Skip to main content

Engineering Careers FAQs

నేను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్నాను. అర్హతలు, కెరీర్‌ అవకాశాల గురించి వివరించండి?
+

పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించడం.. వ్యర్థాలను రీసైక్లింగ్‌ విధానాలతో శుద్ధి చేయడం..నింగి,నేల,నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేయడం వంటి విధులను ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కోర్సులు: దేశంలోని చాలా విద్యాసంస్థలు యూజీ, పీజీ స్థాయిలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలతోనే బీఈ/బీటెక్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌; పీజీ కోర్సులకు గేట్‌ వంటి పరీక్షల్లో అర్హత సాధించాలి. ఈ కోర్సుల్లో చేరినవారికి బయాలజీ, కెమిస్ట్రీ, సాయిల్‌ సైన్స్, ఇంజనీరింగ్‌ సూత్రాలు, అనువర్తనాలు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది.

అర్హతలు: ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివి ఉండాలి.

కోర్సులను అందించే పలు విద్యా సంస్థలు:

  • ఐఐటీ ఢిల్లీ
  • ఐఐటీ మద్రాస్, బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌ తదితర ఐఐటీలు,
  • పలు నిట్‌లు
  • ఉస్మానియా యూనివర్సిటీ
  • ఆంధ్రా యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు.

జాబ్‌ ప్రొఫైల్స్‌:

  • హైడ్రాలజిస్ట్
  • ఎన్విరాన్‌మెంట్‌ సైంటిస్ట్
  • ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్
  • వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్
  • ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ మేనేజ్‌మెంట్
  • ఎన్విరాన్‌ మెంటల్‌ లాయర్‌.

కెరీర్‌: ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ,ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖలు, ఎన్‌జీవోలు, నిర్మాణ సంస్థలు, పర్యావరణ ఆధారిత సంస్థలు వంటి వాటిలో అవకాశాలను పొందవచ్చు. ఇవే కాకుండా ఫెర్టిలైజర్‌ ప్లాంట్లు, మైన్స్, రిఫైనరీలు, టెక్స్‌టైల్‌ మిల్స్, అర్బన్‌ ప్లానింగ్, వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ అగ్రికల్చర్, అటవీ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయంగా యునైటెడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్, ఇంటర్‌ గవర్నమెంట్‌ ప్యానల్‌ ఆన్‌ క్లయిమెట్‌ ఛేంజ్, ఎర్త్‌ సిస్టమ్‌ గవర్నమెంట్‌ ప్రాజెక్ట్‌ వంటి వాటిలో అవకాశాలు అందుకోవచ్చు.

వేతనాలు:
పనిచేసే సంస్థ, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంగా పొందవచ్చు.

ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాను. ఈ బ్రాంచ్‌తో నాకు లభించే అవకాశాల గురించి తెలపండి?
+
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏరోనాటికల్‌ ఇంజనీర్లకు డిమాండ్‌ ఉంది. ఎయిర్‌ ట్రాఫిక్, రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

అవకాశాలు:  ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారికి విమానయాన సంస్థల్లో, విమాన తయారీ విభాగాల్లో, ఎయిర్‌ టర్బైన్‌ ప్రొటక్షన్‌ ప్లాంట్స్, ఏవియేషన్‌ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్థలు, హెలికాప్టర్‌ కంపెనీలు, శాటిలైట్‌ మాన్యుఫాక్చరింగ్, రక్షణ దళాలు, ఏవియేషన్‌ సంబంధిత ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.

