రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి?
- కీర్తి, బాసర.
Question
రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి?
- విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. - ఇదే విశ్వవిద్యాలయం, రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో డిప్లొమా అందిస్తోంది. ఏడాది పాటు కోర్సు అందిస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in - హైదరాబాద్‌లోని నర్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పార్ట్‌టైం విధానంలో రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.nmimshyderabad.org