • ప్రస్తుతం కంపెనీలన్నీ తమ బిజినెస్‌ను ప్రపంచవ్యాప్తం చేయటానికి, అనేక రకాల సమస్యలను పరిష్కరించేందుకు మేనేజర్లకు అదనపు నైపుణ్యాలు ఉండాలని భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ చేసే అభ్యర్థులకు ఈ దిశగా నైపుణ్యాలు లభిస్తాయి.
 • విదేశీ వాణిజ్యం, ఎగుమతి-దిగుమతులు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల అధ్యయనం ఉంటుంది.
 • మాన్యుఫ్యాక్చరర్ ఎక్స్‌పోర్టర్స్, మర్చెంట్ ఎక్స్‌పోర్టర్స్, షిప్పింగ్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్ ప్లేయర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలు సాధించవచ్చు.
 • ఎగుమతులు-దిగుమతులు, ఫైనాన్స్, షిప్పింగ్ అండ్ ఏవియేషన్, టూరిజం వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
 • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్.. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎలక్టివ్ సబ్జెక్టుగా బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.ipeindia.org
 • హైదరాబాద్‌లోని శివశివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. గ్లోబల్ బిజినెస్ ఎలక్టివ్ సబ్జెక్టుగా మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.ssim.ac.in
 • హైదరాబాద్‌లోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్.. ఇంటర్నేషనల్ బిజినెస్ సబ్జెక్టు స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.ghbs.in
స్పోర్ట్స్ సైన్స్ లేదా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
 • తమిళనాడులోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ.. వివిధ స్పోర్ట్స్ సైన్స్ కోర్సుల్లో పీజీ డిప్లొమా అందిస్తోంది. ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్, ఎక్సర్‌సైజ్ థెరపీ, ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ మేనేజ్‌మెంట్ కోర్సులను పీజీ డిప్లొమా ద్వారా అందిస్తోంది. ఈ కోర్సులను దూరవిద్య విధానంలో కూడా యూనివర్సిటీ అందిస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
  వెబ్‌సైట్:  www.tnpesu.org
 • కోల్‌కతాలోని సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్.. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.iiswbm.edu
 • ముంబైలోని శ్రీమతి నతిబాయ్ దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయం.. రెగ్యులర్ విధానంలో స్పోర్ట్స్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
  అర్హత: ఫుడ్ అండ్ న్యూట్రిషన్/బయోకెమిస్ట్రీ/లైఫ్ సెన్సైస్‌లలో బీఎస్సీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.sndt.digitaluniversity.ac
 • నోయిడాలోని అమిటీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సెన్సైస్.. రెగ్యులర్ విధానంలో స్పోర్ట్స్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
  అర్హత: సైకాలజీలో గ్రాడ్యుయేషన్
  వెబ్‌సైట్:  www.amity.edu
ఇన్సూరెన్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
+
Which Institutes offers Insurance Courses in India, Job Opportunities in Insurance Sector in India
ఇన్సూరెన్స్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు చాలానే ఉన్నాయి. దీని అధ్యయనం ద్వారా ఇన్సూరెన్స్ బిజినెస్‌పై అవగాహన వస్తుంది. ఇన్సూరెన్స్ రంగంలో రిస్క్‌ల గురించి తెలిపే శాస్త్రమే.. యాక్చూరియల్ సైన్స్.

యాక్చూరియల్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్.. పలు డిప్లొమా కోర్సులను అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లలో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలను అందిస్తోంది. యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ. దీనికి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అర్హులే. ఎంబీఏ లేదా సీఏ/ సీఎంఏ/సీఎస్ విద్యార్థులు కూడా ఈ కోర్సు చేసేందుకు అర్హులు.
ప్రవేశం: దరఖాస్తు చేసుకోవడం ద్వారా.
వెబ్‌సైట్: www.iirmworld.org.in

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్... ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.ipeindia.org
ఉద్యోగావకాశాలు: ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టెంట్స్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందవచ్చు.
రిటైల్ మేనేజ్‌మెంట్ అండ్ మార్కెటింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
రిటైల్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో అకౌంటింగ్, బిజినెస్ మ్యాథమెటిక్స్, కస్టమర్ రిలేషన్స్, విజువల్ మర్కండైజింగ్, రిటైల్ కమ్యూనికేషన్, మాల్ మేనేజ్‌మెంట్ లాంటి సబ్జెక్టులు ఉంటాయి.
 • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత:
  కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
  వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 • హైదరాబాద్‌లోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. పార్ట్ టైం విధానంలో స్టడీస్ రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  వెబ్‌సైట్: www.nmimshyderabad.org
 • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్.. మార్కెటింగ్ విభాగంలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.ipeindia.org
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మేనేజర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ భారీగా పెరుగుతున్నాయి. ప్రైవేటులోనే కాకుండా ప్రభుత్వరంగంలో, లాభాపేక్షలేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్న వారు కూడా ఆసుపత్రులను అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ వనరుల డిమాండ్ బాగా పెరిగింది. అందువల్ల మెడిసిన్, తత్సంబంధ కోర్సుల్లో ప్రవేశం ఉన్నవారికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ ఉన్నత కెరీర్‌ను అందిస్తుంది.
 • ఈ కోర్సును మెడికల్‌తోపాటు నాన్ మెడికల్ విద్యార్థులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి భారతదేశంతోపాటు విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా స్టాఫ్‌ను మానేజ్ చేయటం, హెల్త్ సర్వీసెస్‌ను చూసుకోవటం, ఖర్చుల వివరాలు తెలుసుకోవటం వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుంది.
 • దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్(ఎంహెచ్‌ఎం)ను అందిస్తోంది.
కాలపరిమితి: రెండున్నర ఏళ్లు. ఇందులో ఇంటర్న్‌షిప్ కూడా చేయాలి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ
ప్రవేశం: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
 • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్య విధానంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తోంది.
అర్హత: డిగ్రీ