జాబ్‌ ప్రొఫైల్‌:  ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఉద్యోగపరంగా అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్, ఏరోస్పేస్‌ డిజైన్‌ చెకర్, ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజనీర్, ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రొడక్షన్‌ మేనేజర్, థర్మల్‌ డిజైన్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.
బీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశాను. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం సాధించేలా ఎలాంటి షార్ట్‌టర్మ్ కోర్సులు చేయాలి. కోర్సు ఎరా, ఉడెమీ ఆన్‌లైన్ కోర్సులు ఉపయుక్తమేనా... డేటా సైన్స్ కోర్సు నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ?
+
డేటా సైన్స్ ఇప్పుడు ఎంతో డిమాండ్ నెలకొన్న కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు పూర్తి చేసుకోవడం ఉపయుక్తం. కోర్సెరా, ఉడెమీ వంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ అందిస్తున్న ఈ కోర్సులను అభ్యసించి నిర్దిష్ట పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సర్టిఫైడ్ డేటా సైంటిస్ట్‌లకు వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇతర ఐటీ ఉద్యోగాలతో పోల్చితే డేటా సైంటిస్ట్‌ల జీతాలు సగటున 30 నుంచి 40 శాతం మేర అధికంగా ఉంటున్నాయి. నైపుణ్యాలు ఉంటే డేటా సైంటిస్ట్‌గా రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఈ విభాగంలో స్థిర పడాలంటే.. అకడమిక్‌గా మ్యాథమెటికల్ స్కిల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్ ఎంతో అవసరం. అంతేకాకుండా అనలిటికల్ స్కిల్స్, డేటా డీ-కోడింగ్, కోడింగ్ నైపుణ్యాలు కూడా ముఖ్యం. ఐటీ విభాగంలో హైదరాబాద్‌లోనే ఉద్యోగం కావాలనుకుంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఐఓటీ స్కిల్స్ ఉంటే సులువుగా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా పలు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెరుగ్గా రాణించాలంటే ముందుగా మీకు కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో పట్టు ఉండాలి.
ఎంటెక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. ఐటీలో స్థిరపడాలంటే.. తాజా ట్రెండ్స్‌కు అనుగుణంగా నేర్చుకోవాల్సిన టాప్ ఐటీ కోర్సులేవో తెలపండి?
+
ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో.. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులకు ప్రాధాన్యం పెరిగింది. కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలే లక్ష్యంగా ఆయా కోర్సులు అందిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఎంటెక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి పలు ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల వ్యవధి రెండు నెలల నుంచి ఏడాదిన్నర వరకు ఉంటుంది. ఐటీలో స్థిరపడాలనుకొనే అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడం లాభిస్తుంది. ఈ దిశగా వెబ్‌సైట్ అడ్మిన్ ప్లస్(డబ్ల్యూ ఎంపీ), వెబ్ ప్రీమియం-అడ్వాన్స్‌డ్ యూఐ డెవలప్‌మెంట్, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మాస్టర్, జావా స్క్రిప్ట్ మాస్టర్ అండ్ జావా స్క్రిప్ట్ మాస్టర్ ప్లస్, హెచ్‌టీఎంఎల్ 5 అండ్ సీఎస్‌ఎస్3 మాస్టర్, బూట్‌స్ట్రాప్ మాస్టర్, జేక్వెరీ మాస్టర్, నోడ్ జేఎస్ మాస్టర్ కోర్సులకు ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. 
యూకేలో ఎంఎస్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రికల్ విభాగంలో బెస్ట్ కోర్సులను సూచించండి?
+
యూకేలో ఎంఎస్ కోర్సుల్లో ఏ స్పెషలైజేషన్ అయినా.. 16 నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది. టాప్ యూనివర్సిటీల్లో మాత్రం రెండేళ్ల వ్యవధిలోనే కోర్సుల బోధన సాగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కి సంబంధించి దాదాపు నలభైకి పైగా స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో.. ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ లైటింగ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్ స్పెషలైజేషన్స్‌కు మంచి పేరుంది. వీటితోపాటు ఇటీవల కాలంలో పవర్ జనరేషన్ అండ్ సప్లయ్, రోబోటిక్ సిస్టమ్స్ వంటి ఆధునిక స్పెషలైజేషన్స్‌ను కూడా యూనివర్సిటీలు అందిస్తున్నాయి. కెరీర్ అవకాశాల కోణంలో ఇప్పుడు యూకేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీజీ ఉత్తీర్ణులకు డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో మానవ వనరుల డిమాండ్‌కు సరిపడే రీతిలో నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించకపోవడమే ఇందుకు కారణం. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రధానంగా పవర్ జనరేషన్ సంస్థలు,ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో డిజైన్, డెవలప్‌మెంట్, రీసెర్చ్ విభాగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. యూకేలోని యూనివర్సిటీలు అందించే సర్టిఫికెట్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న కారణంగా ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, జపాన్ వంటి ఇతర దేశాల్లోనూ చక్కటి కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. వేతనాల పరంగా పీజీ స్థాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు వారికి లభించిన హోదా ఆధారంగా సగటున 75 వేల యూరోల వార్షిక వేతనం అందుతోంది. డిజైన్, రీసెర్చ్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకున్న వారికి లక్ష యూరోల వరకు వేతనం అందే అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరాలంటే.. జీఆర్‌ఈలో మంచి స్కోర్లు తప్పనిసరి. వెర్బల్ అండ్ క్వాంటిటేటివ్ విభాగాల్లో 150కుపైగా పర్సంటైల్ స్కోర్, అనలిటికల్ రైటింగ్‌లో నాలుగు పాయింట్ల వరకు స్కోర్ ఉంటే.. టాప్ యూనివర్సిటీల్లో ప్రవేశం సులభంగా లభిస్తుంది. దీంతోపాటు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు కూడా ఉండాలి.
నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఎలాంటి సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకోవాలో తెలియజేయండి?
+
మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు సాలిడ్ మోడలింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి సాలిడ్ వర్క్స్, సీఏటీఐఏ, ప్రోఈ వంటి పాపులర్ సాఫ్ట్‌వేర్ కోర్సులపై అవగాహన పెంపొందించు కోవాలి. అలాగే అనాలిసిస్, సిమ్యులేషన్‌కు సంబంధించి ఏఎన్‌ఎస్‌వైఎస్, కామ్‌సాల్ (సీవోఎంఎస్‌వోఎల్), హైపర్‌మెష్ తదితర కోర్సులు ఉపయోగపడతాయి. అదేవిధంగా సీ++, జావా, పైథాన్ తదితర పాపులర్ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ కోర్సులను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మెకానికల్ ఇంజనీర్లకు మెట్‌ల్యాబ్ కూడా దోహదపడుతుంది. వీటితోపాటు ఆటో క్యాడ్, క్యామ్, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ఎల్ నేర్చుకోవడం ఎంతో ప్రయోజనకరం.
మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడమెలా? కోర్సు పూర్తయితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
+
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీ..  ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ.. నాలుగేళ్ల బీటెక్  మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. కోల్‌కతా, చెన్నై, ముంబై క్యాంపస్‌ల్లో ఈ కోర్సు ఉంది. ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. దీంతోపాటు ముంబై క్యాంపస్‌లో ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది.
  • ముఖ్యంగా మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా ఓడల తయారీ, డిజైన్, ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఓడలు, వాటికి సంబంధించిన యంత్రాల తయారీపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. మెరైన్ ఇంజనీర్లకు మర్చెంట్ నేవీలో అవకాశాలు లభిస్తారుు. ఓడలకు సంబంధించి యంత్రాల పనితీరు నిర్వహణ బాధ్యత వీరిదే. ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో అన్ని రకాల ఇంజన్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రపల్సివ్ ఇంజన్ల పనితీరుతోపాటు సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ కూడా మెరైన్ ఇంజనీర్‌లే చూడాల్సి ఉంటుంది. ఓడ సురక్షిత ప్రయాణంలో మెరైన్ ఇంజనీర్ల పాత్ర కీలకం.
  • షిప్పింగ్ కంపెనీలు, ఇండియన్ నేవీ, షిప్‌యార్డ్‌లు, షిప్ ఇంజన్ తయారీ కంపెనీలు, షిప్ డిజైనింగ్, పరిశోధన సంస్థల్లో మెరైన్ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు లభిస్తారుు. కోర్సు పూర్తయ్యాక నైపుణ్యాలుంటే.. సంవత్సరానికి రూ.4లక్షల ప్రారంభ వేతనంతో కెరీర్ మొదలవుతుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా రూ.20 లక్షలకు పైగా ఆర్జించే అవకాశముంది.
ఎంపీసీ ఇంటర్మీడియెట్ పాసయ్యాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాలన్నది నా లక్ష్యం. అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు తక్కువని చెబుతున్నారు. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరడం మంచిదేనా?
+
ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేసుకున్న వారు దేశంలోని ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్ జెట్, పవన్ హన్‌‌సతోపాటు ఇతర ప్రైవేటు చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అందుకునే వీలుంది. విమాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు.. బెంగళూరు, నాసిక్, కోరాపుట్, లక్నో, హైదరాబాద్ తదితర చోట్ల ఉన్న కేంద్రాల్లో ఏరోనాటికల్ ఇంజనీర్లకు కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అలాగే రక్షణ రంగంలో.. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు.. అత్యాధునిక విమానాలు, విమాన పరికరాల నిర్వహణ కోసం టెక్నికల్ బ్రాంచ్‌లోకి ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలు, డిజిటల్ కార్యక్రమాల్లో వేగం కనిపిస్తోంది. కాబట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న ప్రతిభావంతులు డీఆర్‌డీవో (డిఫెన్‌‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) లేబొరేటరీలు, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్‌ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌ల్లో అవకాశాలు పొందొచ్చు. ఎంటెక్ పూర్తిచేస్తే ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగం లభించడం మరింత సులువవుతుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా సంబంధిత సబ్జెక్టు నాలెడ్‌‌జతోపాటు సదరు జాబ్‌కు అవసరమైన నైపుణ్యాలు ఉంటేనే ఆఫర్ లెటర్ చేతికందుతుంది.
ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి.
+
  • కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను బోధిస్తారు.

కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు...
  1. రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రత్యేకంగా ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఇది సిస్మిక్ వల్నరబిలిటీ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్; సాయిల్ డైనమిక్స్; స్ట్రక్చరల్ డైనమిక్స్ స్పెషలైజేషన్లలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
    అర్హత: సివిల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ. గేట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
    వెబ్‌సైట్: www.iitr.ac.in
  2. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఎంటెక్ ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
    అర్హత: 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
    వెబ్‌సైట్: https://jmi.ac.in
  3. హైదరాబాద్‌లోని సీబీఐటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం.. ఎంఈ (ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీ. గేట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
    వెబ్‌సైట్: https://www.cbit.ac.in  
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు తెలియజేయండి. కోర్సు పూర్తయ్యాక ఇదే సబ్జెక్ట్‌తో జర్మనీలో ఎంఎస్ చేయడం ఎలా?
+
ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, మెషిన్ డ్రాయింగ్, ఆటోమోటివ్ ఇంజిన్స్, వెహికల్ డైనమిక్స్, ఆటో-ఎయిర్ కండిషనింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, క్యాడ్/కామ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఆటోమొబైల్ ఇంజనీర్లు ఆటోమోటివ్ డిజైన్, డెవలప్‌మెంట్, ఇంజిన్స్, ఎయిర్ కండిషనింగ్, అప్లికేషన్, సర్వీస్ వంటి విభాగాల్లో పనిచేస్తారు. ఈ వృత్తిలో రాణించడానికి ఎనలిటికల్ స్కిల్స్, క్యాడ్/క్యామ్ అంశాలపై పట్టు ఉండాలి.

