Skip to main content

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ఆఫర్‌ చేస్తున్న ఎంబీఏ కోర్సుల వివరాలు తెలియజేయండి?

– ఆర్‌.ఎస్‌.ప్రసాద్, హైదరాబాద్‌.
Question
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ఆఫర్‌ చేస్తున్న ఎంబీఏ కోర్సుల వివరాలు తెలియజేయండి?
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)కు దేశంలో న్యూఢిల్లీ, కోల్‌కతాలో క్యాంపస్‌లు ఉన్నాయి. దీన్ని భారత ప్రభుత్వం ఓ స్వయం ప్రతిపత్తి సంస్థగా 1963లో ఏర్పాటు చేసింది. విదేశీ వర్తక నిర్వహణలో మానవ వనరులను అభివృద్ధి చేసి, తద్వారా ఎగుమతులను పెంచేందుకు ఈ సంస్థ దోహదం చేస్తోంది.

ఆఫర్‌ చేస్తున్న కోర్సులు: రెండేళ్ల వ్యవధితో ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌–ఫుల్‌టైం); మూడేళ్ల వ్యవధితో ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌–పార్ట్‌టైం) కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.

అర్హతలు, ఎంపిక విధానం..
 రెండేళ్ల ఎంబీఏ:
ఏదైనా విభాగంలో మూడేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ డిగ్రీ. రాత పరీక్ష, ఎస్సే రైటింగ్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. విదేశీ విద్యార్థులు/ఎన్నారై/ఎన్నారై పిల్లలకు జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్షను మల్టిపుల్‌ ఛాయిస్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇంగ్లిష్‌ కాంప్రెహెన్షన్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ అవేర్‌నెస్‌; లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ అనాలిసిస్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
మూడేళ్ల ఎంబీఏ: బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం. కంపెనీ స్పాన్సర్‌షిప్‌/ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌. గ్రూప్‌ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఐఐఎఫ్‌టీ ఆఫర్‌ చేస్తున్న ఇతర కోర్సులు:  ఇంటర్నేషనల్‌ బిజినెస్, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌; క్యాపిటల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా. ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌; క్యాపిటల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌; గ్లోబల్‌ ట్రేడ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐఎఫ్‌టీ పీహెచ్‌డీని కూడా ఆఫర్‌ చేస్తోంది.
వెబ్‌సైట్‌: http://tedu.iift.ac.in/iift/index.php

Photo Stories