Skip to main content

నేను 2020లో డిగ్రీ పూర్తి చేసుకోబోతున్నాను. నాకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసక్తి ఉంది. కోర్సులు, కాలేజీలు, ఫీజులు, కెరీర్‌...

– సునీల్‌
Question
నేను 2020లో డిగ్రీ పూర్తి చేసుకోబోతున్నాను. నాకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసక్తి ఉంది. కోర్సులు, కాలేజీలు, ఫీజులు, కెరీర్‌ అవకాశాల గురించి తెలపండి?
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి ప్రస్తుతం పీజీ స్థాయిలో పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్‌. వైఎస్‌ఆర్‌ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ఎంబీఏ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఉంది. దీంతోపాటు అమిటీ యూనివర్సిటీ, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌వంటి పలు ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ స్థాయిలో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉంది. క్యాట్, సీమ్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ స్కోర్ల ఆధారంగా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి  ప్రవేశం పొందొచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హోటల్స్, ఎయిర్‌ పోర్ట్స్, ట్రావెల్‌ ఏజెన్సీలలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలో ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ మేనేజర్, ఆపరేషన్స్‌ మేనేజర్, కీ అకౌంట్స్‌ మేనేజర్‌ వంటి హోదాలతో కెరీర్‌ ప్రారంభించొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటరాక్షన్‌ స్కిల్స్‌ వంటి పర్సనల్‌ స్కిల్స్‌ తప్పనిసరి. అదే విధంగా ఇంగ్లిష్‌తోపాటు ఏదైనా ఫారెన్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యం కూడా సొంతం చేసుకున్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Photo Stories