డిజిటల్ మార్కెటింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉన్నత అవకాశాలను వివరించండి?
రవి, విజయనగరం.
Question
డిజిటల్ మార్కెటింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉన్నత అవకాశాలను వివరించండి?
ఇంటర్‌నెట్ ఉపయోగించి వివిధ రకాల బ్రాండ్‌లను ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. సెల్‌ఫోన్స్, గేమ్స్ ఉపకరణాలు తదితర వస్తువులను డిజిటల్ మార్కెట్ ద్వారా అమ్ముతారు. అడ్వర్టైజింగ్, ఎంగేజింగ్, మార్కెటింగ్‌లు కూడా డిజిటల్ మార్కెట్‌లో భాగమే.
ఇందులో నిపుణులు ఈ-మెయిల్స్, సోషల్ మీడియా వెబ్‌సైట్స్, ఫోరమ్స్, బ్లాగ్స్, గ్రాఫిక్ డిజైన్స్, ఫ్లోటింగ్ యాడ్స్ తదితర సాధనాలను ఉపయోగించి బ్రాండ్లకు ప్రచారం నిర్వహిస్తారు.
ఈ కోర్సును అందిస్తున్న సంస్థలు
ఇందులో నిపుణులు ఈ-మెయిల్స్, సోషల్ మీడియా వెబ్‌సైట్స్, ఫోరమ్స్, బ్లాగ్స్, గ్రాఫిక్ డిజైన్స్, ఫ్లోటింగ్ యాడ్స్ తదితర సాధనాలను ఉపయోగించి బ్రాండ్లకు ప్రచారం నిర్వహిస్తారు.
ఈ కోర్సును అందిస్తున్న సంస్థలు
- ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ మార్కెటింగ్.. డిజిటల్ మార్కెటింగ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రాంను అందిస్తోంది.
అర్హత: డిగ్రీ
వెబ్‌సైట్: www.iicm.in
- బెంగళూరులోని ఇంటర్నేషనల్ మొబైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎంఆర్‌ఐ).. డిజిటల్ మార్కెటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను అందిస్తోంది.
అర్హత: డిగ్రీ
వెబ్‌సైట్: www.imri.in
- కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్.. డిజిటల్ మార్కెటింగ్‌లో మాడ్యులర్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్: www.theidmi.com
- పుణెలోని లావెనర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్.. డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ అందిస్తోంది.
వెబ్‌సైట్: www.lipsindia.com