Skip to main content

ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?

- కృష్ణవేణి, కరీంనగర్.
Question
ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
  • ప్రస్తుతం కంపెనీలన్నీ తమ బిజినెస్‌ను ప్రపంచవ్యాప్తం చేయటానికి, అనేక రకాల సమస్యలను పరిష్కరించేందుకు మేనేజర్లకు అదనపు నైపుణ్యాలు ఉండాలని భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ చేసే అభ్యర్థులకు ఈ దిశగా నైపుణ్యాలు లభిస్తాయి.
  • విదేశీ వాణిజ్యం, ఎగుమతి-దిగుమతులు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల అధ్యయనం ఉంటుంది.
  • మాన్యుఫ్యాక్చరర్ ఎక్స్‌పోర్టర్స్, మర్చెంట్ ఎక్స్‌పోర్టర్స్, షిప్పింగ్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్ ప్లేయర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలు సాధించవచ్చు.
  • ఎగుమతులు-దిగుమతులు, ఫైనాన్స్, షిప్పింగ్ అండ్ ఏవియేషన్, టూరిజం వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
  • హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్.. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎలక్టివ్ సబ్జెక్టుగా బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.ipeindia.org
  • హైదరాబాద్‌లోని శివశివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. గ్లోబల్ బిజినెస్ ఎలక్టివ్ సబ్జెక్టుగా మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.ssim.ac.in
  • హైదరాబాద్‌లోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్.. ఇంటర్నేషనల్ బిజినెస్ సబ్జెక్టు స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తోంది.
    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.ghbs.in

Photo Stories