వెబ్‌సైట్:  www.nagarjunauniversity.ac.in
ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ప్రస్తుతం ఈ కోర్సులో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇందులో నిపుణత సాధించిన అభ్యర్థులు సేల్స్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ సూపర్‌వైజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టూర్ ప్లానర్ వంటి విధులు నిర్వర్తించవచ్చు.
 • హైదరాబాద్‌లోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ.. టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత:
  కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/ఐసెట్ ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
 • ఈ సంస్థ టూరిజం మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత:
  కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: మ్యాట్/క్యాట్/ఎక్స్‌ఏటీ ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.nithm.ac.in
 • గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.. ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
  అర్హత:
  ఏదైనా డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.nagarjunauniversity.ac.in
సేఫ్టీ మేనేజ్‌మెంట్ కోర్సును అందించే సంస్థల వివరాలు తెలపండి?
+
 • ఆంధ్రప్రదేశ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్.. సేఫ్టీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి వివిధ కోర్సులను అందిస్తోంది.
 • సేఫ్టీ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ, సేఫ్టీ ఇన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ఎలక్టివ్ సబ్జెక్టులుగా రెండేళ్ల ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
 • ఫైర్ అండ్ సేఫ్టీలో ఒకేడాది డిప్లొమా కోర్సును అందిస్తోంది.
  అర్హత: పదో తరగతి.
 • హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్‌లో ఒకేడాది డిప్లొమా కోర్సును అందిస్తోంది.
  అర్హత: పదో తరగతి, ఐటీఐ/సైన్స్‌లో ఇంటర్మీడియెట్.
 • ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఒకేడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
 • హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఒకేడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
  అర్హత: బీఎస్సీ/మూడేళ్ల డిప్లొమా/బీఈ/బీటెక్.
 • ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో బీఎస్సీ. కోర్సు కాల వ్యవధి: మూడేళ్లు
  అర్హత: ఇంటర్మీడియెట్ లేదా ఐటీఐ.

వెబ్‌సైట్: www.nifsindia.net
హోటల్ మేనేజ్‌మెంట్/కలినరీ టెక్నాలజీ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
 • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రీషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది.
  అర్హత: ఇంటర్మీడియెట్/10+2 లేదా తత్సమానం
  ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.ihmhyd.org.

 • హైదరాబాద్‌లోని రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్.. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ అందిస్తోంది.
  అర్హత: ఇంటర్మీడియెట్/10+2
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.rchmct.org .
 • హైదరాబాద్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా వివిధ కోర్సులను అందిస్తోంది.

వాటి వివరాలు...
 • క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ కలినరీ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
  అర్హత: ఇంటర్మీడియెట్/10+2
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.

 • కలినరీ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
  అర్హత: హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, హోటల్/హాస్పిటాలిటీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్/ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌తో రెండేళ్ల పని అనుభవం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో బీఏ, కలినరీ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్.
  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.

 • ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాటిస్సెరి(పేస్ట్రీస్)లో సర్టిఫికెట్ కోర్సు
  అర్హత: పదో తరగతి. ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి.
  ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.iactchefacademy.com
దూరవిద్య విధానంలో ఎంబీఏ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
పనిచేస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి పార్ట్ టైం విధానంలో ఎంబీఏ ఉపకరిస్తుంది.

కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
 • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పార్ట్‌టైం విధానంలో ఎంబీఏను అందిస్తోంది. హైదరాబాద్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులు.
  అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఎస్‌ఎస్‌సీలో మ్యాథమాటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
  ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
  వెబ్‌సైట్:  www.jntuh.ac.in
 • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. దూరవిద్య విధానంలో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు కనీసం మూడేళ్లు ఏదైనా వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఎగ్జిక్యూటివ్/మేనేజ్‌మెంట్/ పరిపాలన విభాగంలో పనిచేసి ఉండాలి.
  ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.osmania.ac.in
ఏవియేషన్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్లు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
+
 • హైదరాబాద్‌లోని కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీతో అనుబంధంగా పనిచేస్తున్న అవలాన్ అకాడెమీ ఫుల్‌టైం, పార్ట్‌టైం విధానాల్లో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత: డిగ్రీ.
  వెబ్‌సైట్: www.avalonacademy.in

 • తమిళనాడులోని హిందుస్థాన్ యూనివర్సిటీ.. ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత: బీకాం, బీబీఏ, బీఏ(కార్పొరేట్), బీఐఎస్‌ఎం, బీబీఎం, బీఎస్సీ(మ్యాథమెటిక్స్), బీఎస్సీ(ఫిజిక్స్), బీఏ(ఎకనామిక్స్), బీఈ, బీటెక్.
  వెబ్‌సైట్: www.hindustanuniv.ac.in

 • డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్.. ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
  ప్రవేశం: యూపీఈఎస్-మెట్/మ్యాట్/క్యాట్‌లో ఉత్తీర్ణతతోపాటు గ్రూప్‌డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత.
  వెబ్‌సైట్: www.upesindia.org

 • కోయంబత్తూర్‌లోని నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అప్లైడ్ సెన్సైస్.. ఎయిర్‌లైన్ అండ్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను అందిస్తోంది.
  అర్హత: డిగ్రీ.
  ప్రవేశం: క్యాట్/మ్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్: www.nehrucolleges.org.in

ఉద్యోగావకాశాలు:
 • ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌ఫ్రైట్ సర్వీస్ ప్రొవైడర్స్‌లో ఏవియేషన్ మేనేజర్స్
 • టూరిజం, హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, రీటెయిల్‌లో ఉద్యోగాలు.
డిజిటల్ మార్కెటింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉన్నత అవకాశాలను వివరించండి?
+
ఇంటర్‌నెట్ ఉపయోగించి వివిధ రకాల బ్రాండ్‌లను ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. సెల్‌ఫోన్స్, గేమ్స్ ఉపకరణాలు తదితర వస్తువులను డిజిటల్ మార్కెట్ ద్వారా అమ్ముతారు. అడ్వర్టైజింగ్, ఎంగేజింగ్, మార్కెటింగ్‌లు కూడా డిజిటల్ మార్కెట్‌లో భాగమే.
ఇందులో నిపుణులు ఈ-మెయిల్స్, సోషల్ మీడియా వెబ్‌సైట్స్, ఫోరమ్స్, బ్లాగ్స్, గ్రాఫిక్ డిజైన్స్, ఫ్లోటింగ్ యాడ్స్ తదితర సాధనాలను ఉపయోగించి బ్రాండ్లకు ప్రచారం నిర్వహిస్తారు.

