Skip to main content

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

నవీన్, తిరుపతి.
Question
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మేనేజర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ భారీగా పెరుగుతున్నాయి. ప్రైవేటులోనే కాకుండా ప్రభుత్వరంగంలో, లాభాపేక్షలేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్న వారు కూడా ఆసుపత్రులను అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ వనరుల డిమాండ్ బాగా పెరిగింది. అందువల్ల మెడిసిన్, తత్సంబంధ కోర్సుల్లో ప్రవేశం ఉన్నవారికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ ఉన్నత కెరీర్‌ను అందిస్తుంది.
  • ఈ కోర్సును మెడికల్‌తోపాటు నాన్ మెడికల్ విద్యార్థులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి భారతదేశంతోపాటు విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా స్టాఫ్‌ను మానేజ్ చేయటం, హెల్త్ సర్వీసెస్‌ను చూసుకోవటం, ఖర్చుల వివరాలు తెలుసుకోవటం వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుంది.
  • దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్(ఎంహెచ్‌ఎం)ను అందిస్తోంది.
కాలపరిమితి: రెండున్నర ఏళ్లు. ఇందులో ఇంటర్న్‌షిప్ కూడా చేయాలి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ
ప్రవేశం: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
  • గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్య విధానంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తోంది.
అర్హత: డిగ్రీ

వెబ్‌సైట్:  www.nagarjunauniversity.ac.in

Photo Stories