ఈ కోర్సు పూర్తిచేసుకున్న వారికి మారుతి, టాటా మోటార్స్, ఫోర్డ్, ఫియట్, టయోటా, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ రిక్రూటర్లుగా నిలుస్తున్నాయి.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయడానికి అత్యధిక మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న దేశం జర్మనీ. 2011-12లో జర్మనీ విశ్వవిద్యాయాల్లో చదువుతున్న భారతీయుల సంఖ్య 5,998 కాగా, అది 2015-16కు 13,740కు చేరింది. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ కోర్సుకు టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ తదితర విశ్వవిద్యాలయాలు ప్రముఖమైనవి. ఇతర దేశాలతో పోల్చితే జర్మనీలో ఖర్చు చాలా తక్కువ. ఎంఎస్ కోర్సుకు అర్హత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. జీఆర్‌ఈ, టోఫెల్, అకడమిక్ ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పూర్తి వివరాలకు: www.daad.de
గేట్-2018తో పీఎస్‌యూలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియజేయండి?
+
  • గేట్ 2018కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ అక్టోబరు 5, 2017.
  • గేట్ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు.. ముందుగా ఆయా పీఎస్‌యూల నోటిఫికేషన్లకు అనుగుణంగా సంబంధిత తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • తర్వాత దశలో గేట్ ఫలితాలు విడుదలైన తర్వాత సదరు పీఎస్‌యూలు నిర్దిష్ట కటాఫ్‌ను పేర్కొని.. సంబంధిత స్కోర్ పొందిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను అప్‌లోడ్ చేయమని అడుగుతాయి.
  • ఇలా నిర్దిష్ట స్కోర్ పొంది.. తమ స్కోర్ కార్డ్‌ను అప్‌లోడ్ చేసిన అభ్యర్థులకు తదుపరి దశలో ఆయా పీఎస్‌యూల నియామక విధానాల ప్రకారం- ఇంటర్వ్యూ కాల్ అందుతుంది. ఇదే క్రమంలో ఇంటర్వ్యూ కంటే ముందు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్‌ను సైతం నిర్వహిస్తారు.
  • గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపట్టే పీఎస్‌యూలకు గేట్ నిర్వాహక సంస్థ.. విద్యార్థుల స్కోర్‌ను పీఎస్‌యూలకు అందించే విధానం ప్రస్తుతం అమల్లో లేదు.
  • విద్యార్థులు తప్పనిసరిగా ముందుగా ఆయా పీఎస్‌యూల నోటిఫికేషన్లకు అనుగుణంగా దరఖాస్తు చేసుకుని.. గేట్ ఫలితాలు విడుదలయ్యాక సదరు పీఎస్‌యూలు నిర్దేశించిన కటాఫ్ స్కోర్ ఆధారంగా ప్రత్యేకంగా మరోసారి గేట్‌స్కోర్ కార్డ్‌ను అప్‌లోడ్ చేసుకుంటేనే పీఎస్‌యూల నుంచి ఇంటర్వ్యూ కాల్ అందుతుంది.
నానోఎలక్ట్రానిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
 హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
అర్హత: కెమికల్/మెకానికల్/ ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ బయోటెక్నాలజీ/ మెటీరియల్ సైన్స్‌లలో బీఈ/బీటెక్ లేదా కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బయోటెక్నాలజీ/ ఎర్త్ సెన్సైస్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లలో ఎంఎస్సీ లేదా తత్సమానం.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
 
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత:
సంబంధిత సబ్జెక్టులో బీటెక్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.jntua.ac.in
 
తంజావూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
అర్హత
: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.sastra.edu
ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బీఈ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.uceou.edu
  • విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in/engg/
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jntuh.ac.in
  • కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బీటెక్ స్థాయిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌ను బోధిస్తూ, ఎంటెక్ స్థాయిలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి.
  • హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పీజీఈసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.uceou.edu
  • విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పీజీఈసెట్/ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in/engg/
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మెకానికల్/ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ ఏరోనాటికల్/ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jntuh.ac.in
ఇంజనీరింగ్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. బీటెక్‌తోపాటు ఎంటెక్ లేదా ఎంబీఏలో ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుకునే అవకాశం కల్పిస్తోంది.
    కాలపరిమితి:
    5 ఏళ్లు.
    స్పెషలైజేషన్లు: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jntuhceh.ac.in
  • విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఇంజనీరింగ్‌లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.
    స్పెషలైజేషన్లు:
    సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సు వివరాలను తెలపండి?
+
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు కాలేజీలు బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అవి..
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-సంగారెడ్డి (మెదక్ జిల్లా), కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-మడకశిర (అనంతపురం జిల్లా), కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-బాపట్ల (గుంటూరు జిల్లా).
అర్హత:
ఇంటర్మీడియెట్ (ఎంపీసీ). ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజ్‌ల్లో ప్రవేశం పొందొచ్చు.
బ్యాచిలర్ కోర్సుల తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్ , పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎంఏబీఎం, పీజీ డిప్లొమా వంటి కోర్సులను చదివే అవకాశం ఉంది.
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (వెబ్‌సైట్: www.angrau.ac.in), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్ (వెబ్‌సైట్: www.manage.gov.in), డాక్టర్ యశ్వంత్ సింగ్ పామర్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.yspuniversity.ac.in) వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి..
మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? కోర్సు వివరాలను తెలపండి?
+
మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగించే యంత్రాల (మెషీన్స్)కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాలను మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సులో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో మైనింగ్ కోసం ఉపయోగించే యంత్రాలు, ఖనిజాల వెలికితీత విధానాలను వివరిస్తారు. ఈ క్రమంలో మైనింగ్ మెథడ్స్ అండ్ మెషినరీ, మెకానిక్స్, ప్లానింగ్, మైన్ డెవలప్‌మెంట్, జియో మెకానిక్స్, గ్రౌండ్ కంట్రోల్, సర్ఫేస్ ఎన్విరాన్‌మెంట్, సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్ట్‌లను బోధిస్తారు. ధన్‌బాద్ (జార్ఖండ్)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్.. బీటెక్, ఎంటెక్ విభాగాల్లో మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా బీటెక్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. గేట్ ద్వారా ఎంటెక్ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు.
వివరాలకు: www.ismdhanbad.ac.in

కోర్సు పూర్తయిన తర్వాత మైనింగ్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మైనింగ్ ఇంజనీర్, జియ లాజికల్ ఇంజనీర్, మైనింగ్ మెకానిక్ ఆపరేటర్, మైనింగ్ సూపర్‌వైజర్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సేఫ్టీ మేనేజర్, మినరల్ సేల్స్ ఆఫీసర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు.