ఈ కోర్సును అందిస్తున్న సంస్థలు
 • ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ మార్కెటింగ్.. డిజిటల్ మార్కెటింగ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రాంను అందిస్తోంది.
  అర్హత: డిగ్రీ
  వెబ్‌సైట్:  www.iicm.in
 • బెంగళూరులోని ఇంటర్నేషనల్ మొబైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎంఆర్‌ఐ).. డిజిటల్ మార్కెటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను అందిస్తోంది.
  అర్హత: డిగ్రీ
  వెబ్‌సైట్:  www.imri.in
 • కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్.. డిజిటల్ మార్కెటింగ్‌లో మాడ్యులర్ కోర్సు అందిస్తోంది.
  వెబ్‌సైట్:  www.theidmi.com
 • పుణెలోని లావెనర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్.. డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ అందిస్తోంది.
  వెబ్‌సైట్:  www.lipsindia.com
లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
 • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్.. సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణనిస్తుంది. అభ్యర్థి శిక్షణ సమయంలో ఎన్ని మాడ్యూల్స్‌నైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ శిక్షణ దూరవిద్య, ఈ-లెర్నింగ్ విధానాల ద్వారా అందిస్తారు.
  అర్హత: డిగ్రీ.
  వెబ్‌సైట్:  www.iactglobal.in
 • హైదరాబాద్‌లోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌లో దూరవిద్య విధానంలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
  అర్హత: డిగ్రీ.
  ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.ciilogistics.com
 • డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్(యూపీఈఎస్).. లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ డిగ్రీని అందిస్తోంది.
  అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
  ప్రవేశం: యూపీఈఎస్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ (యూపీఈఎస్‌ఎంఈటీ)/జాతీయస్థాయి రాత పరీక్షలైన ఎక్స్‌ఏటీ/ మ్యాట్/ క్యాట్‌లలో మంచి ర్యాంకుతో పాటు సంస్థ నిర్వహించే గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
  వెబ్‌సైట్:  www.upes.ac.in
 • చెన్నైలోని వీఈఎల్‌ఎస్ విశ్వవిద్యాలయం లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ డిగ్రీని ఆఫర్ చేస్తోంది.
  అర్హత: ఏదైనా డిగ్రీ.
  వెబ్‌సైట్:  www.velsuniv.org
 • ఉద్యోగావకాశాలు: ఎఫ్‌ఎంసీజీ, రీటైల్, ఏవియేషన్, షిప్పింగ్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ లాంటి ఇండస్ట్రీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
రూరల్ డెవలప్‌మెంట్ కోర్సు అందిస్తున్న సంస్థల వివరాలు, ఉపాధి అవకాశాల గురించి వివరించండి?
+
కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
అర్హత:
డిగ్రీ
వెబ్‌సైట్:  www.gbpssi.nic.in

గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్(ఐఆర్‌ఎంఏ).. రూరల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత:
50 శాతం మార్కులతో డిగ్రీ
వెబ్‌సైట్:  www.irma.ac.in

జార్ఖండ్‌లోని రాంచీలో జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్.. రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత:
డిగ్రీ.
ప్రవేశం: ఎక్స్‌ఏటి పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
వెబ్‌సైట్:  www.xiss.ac.in

పశ్చిమ బెంగాల్‌లోని రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయం.. రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఇంటెగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
అర్హత:
బయలాజికల్/సోషల్ సైన్స్/అనుబంధ సబ్జెక్టుల్లో బీఎస్సీ(ఆనర్స్)
వెబ్‌సైట్:  www.rkmvu.ac.in

దూరవిద్య ద్వారా ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. రూరల్ డెవలప్‌మెంట్‌లో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సులను అందిస్తోంది.
అర్హత:
డిగ్రీ
వెబ్‌సైట్:  www.ignou.ac.in

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత:
డిగ్రీ
వెబ్‌సైట్:  www.skuniversity.org

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్.. రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: డిగ్రీ
వెబ్‌సైట్:  www.kuwarangal.com

ఉపాధి అవకాశాలు: కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ సంస్థలతో పాటు ఎన్‌జీవో, బిజినెస్ సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
ఐఐఎం ఇండోర్ ఆఫర్ చేసే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) గురించి వివరించండి?
+
మేనేజ్‌మెంట్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును ఐఐఎం ఇండోర్ ఆఫర్ చేస్తోంది. అర్హత: 60 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్/10+2 ఉత్తీర్ణత. శాట్-ఐలో 1600 మార్కులకన్నా ఎక్కువ మార్కులు వచ్చినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశం: ఆప్టిట్యూడ్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ మన దేశంలోని బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ఇండోర్ లాంటి ప్రదేశాల్లో జరుగుతుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. రెండు గంటల్లో వంద మార్కులకు సమాధానాలు రాయాలి. పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి.
 1. క్వాంటిటేటివ్ ఎబిలిటీ;
 2. వెర్బల్ ఎబిలిటీ.

వెబ్‌సైట్: www.iimidr.ac.in
టెలీకమ్యూనికేషన్స్‌లో ఎంబీఏ ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ వివరాలు తెలపండి?
+
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీలోని భారతీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.. టెలీకాం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
  అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీలలో బ్యాచిలర్ డిగ్రీ/నాలుగు సంవత్సరాల బీఎస్సీ అగ్రికల్చరల్ సైన్స్/ ఫిజికల్/కెమికల్/ మ్యాథమెటికల్ సెన్సైస్‌లలోని ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎలక్ట్రానిక్స్ సెన్సైస్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/కంప్యూటేషనల్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/అగ్రికల్చర్‌లలో మాస్టర్స్ డిగ్రీ/ కామర్స్/ఎకనమిక్స్‌లో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.

  ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

  వెబ్‌సైట్: www.iitd.ernet.in
 • పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి కాం మేనేజ్‌మెంట్.. సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లు స్పెషలైజేషన్లుగా టెలికాం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
  అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ
  ప్రవేశం: ఎస్‌ఎన్‌ఏపీ ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
  వెబ్‌సైట్: www.sitm.ac.in

 • నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ టెలీకమ్యూనికేషన్స్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. హెచ్‌ఆర్ అండ్ సేల్స్ స్పెషలైజేషన్‌తో కూడా ఈ సంస్థ ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
  అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్, ఐటీ)
  ప్రవేశం: క్యాట్/మ్యాట్/జీమ్యాట్/అమిటీ సంస్థ నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
  వెబ్‌సైట్: www.amity.edu
ఎంబీఏ అకౌంట్స్‌తో పాటు ఏ కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయో వివరించండి?
+
 • ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు: ఈ కోర్సు చేయడం ద్వారా స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో/సొంతంగా ట్రేడింగ్ చేయగలుగుతారు. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో సర్టిఫికేషన్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్, క్యాపిటల్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్, కమోడిటీస్ మార్కెట్, ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లాంటి ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా ఇందులో ప్రావీణ్యాన్ని సాధించవచ్చు.
  వెబ్‌సైట్: www.nseindia.com  

 • శాప్(ఎస్‌ఏపీ): మంచి ఉద్యోగ భవిష్యత్తుకు శాప్ మరో మార్గం. దీంట్లో అనేక టేబుల్స్, మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి. శాప్ ఎఫ్‌ఐ/సీఓ, శాప్ హెచ్‌ఆర్‌లు ఇందులో ఎంబీఏకి అవసరమైన మాడ్యూల్స్.

  శాప్ ఎఫ్‌ఐ/సీఓ: కంపెనీకి సంబంధించిన అకౌంట్స్‌తో పాటు ఫైనాన్స్‌కు సంబంధించిన డేటాను కవర్ చేస్తుంది. దీని ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడుతుంది.

  శాప్ హెచ్‌ఆర్: ఇది హ్యూమన్ రీసోర్సెస్ డేటాను కవర్ చేస్తుంది. ఇది పూర్తిగా సంస్థకు సంబంధించిన హ్యూమన్ రీసోర్సెస్ డేటాకు సంబంధించింది. కంపెనీలు దీనిలో నైపుణ్యం సాధించిన హెచ్‌ఆర్ మేనేజర్లను నియమించుకుంటున్నారు.

బేసిక్ కంప్యూటర్ కోర్సులు:
ఏ ఉద్యోగం చేయడానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వర్క్‌లో ఉపయోగపడే ఎంఎస్ ఆఫీస్‌కు సంబంధించిన కోర్సులు ముందుగా నేర్చుకోవడం కలసివస్తుంది. దీంతో పాటు ఇంటర్నెట్ వినియోగం నేర్చుకోవాలి.
ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సు అందించే సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
+
కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
 • హెదరాబాద్‌లోని డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఎంబీఏని ఆఫర్ చేస్తోంది.
  అర్హత:డిగ్రీ
  ప్రవేశం: క్యాట్/ మ్యాట్/ ఎక్స్‌ఏటీ/ ఐసెట్‌లలో ఉత్తీర్ణతతో పాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
  వెబ్‌సైట్: www.nithm.ac.in
 • కొచ్చిన్‌లోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్‌ఏటీ).. ట్రావెల్ అండ్ టూరిజంలో ఎంబీఏని ఆఫర్ చేస్తోంది.
  అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ.
  ప్రవేశం: సీయూఎస్‌ఏటీ నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)లో ఉత్తీర్ణత ఆధారంగా
  వెబ్‌సైట్: www.cusat.nic.in
 • గ్వాలియర్ అండ్ భువనేశ్వర్‌లోని ఐండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెం ట్.. టూరిజం అండ్ ట్రావెల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.
  అర్హత: డిగ్రీ
  ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/ఏటీఎంఏ/జీమ్యాట్/మ్యాట్ స్కోర్ ఆధారంగా.
  వెబ్‌సైట్: www.iittm.org
 • ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా టూరిజం మేనేజ్‌మెంట్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.
  అర్హత: బీటీఎస్/బీహెచ్‌ఎం/బీఏ(టూరిజం)/డిగ్రీతో టూరిజంలో డిప్లొమా
  వెబ్‌సైట్: www.ignou.ac.in  

ఉద్యోగావకాశాలు:
 • సేల్స్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ సూపర్‌వైజర్
 • యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ టూర్ ప్లానర్
 • ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందించే యూనివర్సిటీల వివరాలు తెలపండి?
  +
  కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
  ప్రొఫెషనల్ ఫౌండేషన్ కోర్సు ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్; అడ్వాన్స్‌డ్ మాస్టర్స్ కోర్సు ఇన్ ఈవెం ట్ మేనేజ్‌మెంట్ కోర్సులను బంజారా హిల్స్‌లోని రచనౌత్సవ్ ఈవెంట్స్ ఎకాడమీ అందిస్తోంది.
  ఆరు నెలలు ఈవెంట్ రంగంలో నిపుణులుగా ఉన్నవారు సైతం ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు.
  అర్హత: ఫౌండేషన్ కోర్సు: ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులతో ఇంటర్ అడ్వాన్స్‌డ్ కోర్సు: డిగ్రీ
  వెబ్‌సైట్:  www.rachanoustaveventsacademy.com

  ద్వారకాలోని అపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్.. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లమా కోర్సును అందిస్తోంది.
  అర్హత:
  ఏదైనా డిగ్రీ
  ప్రవేశం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా
  వెబ్‌సైట్:  www.apeejay.edu

  హైదరాబాద్‌లోని ఈఎండీఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్‌స్టిట్యూట్ ఈవెం ట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా కోర్సులు అందిస్తోంది.
  అర్హత:
  ఇంటర్/డిగ్రీ
  వెబ్‌సైట్:  www.emdiworld.com

  ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీఏఎంఈ)
  అర్హత:
  డిగ్రీ
  వెబ్‌సైట్:  www.niemindia.com
  ఎంబీఏ చేస్తున్నాను. ఎన్సీఎఫ్ఎమ్ బిగెనర్స్ టెస్ట్ రాస్తే ప్రయోజనముంటుందా? ఏం చేస్తే కెరీర్ బాగుంటుంది?
  +
  స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, స్టార్ట్ ట్రేడింగ్‌లో స్థిరపడాలనుకుంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సులో అర్హత సాధించాలి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ దీనికి సంబంధించిన కోర్సును ఆఫర్ చేస్తోంది.

