ఎంబీఏ అకౌంట్స్‌తో పాటు ఏ కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయో వివరించండి?
-విష్ణు, జడ్చర్ల
బేసిక్ కంప్యూటర్ కోర్సులు:
ఏ ఉద్యోగం చేయడానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వర్క్‌లో ఉపయోగపడే ఎంఎస్ ఆఫీస్‌కు సంబంధించిన కోర్సులు ముందుగా నేర్చుకోవడం కలసివస్తుంది. దీంతో పాటు ఇంటర్నెట్ వినియోగం నేర్చుకోవాలి.
Question
ఎంబీఏ అకౌంట్స్‌తో పాటు ఏ కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయో వివరించండి?
- ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు: ఈ కోర్సు చేయడం ద్వారా స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో/సొంతంగా ట్రేడింగ్ చేయగలుగుతారు. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో సర్టిఫికేషన్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్, క్యాపిటల్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్, కమోడిటీస్ మార్కెట్, ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లాంటి ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా ఇందులో ప్రావీణ్యాన్ని సాధించవచ్చు.
వెబ్‌సైట్: www.nseindia.com
- శాప్(ఎస్‌ఏపీ): మంచి ఉద్యోగ భవిష్యత్తుకు శాప్ మరో మార్గం. దీంట్లో అనేక టేబుల్స్, మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి. శాప్ ఎఫ్‌ఐ/సీఓ, శాప్ హెచ్‌ఆర్‌లు ఇందులో ఎంబీఏకి అవసరమైన మాడ్యూల్స్.
శాప్ ఎఫ్‌ఐ/సీఓ: కంపెనీకి సంబంధించిన అకౌంట్స్‌తో పాటు ఫైనాన్స్‌కు సంబంధించిన డేటాను కవర్ చేస్తుంది. దీని ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడుతుంది.
శాప్ హెచ్‌ఆర్: ఇది హ్యూమన్ రీసోర్సెస్ డేటాను కవర్ చేస్తుంది. ఇది పూర్తిగా సంస్థకు సంబంధించిన హ్యూమన్ రీసోర్సెస్ డేటాకు సంబంధించింది. కంపెనీలు దీనిలో నైపుణ్యం సాధించిన హెచ్‌ఆర్ మేనేజర్లను నియమించుకుంటున్నారు.