టాప్ రిక్రూటర్స్: భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్, భారత్ ఫ్రోగ్ లిమిటెడ్, కెయిర్న్ ఎనర్జీ, అదానీ మైనింగ్.
జెనెటిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • బయోటెక్నాలజీలో ఒక స్పెషలైజేషన్‌గా జెనెటిక్ ఇంజనీరింగ్‌ను బోధిస్తున్నారు. మెడిసిన్, డ్రగ్ డెవలప్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి వివిధ రంగాల్లో ఈ సబ్జెక్టు అప్లికేషన్స్ ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ను అందించే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే బీటెక్ బయోటెక్నాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్ సబ్జెక్టు ఉంటుంది.
  • తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం.. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఫిజిక్స్,కెమిస్ట్రీ,బయాలజీలతో ఇంటర్మీడియెట్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.srmuniv.ac.in

    బీటెక్ బయోటెక్నాలజీ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు:
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. బయోటెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/+2.
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. బయోటెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.cbit.ac.in
  • ఐఐటీ గువహటి (www.iitg.ac.in), ఐఐటీ రూర్కీ (www.iitr.ac.in), ఐఐటీ ఖరగ్‌పూర్ (www.iitkgp.ac.in) లు.. బయోటెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తు న్నాయి.
    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/+2
    ప్రవేశం: ఐఐటీజేఈఈలో ఉత్తీర్ణత ఆధారంగా.
ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బీఈ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.uceou.edu
  • ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కోర్సును మెకానికల్ ఇంజనీరింగ్‌కు అనుబంధంగా బోధిస్తున్నారు. బీటెక్‌లో మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంటెక్‌లో ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కోర్సును చదువుకోవచ్చు.
ఎంటెక్ అందిస్తున్న సంస్థల వివరాలు...
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పీజీఈసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jntuh.ac.in
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పీజీఈసెట్/ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత:
    బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పీజీఈసెట్‌లో ర్యాంకు ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.uceou.edu
ఉద్యోగావకాశాలు:
  • మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్ సంస్థల్లో ఉపాధి పొందవచ్చు.
  • ఆటోమొబైల్, ఏరోనాటికల్, షిప్‌బిల్డింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, అగ్రికల్చర్ /కన్‌స్ట్రక్షన్ పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించవచ్చు.
  • విధులు: ప్రొడక్షన్ ఇంజనీర్/సేఫ్టీ ఇంజనీర్/ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్/ప్లాంట్ ఇంజనీర్/మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్/ ప్రాసెస్ ఇంజనీర్.
బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెడికల్ ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తులను మెరుగుపరచటంలో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది.
  • మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీలో కూడా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
  • డిజిటల్ థర్మామీటర్, పేస్‌మేకర్, ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్, గ్లూకోమీటర్స్ వంటి వాటిని దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు.
  • మెడికల్ సెన్సైస్, క్లినికల్ సెన్సైస్, అనాటమీ, ఫిజియాలజీ, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైక్రో ప్రాసెసర్స్, సర్క్యూట్ అనాలిసిస్ వంటి వాటిని కరిక్యులంలో భాగంగా బోధిస్తారు.
  • బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెడికల్ ఎంబెడెడ్ సిస్టమ్స్, బయో మెటీరియల్స్, బయో-నానోటెక్నాలజీ, టిష్యూ ఇంజనీరింగ్, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.
కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌లు:
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తుంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2.
    ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.uceou.edu
మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.jntuhceh.ac.in
  • వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/10+2.
    ప్రవేశం: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.nitw.ac.in
ఉద్యోగావకాశాలు
  • మెటల్స్‌ను వెలికితీయటం, ప్రాసెసింగ్, ట్రేడ్ వంటి వాటి గురించి మెటలర్జికల్ ఇంజనీరింగ్ అధ్యయనం చేస్తుంది.
  • టాటా స్టీల్, సెయిల్, నాల్కో, స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, డీఎంఆర్‌సీ, ఇస్రో,డీఆర్‌డీవో, రైల్వే వంటి సంస్థల్లో ప్రధానంగా ఉద్యోగాలు పొందవచ్చు.
  • ఈ సంస్థలు ఎంట్రీ లెవల్ పోస్టులకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను రిక్రూట్ చేసుకుంటాయి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా ఇందులో కొలువు సొంతం చేసుకోవచ్చు.
  • బీడీఎల్, ఇస్రో వంటి కంపెనీల్లో మెటల్స్‌పై ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనలపై ఆసక్తి ఉంటే.. ఈ రంగంలో స్కిల్స్ పెంచుకొని, మంచి భవిష్యత్తు పెంపొందించుకోవచ్చు.
  • మంచి ఉద్యోగావకాశాల కోసం విద్యార్థులకు అకడమిక్ రికార్డు బాగుండాలి. సబ్జెక్టుకు మాత్రమే పరిమితం కాకూడదు. నాలెడ్జ్ పరిధిని విస్తృతం చేసుకోవాలి. దీనికి ఇంటర్నెట్‌ను వినియోగించుకోండి.
  • ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానం. దీనిపై అవగాహన పెంచుకొని, నైపుణ్యాలు సాధించాలి.
పీజీ స్థాయిలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎలాంటి స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి? ఏ స్పెషలైజేషన్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది?
+
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి అనేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మల్టీడిసిప్లినరీ సైన్స్ కిందకి వస్తాయి.
  • రోబోటిక్స్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ వంటి ఇంటర్ డిసిప్లినరీ సైన్స్‌ల సమ్మేళనంగా రోబోటిక్స్ ఉంటుంది. రోబోటిక్స్, మెకట్రోనిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వంటి స్పెషలైజేషన్స్ ద్వారా ఈ సబ్జెక్టు గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. రోబోటిక్ ఇంజనీర్లకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, రోబోటిక్స్, టూల్ డిజైన్, ఏవియేషన్ వంటి పరిశ్రమలు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి.
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్.
    ప్రవేశం: గేట్ పరీక్ష/ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • సీఏడీ/సీఏఎం: కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ).. కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి టూల్స్, మెషినరీ, బిల్డింగ్స్‌ను రూపొందించే అంశాలను వివరిస్తుంది. ఉత్పత్తుల తయారీలో కంప్యూటర్స్‌ను ఉపయోగించే మెషినరీని నియంత్రించే అంశాలను కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ (సీఏఎం) వివరిస్తుంది.
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, సీఏడీ/సీఏఎం స్పెషలైజేషన్‌తో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్.
    ప్రవేశం: గేట్/ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.uceou.edu
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, సీఏడీ/సీఏఎం స్పెషలైజేషన్‌తో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్.
    ప్రవేశం: గేట్/ప్రవేశపరీక్షలో, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • ఇండస్ట్రియల్ ఆటోమేషన్: సమతులమైన వనరులను ఉపయోగించి ఉత్పత్తి ఉత్పాదకత, నాణ్యతలను పెంచేందుకు పరిశ్రమల్లో మెషినరీని కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా నియంత్రించటమే ఇండస్ట్రియల్ ఆటోమేషన్. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ టెక్నాలజీస్ సమ్మిళితంగా ఉంటుంది.
  • బెలగావ్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.vtu.ac.in
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్: వెహికిల్స్ డిజైన్ చేయటం, వాటి భాగాలను రూపొందించటం, అసెంబుల్ చేయటం, భద్రత చూడటం, రిపేర్ చేయటం, నియంత్రించటం వంటి అంశాలను ఈ కోర్సు వివరిస్తుంది.
  • తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.annauniv.edu  
ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • పరిశ్రమల్లో ఉత్పత్తులను బయోటెక్నాలజీ పద్ధతులను ఉపయోగించి తయారుచేసే పద్ధతుల అధ్యయనమే ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ. పెయింట్లు, కెమికల్స్, డిటర్జెంట్లు, ఫుడ్, పేపర్, బయోఫ్యూయెల్స్, టెక్స్‌టైల్స్ వంటి వాటి తయారీలో ఈ పద్ధతులను ఉపయోగిస్తారు.
  • కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను అందిస్తోంది. ఇందులో బయోప్రాసెస్ ఇంజనీరింగ్, మాలిక్యులార్ బయాలజీ అండ్ డీఎన్‌ఏ టెక్నాలజీ, బయోరియాక్టర్ డిజైన్ అండ్ అనాలిసిస్, బయోఫ్యూయల్ ఇంజనీరింగ్, ఇమ్యూనోటెక్నాలజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, బయోపాలిమర్ టెక్నాలజీ, బయోనానోటెక్నాలజీ వంటి సబ్జెక్టులు ఉంటాయి.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.manipal.edu
  • తమిళనాడులోని శస్త్ర విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.sastra.edu
  • తమిళనాడులోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.drmgrdu.ac.in
జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • సివిల్ ఇంజనీరింగ్‌లో ఒక విభాగం.. జియోటెక్నికల్ ఇంజనీరింగ్. దీని అధ్యయనం ద్వారా భూమి, శిలలు వంటి వాటిపై అవగాహన వస్తుంది. సాయిల్ డైనమిక్స్, ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్, మెషీన్ ఫౌండేషన్స్, సాయిల్ స్టెబిలైజేషన్, రీయిన్‌ఫోర్స్‌డ్ ఎర్త్, జియో సింథెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ జియో టెక్నిక్ వేస్ట్ డిస్పోజల్, అన్‌సాచ్యురేటెడ్ సాయిల్ మెకానిక్స్, రాక్ మెకానిక్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.
  • చెన్నైలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్.. జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్ స్కోర్ ఆధారంగా.
    వెబ్‌సైట్: www.civil.iitm.ac.in
  • కోల్‌కతాలోని వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.wbut.ac.in
  • కాలికట్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.universityofcalicut.info
నానోఎలక్ట్రానిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత: కెమికల్/మెకానికల్/ ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ బయోటెక్నాలజీ/ మెటీరియల్ సైన్స్‌లలో బీఈ/బీటెక్ లేదా కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బయోటెక్నాలజీ/ ఎర్త్ సెన్సైస్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లలో ఎంఎస్సీ లేదా తత్సమానం.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.jntuh.ac.in
  • అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.jntua.ac.in
  • తంజావూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.sastra.edu
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను అందించే సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
+
  • హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కొన్ని కళాశాలలు అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తున్నాయి.
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ - బాపట్ల
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ - మడకశిర
  • కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ - సంగారెడ్డి
    అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్/తత్సమానం.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.angrau.ac.in
  • ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ రంగాల్లోని వ్యవసాయ సంస్థల్లో పరిశోధనలు చేయవచ్చు. అగ్రికల్చరల్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఇన్‌స్పెక్టర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్‌లో ఉన్న సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. పరిశోధకుల కోసం పరీక్షలు నిర్వహిస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రాలు వంటి సంస్థల్లో ట్రెయినింగ్ ఆర్గనైజర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాలు చేపట్టవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్, అగ్రికల్చరల్ ఫైనాన్స్ ఆఫీసర్స్ వంటి విధులు నిర్వర్తించవచ్చు. ప్రైవేటు వ్యవసాయ సంస్థల్లో ఆర్ అండ్ డీ విభాగంలో ఉద్యోగాలు చేయవచ్చు.
బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా మెడికల్ ఉత్పత్తుల అభివృద్ధిలో ఇంజనీరింగ్ పరిజ్ఞానం అప్లికేషన్స్ ఉపయోగించటంలో నేర్పు అలవడుతుంది. మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ, వాడే విధానం, హెల్త్ మెయింటెనెన్స్ ప్రాసెస్ వంటి వాటిపై అవగాహన వస్తుంది. పేస్‌మేకర్, డిజిటల్ థర్మామీటర్స్,ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ మెషీన్లు, గ్లూకోమీటర్స్.. కొన్ని బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు.
  • కరిక్యులంలో మెడికల్ సెన్సైస్, క్లినికల్ సెన్సైస్, అనాటమీ, ఫిజియాలజీ, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైక్రో ప్రాసెసర్స్, సర్క్యూట్ అనాలిసిస్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, బయోమెకానిక్స్, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెడికల్ ఎంబెడెడ్ సిస్టమ్స్, బయోమెటీరియల్స్, బయోనానో టెక్నాలజీ, టిష్యూ ఇంజనీరింగ్, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
  • హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, కేపీఓ, పరిశోధనాత్మక సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, విప్రో, సీమన్స్ మెడికల్, జీఈ హెల్త్ కేర్, ఎల్ అండ్ టీ మెడికల్, ఫిలిప్స్ మెడికల్, బీపీఎల్ మెడికల్, నోవార్టిస్ హెల్త్‌కేర్ వంటివి ఈ విభాగంలో టాప్ రిక్రూటర్లుగా ఉన్నాయి.
  • విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: గేట్/పీజీసెట్/ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంఈ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్:  www.osmania.ac.in
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏటా రెండుసార్లు అసోసియేట్ మెంబర్‌షిప్ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో సెక్షన్-ఏ, బీలలో అర్హత సాధిస్తే ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌తో సమానం. ఈ పరీక్షకు భారత ప్రభుత్వం, యూకేలో లండన్‌లోని ఇంజనీరింగ్ కౌన్సిల్‌ల గుర్తింపు ఉంది. ఈ రెండు సెక్షన్‌లలో ఉత్తీర్ణులైన వారు గేట్ పరీక్ష రాయడానికి అర్హులు.
    అర్హత: సెక్షన్-ఏకు ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియెట్/10+2.
    ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీకి గ్రాడ్యుయేట్ మెంబర్స్‌గా ఎన్నికవుతారు.
    వెబ్‌సైట్:  www.aerosocietyindia.in
  • జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పలు ప్రైవేటు కళాశాలల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది.
    అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా.
    వెబ్‌సైట్లు:  www.osmania.ac.inwww.jntuh.ac.in
పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఎలక్టివ్ సబ్జెక్టుగా కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశాలు: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అల్-హబీబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.. పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.alhabeebcollege.ac.in
  • తూర్పుగోదావరిలో సూరెంపాలెంలోని శ్రీ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. పెట్రోలియం టెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.sriaditya.edu.in