  వెబ్‌సైట్: www.nseindia.com

  మరో మార్గం ఎస్‌ఏపీ. ఇందులో ఎస్‌ఏపీ ఎఫ్‌ఐ /సీఓ, ఎస్‌ఏపీ హెచ్‌ఆర్ అనే రెండు మాడ్యూల్‌లు ఉంటాయి. ఎస్‌ఏపీ ఎఫ్‌ఐ /సీఓ అనేది సంస్థల ఫైనాన్స్ , అకౌంట్స్ డాటాలకు, ఎస్‌ఏపీ హెచ్‌ఆర్ హ్యూమన్ రీసెర్స్ డాటా రికార్డులకు సంబంధించింది.

  బేసిక్ కంప్యూటర్ కోర్సులు: సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలైన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కోర్సులను నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నెట్ వినియోగంపై పట్టు సాధించాలి. వీటితోపాటు సైకాలజీ / ఆంత్రోపాలజీల్లో అదనంగా స్పెషలైజేషన్ చేస్తే వృత్తిపరమైన కెరీర్‌లో మెరుగ్గా రాణించవచ్చు.
  పెట్రోలియం, గ్యాస్, చమురు రంగాలకు సంబంధించి ఎంబీఏ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి?
  +
  ఎంబీఏ-పెట్రోలియం మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు భారతదేశంలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.
  • రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్).. పెట్రోలియం అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
   అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
   వెబ్‌సైట్:  www.rgipt.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్).. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
   వెబ్‌సైట్:  www.upesindia.org
  • స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్‌మెంట్, గాంధీనగర్ (గుజరాత్).. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
   అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అనుబంధ కోర్సులు వివరించండి?
  +
  • ఐఐఎం, అహ్మదాబాద్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
   వెబ్‌సైట్:
     www.iimahd.ernet.in
  • ఐఐఎం, బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.
   వెబ్‌సైట్:
     www.iimb.ernet.in
  • ఐఐఎం, కోజికోడ్ ఐటీ అండ్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
   వెబ్‌సైట్:
     www.iimk.ac.in
  • ఐఐఎం, కోల్‌కత కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమాను నిర్వహిస్తోంది.
   వెబ్‌సైట్:
     www.iimcal.ac.in
  • ఐఐఎం,లక్నో మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్‌లో పీజీపీని అందిస్తోంది.
   అర్హత:
   50 శాతం మార్కులతో డిగ్రీ.
   ఎంపిక: క్యాట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూ ప్రాతిపదికన.
  • ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును ఆఫర్ చేస్తోంది.
   అర్హత:
   45 శాతం మార్కులతో డిగ్రీ.
   ప్రవేశం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఉంటుంది.
   వెబ్‌సైట్: www.osmania.ac.in
  • శైలేష్ జె.మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఐఐటీ బాంబే మాస్టర్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) కోర్సును ఆఫర్ చేస్తోంది.
   అర్హత:
   ఇంజనీరింగ్ డిగ్రీ/ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ
   వెబ్‌సైట్:  www.som.iitb.ac.in
  • బెంగళూరులోని ఎంఎస్ రామయ్య స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
   అర్హత:
   బీఈ / ఎంకామ్ / ఎంఎస్సీ/ బీబీఏ/ బీకామ్/ బీఎస్సీ/బీఏలో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
   ప్రవేశం: అకడమిక్ మెరిట్, పారిశ్రామిక అనుభవం ఆధారంగా ఉంటుంది.
   వెబ్‌సైట్: msrsas.org.
  • ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ అందిస్తోంది.
   వెబ్‌సైట్:
     www.fms.edu
  బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు?
  +
  బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ కోర్సును చేసిన వారికి వివిధ బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక బ్యాంక్‌ను ముందంజలో ఉంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్‌కు కావల్సిన నాలెడ్జ్, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ బ్యాంక్‌లలో ఎగ్జిక్యూటివ్, మేనేజీరియల్ స్థానాల్లో అవకాశం ఉంటుంది.

  ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
  కోర్సు:
  పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
  అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
  ప్రవేశం: క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్‌ఏటీ/జీమ్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా..

  వివరాలకు: www.ipeindia.org
  రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా సర్టిఫికేట్ అందిస్తున్న సంస్థల వివరాలను తెలపండి?
  +
  రిటైల్ మేనేజ్‌మెంట్‌లో 11 నెలల పీజీ డిప్లొమాను ఆంధ్రా యూనివర్సిటీ అందిస్తోంది.
  అర్హత:
  50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత
  వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in

  హైదరాబాద్‌లోని నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సంస్థ బిజినెస్ మేనేజ్‌మెంట్ డిప్లొమా పేరుతో రిటైల్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్ పీజీ నిర్వహిస్తోంది. ఇది పార్ట్ టైమ్ కోర్సు.
  అర్హత: 50 శాతంతో డిగ్రీ పాస్.
  వెబ్‌సైట్: nmimshyderabad.org

