Skip to main content

ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలేవి?

-ఆదిత్య, వరంగల్.
Question
ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలేవి?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఇంజనీరింగ్ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్ విభాగంలో కూడా పలు కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు..
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్, వినోద్‌గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల సమయంలో ప్రాధాన్యతనిస్తారు.
    వివరాలకు: www.som.iit-kgp.ernet.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంబీఏ కోర్సును పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ రెండు విధాలుగా అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీ) లేదా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా పార్ట్ టైమ్ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు.
    వివరాలకు: https://dms.iitd.ac.in
  • ఐఐటీ-మద్రాస్ (వివరాలకు: www.doms.iitm.ac.in/domsnew), ఐఐటీ-బాంబే (వివరాలకు: www.som.iitb.ac.in ), ఐఐటీ-రూర్కీ (వివరాలకు: www.iitr.ac.in ), ఐఐటీ-కాన్పూర్ (వివరాలకు: www.iitk.ac.in ) కూడా ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.

Photo Stories