ఉద్యోగావకాశాలు:
  • ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్, ప్రొడక్షన్, రిజర్వాయిర్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పెట్రోలియం ఇంజనీరింగ్‌లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ రంగంలో టాప్ సంస్థలు.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. ఏవియేషన్, అంతరిక్ష పరిశోధన, రక్షణ వ్యవస్థలకు మూలాధారం. దీని అధ్యయనం ద్వారా శాటిలైట్స్, మిసైల్స్, స్పేస్‌క్రాఫ్ట్, హెలికాఫ్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్‌ను డిజైనింగ్, నిర్మాణం, మెయింటెనెన్స్ నైపుణ్యాలు వస్తాయి.
  • హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.jntuh.ac.in

  • బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
    అర్హత: ఏరోస్పేస్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్ ఇంజనీరింగ్.
    ప్రవేశం: గేట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.iisc.ernet.in

  • పూణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో గెడైడ్ మిసైల్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏరోనాటికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్.
    ప్రవేశం: గేట్/సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.diat.ac.in

ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ రంగ సంస్థలు, సివిల్ ఏవియేషన్ రంగం, పరిశోధనాత్మక రంగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ వంటి సంస్థల్లో ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు ఉంటాయి.
బయోఇన్ఫర్మేటిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
  • విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: బీఈ/బీటెక్/బీఆర్క్ లేదా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్/మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్/ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ లేదా ఎంసీఏ.
    ప్రవేశం: గేట్/ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

  • హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ).. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సీఎస్/ ఐటీ/బయోటెక్నాలజీ/ బయోఇన్ఫర్మేటిక్స్‌లో బీఈ/బీటెక్ లేదా ప్రోగ్రామింగ్/మ్యాథమెటిక్స్/ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.iiit.ac.in

  • హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: 60 శాతం మార్కులతో బీఫార్మసీ/ బీటెక్ లేదా 55 శాతం మార్కులతో బయలాజికల్/అగ్రికల్చరల్ / ఫిజికల్/ కెమికల్/ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీ.
    ప్రవేశం: గేట్ ర్యాంకు/ ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.uohyd.ac.in
బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
బయోమెడికల్ ఇంజనీరింగ్.. ఇది బయాలజీ, టెక్నాలజీల సమ్మేళనం. మెడికల్ రంగంలో ఇంజనీరింగ్‌ను ఉపయోగించి తయారుచేసిన ఉత్పత్తులు.. డిజిటల్ థర్మామీటర్, పేస్‌మేకర్, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ మెషీన్లు, గ్లూకోమీటరు. ఇందులో మెడికల్, క్లినికల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైక్రోప్రాసెసర్ల లాంటి సబ్జెక్టులు ఉంటాయి. బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెస్, మెడికల్ ఎంబెడెడ్ సిస్టమ్స్,బయోమెకానిక్స్, మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బయో మెటీరియల్స్, బయో-నానో టెక్నాలజీ, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ లాంటి స్పెషలైజేషన్లు ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి.

  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
    అర్హత:
    సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in

  • హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.osmania.ac.in

ఉద్యోగావకాశాలు: మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉద్యోగాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆసుపత్రులు, డయాగ్నాస్టిక్ సెంటర్లు, పరిశోధన సంస్థలు, కేపీఓల్లో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్, విప్రో, సెమైన్స్ మెడికల్, జీఈ హెల్త్‌కేర్, ఎల్ అండ్ టీ మెడికల్, ఫిలిప్స్ మెడికల్, బీపీఎల్ మెడికల్, నోవార్టిస్ హెల్త్‌కేర్ లాంటి కంపెనీలు బయోమెడికల్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తయింది. ఏ విధమైన షార్ట్ టర్మ్ కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయో వివరించండి?
+
ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్(పీఎల్‌సీ).. ఎలక్ట్రో మెకానికల్ ప్రాసెస్‌లను నియంత్రిస్తుంది. సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజిషన్(ఎస్‌సీఏడీఏ).. పరిశ్రమల్లో పర్యవేక్షణకు, మౌలిక వసతులను, మెషినరీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. వీటిపై శిక్షణ తీసుకోవడం ద్వారా అవకాశాలు మెరుగవుతాయి.
  • హైదరాబాద్‌లోని ప్రొలిఫిక్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్.. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ విభాగంలో శిక్షణ ఇస్తుంది. దీనికి సర్టిఫికెట్ కూడా అందిస్తుంది.ఈ ప్రోగ్రామ్‌లో పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏ లాంటి అంశాలు ఉంటాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్స్ కూడా అందిస్తోంది.
    అర్హత: ఈ విభాగంలో డిగ్రీ ఉన్నవారు, పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
    వెబ్‌సైట్: www.plcscadatraining.com

  • హైదరాబాద్‌లో రామాంతపూర్‌లోని జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రెయినింగ్‌లోని అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్.. పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏల్లో శిక్షణ అందిస్తుంది.
    అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
    వెబ్‌సైట్: www.atiepihyderabad.gov.in
బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?
+
ఉన్నత విద్యావకాశాలు: టెక్నాలజీని ఉపయోగిస్తూ జీవకణాల స్వభావం, ప్రవర్తనల్లో మార్పును తీసుకురావడం గురించి బయోటెక్నాలజీ అధ్యయనం చేస్తుంది. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్‌ల కలయికే బయోటెక్నాలజీ. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రగ్స్ డెవలప్‌మెంట్, వేస్ట్ మేనేజ్‌మెంట్, పర్యావరణ పరిరక్షణ లాంటి వాటిలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. బయోటెక్నాలజీ అనేది పరిశోధనలకు సంబంధించిన అంశం. పరిశోధనలపై మక్కువ పెంచుకోవడం ద్వారా ఇందులో ఉన్నత అవకాశాలు స్వాగతం పలుకుతాయి. బీటెక్ తర్వాత ఎంటెక్ చేసి ఆసక్తి ఉన్న రంగంలో పీహెచ్‌డీ చేస్తూ పరిశోధనల వైపు మళ్లితే అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎంటెక్‌లో బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, మెడికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ లాంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు. ఇక బీటెక్ బయోటెక్నాలజీకి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్న మరో అవకాశం.. బయోటెక్నాలజీలో ఎంబీఏ.

ఉద్యోగావకాశాలు: డ్రగ్ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్, కెమికల్స్, టెక్స్‌టైల్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, బయో ప్రొడక్ట్స్, న్యూట్రిషన్, పర్యావరణ పరిరక్షణ లాంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎంబెడెడ్ సిస్టమ్స్ సబ్జెక్టును అందించే ఇన్‌స్టిట్యూట్ల వివరాలు తెలపండి?
+
ఎంబెడెడ్ సిస్టమ్స్‌ను మాస్టర్స్, డిప్లొమా స్థాయిలో ఒక సబ్జెక్టుగా అనేక సంస్థలు అందిస్తున్నాయి.
  • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్(వీఎల్‌ఎస్‌ఐ), ఎంబెడెడ్ సిస్టమ్స్ సబ్జెక్టులలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: బీటెక్/బీఈ(ఈసీఈ)
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.iiit.ac.in
  • తమిళనాడులోని కలాసలింగం యూనివర్సిటీ.. ఎంబెడెడ్ సిస్టమ్ టెక్నాలజీలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: బీటెక్/బీఈ
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.kalasalingam.ac.in
  • హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్).. ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ లేదా కనీసం 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ సెన్సైస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్.
    ప్రవేశం: సీడాక్ అడ్మిషన్ టెస్టులో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.cdachyd.in
  • హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.. ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: ఏదైనా స్ట్రీమ్ నుంచి బీటెక్
    ప్రవేశం: గేట్ స్కోర్ ఆధారంగా. గేట్ స్కోర్ లేని అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
    వెబ్‌సైట్: www.vnrvjiet.ac.in
థర్మల్ ఇంజనీరింగ్ కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి ?
+
  • ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. థర్మల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సు అందిస్తోంది.
    అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్
    ప్రవేశం: గేట్ స్కోర్ ఆధారంగా.
    వెబ్‌సైట్: mech.iitd.ac.in
  • ఒడిశాలోని బిజూ పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ... థర్మల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సు అందిస్తోంది.
    అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బీటెక్ డి గ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.bput.ac.in
  • రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. థర్మల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    వెబ్‌సైట్:  www.nitrr.ac.in
బయోఇన్ఫర్మేటిక్స్ కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
బయోఇన్ఫర్మేటిక్స్ కోర్సులో కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి బయోలాజికల్ డేటాను సేకరించటం, భద్రపరచటం, డేటాను విశ్లేషించటం వంటి అంశాలు ఉంటాయి.

కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు
  • విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. బయో ఇన్ఫర్మేటిక్స్ స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్/ అప్లయిడ్ మ్యాథ్స్/ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ
    ప్రవేశం: గేట్ స్కోర్ ఆధారంగా
    వెబ్‌సైట్: www.andhrauniversity.info
  • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ).. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
    అర్హత: సీఎస్/ ఐటీ/ బయోటెక్నాలజీ/ బయోఇన్ఫర్మేటిక్స్‌లో బీఈ/బీటెక్ లేదా మ్యాథ్స్/సైన్స్/పోగ్రామింగ్‌లలో మాస్టర్ డిగ్రీ.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
    వెబ్‌సైట్: www.iiit.ac.in
  • హైదరాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. బయోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.uohyd.ac.in
ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
ఇండస్ట్రియల్ మెషినరీ, ప్రాసెసస్‌లకు సంబంధించిన కంట్రోల్ సిస్టమ్స్ అధ్యయనమే ఇండస్ట్రియల్ ఆటోమేషన్.