  అలాగే అహ్మదాబాద్‌లోని ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. ఇది ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది.
  అర్హత: డిగ్రీ. ఎస్‌ఓపీ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
  వెబ్‌సైట్:  www.mica.ac.in
  ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలేవి?
  +
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఇంజనీరింగ్ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్ విభాగంలో కూడా పలు కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు..
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్, వినోద్‌గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల సమయంలో ప్రాధాన్యతనిస్తారు.
   వివరాలకు: www.som.iit-kgp.ernet.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంబీఏ కోర్సును పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ రెండు విధాలుగా అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీ) లేదా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా పార్ట్ టైమ్ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు.
   వివరాలకు: https://dms.iitd.ac.in
  • ఐఐటీ-మద్రాస్ (వివరాలకు: www.doms.iitm.ac.in/domsnew), ఐఐటీ-బాంబే (వివరాలకు: www.som.iitb.ac.in ), ఐఐటీ-రూర్కీ (వివరాలకు: www.iitr.ac.in ), ఐఐటీ-కాన్పూర్ (వివరాలకు: www.iitk.ac.in ) కూడా ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.
  ఐఐఎం-ఇండోర్ ఆఫర్ చేస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం) కోర్సు వివరాలను తెలపండి?
  +
  మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కని అవకాశం.. ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)- ఇండోర్ అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం). అర్హత: 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత, లేదా శాట్-1 స్కోర్ 1600-2400 మధ్యలో (ఎస్సీ/ఎస్టీలకు 1475-2400 మధ్య) ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అకడమిక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరి/మార్చిలలో వెలువడుతుంది. కోర్సులో 40 శాతం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, బయలాజికల్ సెన్సైస్, లాంగ్వేజెస్(ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష), సాఫ్ట్ స్కిల్స్ అంశాలు ఉంటాయి. 50 శాతంలో మేనేజ్‌మెంట్ అంశాలైన..అకౌంటింగ్, ఫైనాన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, సీఎస్‌ఆర్, ఇంటర్నేషనల్ బిజినెస్ తదితర అంశాలను బోధిస్తారు. మిగిలిన 10 శాతంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.

  వివరాలకు:  www.iimidr.ac.in
  ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి?
  +
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది. అర్హత: గ్రాడ్యుయేషన్. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిస్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను కొన్ని రకాల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను కూడా ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేస్తుంది.
  దక్షిణ భారతదేశంలో లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఆఫర్‌ చేస్తున్న విద్యాసంస్థల గురించి తెలపండి?
  +
  సమాచారం, కార్మికులు, ముడి సరుకులు వంటి వన రుల నిర్వహణను లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ వివరిస్తుంది.
  కింద తెలిపిన సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
  యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ - ఎంబీఏ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌). ఇందులో ప్రవేశానికి పది, ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌ స్థాయి ల్లోకనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆధా రంగా ప్రవేశం ఉంటుంది. గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ కూడా నిర్వహించే ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌ సైట్‌: www.upesindia.org
  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ ప్రెజైస్‌, సెంటర్‌ ఫర్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెటీ రియల్‌ సిస్టమ్స్‌, హైదరాబాద్‌ - పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. ఇది ఏడాది కాలవ్యవధి కోర్సు. ఏదైనా గాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్‌: www.nimsme.org
  ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్‌ను డిస్టెన్స్‌ విధానంలో అందిస్తోన్న యూనివర్సిటీలేవి?
  +
  ఎన్‌జీఓకు సంబంధించిన అన్ని వ్యవహారాలను పర్యవే క్షించడం, ఆ సంస్థకు లక్ష్యాలను నిర్దేశించడం, సభ్యులు నిర్వ హించాల్సిన విధులను వివరించడం వంటి విధులను ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎన్‌జీఓ మేనేజ్‌మెంట్‌ను దూర విద్యా విధానంలో అందిస్తోన్న సంస్థలు: అన్నామలై యూ నివర్సిటీ-ఏడాది వ్యవధిగల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. వెబ్‌సైట్‌: https://annamalaiuniversity.ac.in
  మదురై కామరాజ్‌ యూనివర్సిటీ, మదురై కూడా ఈ కోర్సు ను అందిస్తోంది. ఏదైనా డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు.
  వెబ్‌సైట్‌: www.mkudde.org / www.ddceutkal.org
  రెగ్యులర్‌గా పార్ట్‌టైం విధానంలో ఈ కోర్సును అందిస్తోన్న వర్సిటీలు: అమిటీ యూనివర్సిటీ, నోయిడా. ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు. వెబ్‌సైట్‌: www.amity.edu
  జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూఢిల్లీ. ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌ మెంట్‌ను అందిస్తోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉన్న వారు ఈ కోర్సుకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  వెబ్‌సైట్‌: www.jmi.nic.in
  ఎంబీఏ(హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌)ను డిస్టెన్స్‌ విధానంలో అందిస్తోన్న సంస్థలేవి?
  +
  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌, లక్నో మాస్టర్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (హాస్పిటల్‌ మేనేజ్‌ మెంట్‌ స్పెలైజేషన్‌గా) ఆఫర్‌ చేస్తోంది. ఏదై నా డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు.
  వెబ్‌సైట్‌: www.iict.in
  అలాగప్పా యూనివర్సిటీ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కూడా ఎంబీఏ (హాస్పిటల్‌ మే నేజ్‌మెంట్‌)ను అందిస్తోంది. ఏదైనా డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు.
  వెబ్‌సైట్‌: www.alagappauniversity.ac.in
  ఐఐఎం-ఇండోర్‌ నుంచి ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ కోర్సు చేయాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలు తెలపండి?
  +
  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)- ఇండోర్‌ హ్యుమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ ఆప్షన్లుగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. వ్యవధి రెండేళ్లు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌), గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.iimidr.ac.in
  ఎంబీఏ (ఏవియేషన్‌)ను అందిస్తోన్న యూనివర్సిటీలేవి?
  +
  యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, రాజమండ్రి ఎంబీఏ(ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌)ను ఆఫర్‌ చేస్తోంది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌. దీంతోపాటు ఇంటర్‌లో కూడా 50 శాతం మార్కులు సాధించాలి. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)/మేనేజ్‌మెంట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌) స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఏవియేషన్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఏ విధంగా అధిగమించాలనే విషయంపై విద్యార్థులను సన్నద్ధులను చేసేందుకు ఈ కోర్సు ఉద్దేశించింది. కోర్సు పూర్తయిన తర్వాత ఎయిర్‌ పోర్ట్‌లు, ఎయిర్‌లైన్‌ కంపెనీలు సంబంధిత సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
  వెబ్‌సైట్‌: https://.upesindia.org
  ఎంబీఏను దూర విద్యా విధానంలో అందిస్తున్న సంస్థలేవి? ఇగ్నోలో ఎంబీఏ అడ్మిషన్‌ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది?
  +
  ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ వర్సిటీ (ఇగ్నో) హెచ్‌ఆర్‌డీ, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ స్పెలైజేషన్లతో ఎంబీ ఏను దూర విద్యా విధానంలో అందిస్తోంది. దీనికి అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల మేనేజీరియల్‌/సూపర్‌వైజ రీ/ప్రొఫెషనల్‌ అనుభం లేదా ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ మెడి సిన్‌/ఆర్కిటెక్చర్‌/లా/ఫార్మసీలలో ప్రొఫెషనల్‌ డిగ్రీ లేదా అకౌంటెన్సీలో ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్‌/కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెన్సీ/ కంపెనీ సెక్రటరీ లేదా ఏదైనా మాస్టర్‌ డిగ్రీ. OPENMAT ఎంట్రెన్స్‌ ఆధారంగా ఇందులో ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.ignou.ac.in మన రాష్ట్రంలో ప్రొఫెస ర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా వర్సిటీ డిస్టెన్స్‌లో ఎంబీఏను అందిస్తోంది. ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు దీనికి అర్హులు. ఐ-సెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
  వెబ్‌సైట్‌: www.oucde.ac.in
  శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ-డెరైక్టర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (వెబ్‌సైట్‌: www.svudde.org) కూడా దూర విద్యా విధా నంలో ఎంబీఏను అందిస్తోంది. అన్నామలై వర్సిటీ (వెబ్‌సైట్‌:  https://annamalaiuniversity.ac.in), అలగప్పా యూనివ ర్సిటీ (వెబ్‌సైట్‌: www.alagappauniversity.ac.in), భారతీయార్‌ వర్సిటీ (వెబ్‌సైట్‌:  www.bu.ac.in/sde) లు కూడా దూరవిద్యా విధానంలో ఎంబీఏను ఆఫర్‌ చేస్తున్నాయి.
  ఎన్‌జీవో మేనేజ్‌మెంట్‌ కోర్సును మాస్టర్స్‌/పీజీ డిప్లొమా స్థాయిలో ఆఫర్‌ చేస్తున్న వర్సిటీలేవి?
  +
  అమిటీ యూనివర్సిటీ, నోయిడా పీజీ డిప్లొమా ఇన్‌ ఎన్‌జీవో మేనేజ్‌మెంట్‌ను అందిస్తోంది. వ్యవధి: ఏడాది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌.
  వెబ్‌సైట్‌: www.amity.edu
  జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ, న్యూఢిల్లీ పీజీ డిప్లొమా ఇన్‌ ఎన్‌జీ వో మేనేజ్‌మెంట్‌ను అందిస్తోంది. వ్యవధి: ఏడాది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధిత అంశంలో పని అనుభవం లేదా ఏదైనా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు దీనికి అర్హులు. వెబ్‌సైట్‌: www.jmi.nic.in
  దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు, వాటి అడ్మిషన్ల ప్రక్రియను వివరించండి?
  +

