దూరవిద్య విధానంలో ఎంబీఏ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
రమ్య, తిరుపతి.
Question
దూరవిద్య విధానంలో ఎంబీఏ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
పనిచేస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి పార్ట్ టైం విధానంలో ఎంబీఏ ఉపకరిస్తుంది.
కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
- హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పార్ట్‌టైం విధానంలో ఎంబీఏను అందిస్తోంది. హైదరాబాద్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులు.
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఎస్‌ఎస్‌సీలో మ్యాథమాటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
- హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. దూరవిద్య విధానంలో ఎంబీఏను అందిస్తోంది.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు కనీసం మూడేళ్లు ఏదైనా వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఎగ్జిక్యూటివ్/మేనేజ్‌మెంట్/ పరిపాలన విభాగంలో పనిచేసి ఉండాలి.
ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in