  దేశంలో చాలా సంస్థలు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో ప్రతిష్టాత్మకమైనవి ఇండియన్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌), గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా వీటిల్లో ప్రవేశం కల్పిస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు క్యాట్‌కు అర్హులు. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌, క్వాంటిటేటీవ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌, డేటా సఫిషియెన్సీ అంశాలు క్యాట్‌లో ఉంటాయి. ఐఐఎంలతోపాటు ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, న్యూఢిల్లీ (వెబ్‌సైట్‌: www.fsm.ac.in), నిర్మాయూనివర్సిటీ, అహ్మదాబాద్‌ (వెబ్‌సైట్‌: www.imnu.ac.in), మేనేజ్‌మెంట్‌ డవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, గుర్‌గావ్‌ (వెబ్‌సైట్‌: www.mdi.ac.in) లు కూడా క్యాట్‌ స్కోర్‌ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తున్నాయి.
  మరో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ XLRI, జెంషెడ్‌పూర్‌. XLRI అడ్మిషన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో ప్రవేశం కల్పిస్తారు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఈ ప్రవేశ పరీక్షను రాయవచ్చు. గీతమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, విశాఖపట్నం (www.giftindia.org), జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, భువనేశ్వర్‌ (వెబ్‌సైట్‌: www.ximb.ac.in) లు కూడా XLRI అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సింబయాసిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం ప్రత్యేక ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. మన రాష్ట్రంలో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవాలంటే మాత్రం ఐ-సెట్‌ రాయాల్సి ఉంటుంది.

  బీ.టెక్‌(ఐటీ)పూర్తి చేసి ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. ఎంబీఏ (ఐటీ)ని చేయాలనుకుంటున్నాను. దీన్ని డిస్టెన్స్‌లో అందిస్తున్న సంస్థలేవి?
  +
  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌, లక్నో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ డిప్లొమాను ఐటీ స్పెషలైజేషన్‌తో అందిస్తుంది.
  అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌. వెబ్‌సైట్‌: www.iict.in
  దీంతోపాటు అన్నా యూనివర్సిటీ, ఆఫర్‌ చేసే ఎంబీఏ-టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ (వెబ్‌సైట్‌: www.annauniv.edu/cde), అలగప్పా యూనివర్సిటీ ఆఫర్‌ చేసే ఎంబీఏ-ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (వెబ్‌సైట్‌: www.alagappauniversit.ac.in), భారతీయార్‌ యూనివర్సిటీ ఎంబీఏ-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ మేనేజ్‌ మెంట్‌ (వెబ్‌సైట్‌: www.bu.ac.in) కోర్సులను కూడా మీరు ఎంచుకోవచ్చు.
  హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌ డ్యూయల్‌ స్పెషలైజేషన్లుగా ఎంబీఏ చేస్తున్నాను. భవిష్యత్‌లో హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌ లో దేనిలో అవకాశాలుంటాయి?
  +

  ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ను దష్టిలో ఉంచుకుని కేవ లం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కావాలను కోవడం సముచితం కాదు. మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌ రెండు రంగాల్లోను మంచి అవకాశాలు ఉంటాయి. రెం డింటికీ సమప్రాధాన్యం ఇస్తూ చదువు కొనసాగించడం ఉత్తమం. ఏదో ఒకటి ఎంచుకోవాలంటే మాత్రం మీ అభిరుచి, ఆసక్తికి దగ్గరుండే అంశాన్ని ఎంచుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో మాత్రం.. స్పెషలైజేషన్ల వారీగా నిర్ణీత కాల వ్యవధి నిర్ణ యించుకోండి. ఒక స్పెషలైజేష న్‌తో జాబ్‌రాకుంటే మరో ఆప్షన్‌తో ప్రయత్నం చేయ డం మంచిది. ఈ వెసులుబాటు ఉంటుంది కాబట్టి చాలా మంది విద్యార్థులు డ్యూయల్‌ స్పెషలైజేషన్స్‌ ఎంచుకుంటారు.

  ఎంబీఏ (హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ఆఫర్‌ చేస్తున్న సంస్థలేవి?
  +
  ఐసీఆర్‌ఐ, హైదరాబాద్‌ ఎంబీఏ (హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ను అందిస్తోంది. వ్యవధి-రెండేళ్లు. అర్హత: సైన్స్‌లో గ్రాడ్యుయే షన్‌. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం.
  వెబ్‌సైట్‌: www.icriindia.com
  మణి పాల్‌ యూనివర్సిటీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనే జ్‌మెంట్‌, మణిపాల్‌ ఎంబీఏ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌)ను ఆఫర్‌ చేస్తుంది.
   అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
  వెబ్‌సైట్‌: www.manipal.edu
  సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌సెన్సైస్‌, పుణే ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌)ను అందిస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌. వెబ్‌సైట్‌: www.sihspune.org
  ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పార్ట్‌ టైమ్‌ విధానంలో ఎంబీఏ(హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌)ను ఆఫర్‌ చేస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం.
  వెబ్‌సైట్‌: www.du.ac.in
  ఎంబీఏ(ఫార్మా)ను దూర విద్యా విధానంలో అందిస్తున్న యూనివర్సిటీలేవి?
  +
  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ లక్నో, మాస్టర్స్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఫార్మా మార్కెటింగ్‌)ను అందిస్తోంది. వ్యవధి రెండేళ్లు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
  వెబ్‌సైట్‌: www.iict.in
  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ మా ర్కెటింగ్‌, లక్నో మాస్టర్స్‌ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ (ఫార్మా మార్కెటింగ్‌)ను ఆఫర్‌ చేస్తుంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు దీనికి అర్హులు. మరిన్ని వివరాలకు www.iipmindia.com చూడొచ్చు.
  బీఏ పూర్తిచేశాను. మాస్టర్‌ ఆఫ్‌ హ్యూ మన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ ఎం) అంటే ఆసక్తి. ఈ కోర్సునందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
  +

  ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌ మెంట్‌ను ఆఫర్‌ చేస్తుంది. మరిన్ని వివరాలకు www.andhrauniversity.info చూడొచ్చు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కూడా ఈ కోర్సును ఆందిస్తోంది. వెబ్‌సైట్‌: www.skuniversity.org. ఎంహెచ్‌ఆర్‌ఎంను దూర విద్యా విధానంలో ఆఫర్‌ చేస్తున్న సంస్థలు: ఆచార్య నాగార్జున వర్సిటీ, సెంటర్‌ ఫర్‌డిస్టెన్స్‌ లెర్నింగ్‌. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌. వెబ్‌సైట్‌: www.anucde.com. భారతీదాసన్‌ యూనివర్సిటీ, సెంట ర్‌ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వెబ్‌సైట్‌: www.bdu.ac.in

   

  బీటెక్‌ (కంప్యూటర్స్‌ సైన్స్‌) చేశాను. ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను తెలపండి?
  +
  ఏవియేషన్‌ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగ మించేందుకు తోడ్పడే మోడ్రన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ను ఏవి యేషన్‌ మేనేజ్‌మెంట్‌లో బోధిస్తారు. ఎకనామిక్స్‌ అండ్‌ మేనే జ్‌మెంట్‌ డెసిషన్స్‌, ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెం ట్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ బిజినెస్‌, ఐటీ అప్లికేషన్స్‌ ఇన్‌ ఏవియేషన్‌ సెక్టార్‌, ఆపరేషన్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ మేనే జ్‌మెంట్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనోమెట్రిక్స్‌ తదితర అంశాలు ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎయిర్‌పోర్ట్స్‌, ఎయిర్‌ కంపెనీలు, కార్గో ఆపరేటర్స్‌, ఎయిర్‌క్రా ఫ్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీల్లో అవకాశాలుంటాయి.
  యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ ఎంబీఏ(ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌)ను ఆఫర్‌ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. క్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారం గా అడ్మిషన్‌ కల్పిస్తారు. వెబ్‌సైట్‌: https://upesindia.org
  ఎవలాన్‌ అకాడెమీ, హైదరాబాద్‌ ఎంబీఏ (ఏవియేషన్‌) పార్ట్‌-టైం విధానంలో అందిస్తోంది. అర్హత గ్రాడ్యుయేషన్‌.
  వెబ్‌సైట్‌: www.avalonacademy.in
  నెహ్రూ కాలేజ్‌ ఆఫ్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ అపై ్లడ్‌ సైన్స్‌, కోయంబత్తూరు ఎంబీఏ (ఎయిర్‌లైన్‌ అండ్‌ ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌)ను అందిస్తోంది. అర్హత 60 శాతం మార్కుల తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌. క్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌ను పరిగణ నలోకి తీసుకుంటారు.
  వెబ్‌సైట్‌: https://nehrucollegs.org.in