ఈ కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...
  • బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌లలో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్: http://vtu.ac.in
  • లక్నోలోని ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పార్ట్‌టైం ఎంటెక్ కోర్సు ను ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో ఇండస్ట్రియల్ సిస్టం ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్ ఉంటుంది.
    వెబ్‌సైట్: http://www.uptu.ac.in
  • కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రాని క్స్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ.. ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో పీజీ డిప్లమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్ ఇంజనీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/మెకట్రోనిక్స్/కంప్యూటర్ సైన్స్‌లలో బీఈ/బీటెక్.
    ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
    వెబ్‌సైట్: www.doeacccalicut.ac.in
  • హైదరాబాద్‌లోని ప్రొలిఫిక్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ.. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ ట్రైయినింగ్‌ను ఇస్తూ సర్టిఫికేట్స్ అందిస్తోంది. ఈ కోర్సులో ఎస్‌సీఏడీఏ సాఫ్ట్‌వేర్‌ను కవర్ చేయడంతో పాటు లీడింగ్ బ్రాండ్స్‌పై శిక్షణ ఇస్తారు.
    వెబ్‌సైట్: www.plcscadatraining.com  

ఉద్యోగావకాశాలు:
  • ఆటోమొబైల్ రంగం; కెమికల్ రంగం; బాటిలింగ్ రంగం; గ్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగం; పవర్ జనరేషన్ రంగం; క్రాఫ్ట్ మాన్యుఫాక్చర్ రంగం
ఐఐటీ కాన్పూర్ అందిస్తోన్న బీటెక్లో బయలాజికల్ సైన్స్, బయో ఇంజనీరింగ్ కోర్సుల వివరాలను తెలపండి?
+
బయలాజికల్ సైన్స్, బయో ఇంజనీరింగ్ కోర్సులు బయో మెడికల్ ఇంజనీరింగ్, డ్రగ్ డిజైన్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో టెక్నాలజీ, జీనోమిక్స్ రంగాల్లో రాణించేందుకు ఉపయోగపడతాయి.

ఈ కోర్సుల్లో బయో నానోటెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో ఫార్మా స్యూటికల్స్, బయో ఎలక్ట్రిసిటీ, బయో కెమిస్ట్రీ, బయో మెకానిక్స్, ఇమ్యూనాలజీ, న్యూరో బయోల జీ, జీనో మిక్స్‌లు ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి.

అర్హత: 10+2.
ప్రవేశం: ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.

వెబ్‌సైట్: www.iitk.ac.in
ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ల గురించి వివ రించండి?
+
పరిశ్రమల యాంత్రిక వ్యవస్థను నియంత్రించడమే ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఉత్పత్తి, నాణ్యత పెంచడం, ఉత్పాదకత, నిర్వహణ వ్యయాల్ని నియంత్రించడంలో ఇది తోడ్పడుతుంది. ఇందులో స్పెషలైజేషన్ చేసినవారికి ఆటోమొబైల్, కెమికల్, గ్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్, పవర్ జనరేషన్, ఎయిర్ క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చర్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి.
  • బెల్గావ్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్‌లో ఎం.టెక్ కోర్సును అందిస్తోంది.
    వెబ్‌సైట్:
    https://vtu.ac.in
     
  • లక్నోలోని ఉత్తర ప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ సిస్టమ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌గా మెకానికల్ ఇంజనీరింగ్‌లో పార్ట్‌టైమ్ ఎం.టెక్‌ను ఆఫర్ చేస్తోంది.
    వెబ్‌సైట్: https://www.uptu.ac.in  

  • కాలికట్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో పీజీ డిప్లొమా అందిస్తోంది.
    అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ కెమికల్ ఇంజనీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కం ట్రోల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకాట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లో బీఈ లేదా బీటెక్.
    ప్రవేశం: రాతపరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికపై ఉంటుంది.
    వెబ్‌సైట్: www.doeaccclicut.ac.in  

  • హైదరాబాద్‌లోని ప్రొలిఫిక్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ కూడా వీటికి అనుబంధ కోర్సులను అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.plcscadatraining.com
బీటెక్ (ఈఈఈ) తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
+
బీటెక్ (ఈఈఈ) తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. ఎంఈ/ ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్ కోసం కూడా గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో పీజీఈసెట్ ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. మరో అవకాశం యూపీఎస్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్). ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు.

వివరాలకు:  www.upsc.gov.in
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్ ఎలా ఉంటుందో వివరిస్తారా?
+
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సును సివిల్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. బిల్డింగ్ సైన్స్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్, కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ అనేవి దీనిలో ప్రధాన అంశాలు. కోర్సు చేసిన వారికి నిర్మాణ రంగంలో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.
  • స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)-ఢిల్లీ లు సివిల్ ఇంజనీరింగ్‌లో దూరవిద్య విధానంలో ఈ కోర్సును అందిస్తున్నాయి.
    అర్హతలు:
    సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్/ ఆర్కిటెక్చర్/ కెమికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా. దీంతోపాటు అభ్యర్థి తన కోర్సుకు అనుబంధఉద్యోగం గానీ స్వయం ఉపాధి గానీ పొందుతున్న వారై ఉండాలి.
    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు (నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి). మొదటి రెండు మాడ్యూల్స్‌ను పూర్తి చేసిన వారు అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ (ఏడీసీఎం)కు అర్హులవుతారు. ప్రతి వారం నిర్వహించే తరగతులకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.ignou.ac.in
  • జేఎన్‌టీయూ,హైదరాబాద్ కూడా ఈ కోర్సును బీటెక్‌లో భాగంగా నడిపిస్తోంది. కరస్పాండెన్స్-కమ్- కాంటాక్ట్ విధానంలో ఉద్యోగం చేస్తున్నవారికే ఈ కోర్సును అందిస్తున్నారు.
    అర్హత:
    సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచిలో డిప్లొ మా. అలాగే అభ్యర్థి కోర్సుకు అనుబంధ ఉద్యోగం గానీ, ఏదో పనిగానీ చేస్తుండాలి. ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.jntu.ac.in
  • హైదరాబాద్‌లోని ఎన్‌ఐసీఎంఏఆర్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ స్టాఫ్ కాలేజ్ కూడా అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీని స్వల్పకాలిక / దూరవిద్య విధానంలో అందిస్తోంది.
    అర్హత:
    ఇంజనీరింగ్ / ఆర్కిటెక్చర్ / కన్‌స్ట్రక్షన్ ప్లానింగ్ గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం ఉత్తీర్ణత.
    ఎంపిక: ప్రవేశ పరీక్ష, బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలో కనబరిచిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.nicmar.ac.in
ఐఐటీ -గువహతిలో బీటెక్ (మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్) కోర్సు వివరాలను తెలపండి?
+
బీటెక్ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) కోర్సును ఇటీవలే పరిచయం చేశారు. ఇందులోని పాఠ్యాంశాల్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పరిశీలనలు, ఆవిష్కరణలకు అనుగుణంగా రూపొందించారు. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ప్రధాన సబ్జెక్టులు. కోర్సు పూర్తి చేసిన వారికి ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ సర్వీస్, కన్సల్టెన్సీ, పరిశోధన, విద్యాసంస్థల్లో అపార అవకాశాలు ఉంటాయి. ఐఐటీ-గువహతి, ఐఐటీ-వారణాసి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తోంది.
అర్హత: 10+2. ఐఐటీ-జేఈఈలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
వెబ్‌సైట్: www.iitg.ac.in/, www.iitbhu.ac.in/
ఎంటెక్-బయో ఇన్ఫర్మేటిక్స్‌లో కెరీర్ ఎలా ఉంటుంది?
+
ఎంటెక్-బయో ఇన్ఫర్మేటిక్స్ తో బయో టెక్నాలజీ, ఫార్మా స్యూటికల్, బయో మెడికల్ సెన్సైస్, హాస్పిటల్స్, పరి శోధన సంస్థల్లో స్థిరపడొచ్చు. డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ ఫార్మాకాలజిస్ట్, అనలిస్ట్, కంప్యూటేషనల్ కెమిస్ట్‌గా ఉద్యోగాలూ పొందవచ్చు.

  • విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎంటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ స్పెషలైజేషన్‌ను అందిస్తోంది.
    అర్హత:
    బీఈ / బీటెక్/ బీఆర్క్ / ఎంఎస్సీ ఇన్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్/మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథ మెటిక్స్/ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ స్టాటిస్టిక్స్ లేదా ఎంసీఏ. గేట్ ప్రవేశపరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందవచ్చు.
    వెబ్‌సైట్:  www.andhrauniversity.info
  • ఐఐఐటీ-హైదరాబాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలు కూడా ఎంటెక్‌లో బయో ఇన్ఫర్మేటిక్స్‌ను అందిస్తున్నాయి.
    అర్హతలు:
    బీఈ/బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్/ఐటీ/ బయో టెక్నాలజీ/ బయో ఇన్ఫర్మేటిక్స్/ మాస్టర్స్‌డిగ్రీ ఇన్ ప్రోగ్రామింగ్/మ్యాథ మెటిక్స్/ సెన్సైస్.
    ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    వెబ్‌సైట్:  www.iiit.ac.inwww.uohyd.ernet.in
బీటెక్‌లో ఈఈఈ పూర్తి చేశాను. సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలంటే ఏ కోర్సు చేస్తే బాగుంటుంది?
+
సాఫ్ట్‌వేర్ రంగంలో చేరాలంటే రెండు మార్గాలు ఉన్నా యి. వీటిలో లాంగ్వేజ్, లేదా ఆర్కిటెక్చర్ సంబంధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లోని షార్ట్ టెర్మ్ కోర్స్ ఒకటి. ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్ సంస్థలు దీన్ని అందిస్తున్నాయి.
రెండో మార్గం: కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్. విశాఖపట్టణంలోని గీతం యూనివర్సిటీ ఈ కోర్సును నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష, పని అనుభవంలో
కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
వెబ్‌సైట్:  www.gitam.edu

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిసిప్లైన్‌లలో ఎంటెక్ కోర్సును నిర్వహిస్తోంది. గేట్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
వెబ్‌సైట్:  www.uohyd.ernet.in
ఆర్మీలో ఇంజనీర్ కావాలని ఉంది. ఎలా సాధ్యం?
+
ఆర్మీలో ఇంజనీర్‌గా చేరాలనుకునే పురుష అభ్య ర్థులకు ఈ విధంగా ప్రవేశాలు ఉంటాయి.
  • షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్, టీజీసీ (ఇంజనీర్స్): ఏడాదికి రెండుసార్లు ఇందులో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడుతుంది.
    అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ. వయసు: 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ 49 వారాలు, టీజీసీ వారు ఏడాది పాటు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్: యూనివర్సిటీ స్థాయిలో ఐదు రోజులపాటు ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఈ ఐదు రోజుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీటు లభిస్తుంది.
    వయసు: 19-25 ఏళ్లు
    అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ. ఎంపికైన వారికి డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ ఇస్తారు.

    వెబ్‌సైట్: joinindianarmy.nic.in
పీజీ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబాటులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
+
పెట్రోలియం ఇంజనీర్ అభ్యర్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోలియం, సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడమనే మాట తలెత్తదు. డిమాండ్ పెరగడం అంటే తదనుగుణంగా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే భావించాలి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. పీజీ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..

  • యూనివర్సిటీ ఆఫ్ పుణే, ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు.
    వివరాలకు:  www.unipune.ac.in
  • రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ-రాయ్‌బరేలీ, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: సంబంధిత అంశంలో బీటెక్. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది.
    వివరాలకు:  www.rgipt.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్- డెహ్రాడూన్, ఎంటెక్ (పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్) కోర్సును అందిస్తుంది. అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్ (కెమికల్/మెకానికల్) లేదా ఎంఎస్సీ (జియాలజీ/జియోఫిజిక్స్/ ఫిజిక్స్). అదేవిధంగా సీనియర్ సెకండరీ స్థాయిలో కూడా 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
    వివరాలకు:  www.upes.ac.in
  • పీఓజీఎల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పెట్రోలియం అండ్ ఎనర్జీ డెవలప్‌మెంట్-గువహటి, ఎంఎస్సీ (పెట్రోలియం, పలు స్పెషలైజేషన్‌‌సతో) కోర్సును ఆఫర్ చేస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
    వివరాలకు: poglinstitute.org
ఎంటెక్‌ (ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌) పూర్తి చేశాను. కెరీర్‌ ఉన్నతి కోసం దూరవిద్యా విధానంలో చేయదగ్గ కోర్సులను తెలపండి?
+
ముందు మీరు ఎంచుకున్న కోర్సుకు అనుగుణమైన జాబ్‌లో చేరండి. దానిలో కొంత అనుభవం గడించిన మీదట ఏ కోర్సు చేస్తే కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చనే విషయం అవగతమవుతుంది. దాని ఆధారంగా టెక్నికల్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, మేనేజిరియల్‌ స్కిల్స్‌లో ఏది అవసరమో దాన్ని ఎంచుకోండి. కోర్సును ఎంపిక చేసుకునే ముందు జాబ్‌ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం సీనియర్ల సలహాలను కూడా తీసుకోవచ్చు.
మీ జాబ్‌తో కంపెనీ సంతృప్తి చెంది.. ఉన్నత విద్యనభ్యసిస్తే మరింత ఉపయోగపడతారని భావిస్తే కంపెనీయే ఆ దిశగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మొదట ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఏదైనా లోపం వల్ల ఉద్యోగ సాధనలో విఫలమవుతుంటే ముందు దాన్ని సవరించుకునే విధంగా షార్ట్‌టర్మ్‌ కోర్సు చేయడం మంచిది.
ఈఈఈ (ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) లో డిప్లొమా చేశాను. ఇంజనీరింగ్‌ డిగ్రీ చేయూలనుకుంటున్నాను. బీఈని డిస్టెన్స్‌ విధానంలో అందించే యూనివర్సిటీల వివరాలు తెలపండి?
+
ఇంజనీరింగ్‌ను దూరవిద్య విధానం ద్వారా చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ(జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ) కరస్పాండెన్స్‌ కమ్‌ కాంటాక్ట్‌ విధానం ద్వారా బీటెక్‌ కోర్సును అందిస్తోంది. ఈసీఈ, సివిల్‌, ఈఈఈ, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌లను ఆఫర్‌ చేస్తోంది. సంబంధిత బ్రాంచిలో డిప్లొమా చేసిన వారు అర్హులు.
ఇతర వివరాలకు www.jntu.ac.in చూడొచ్చు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను ఆఫర్‌ చేస్తోంది. సివిల్‌ ఇంజనీరింగ్‌ కోసం గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌ లేదా తత్సమాన విద్యా సంస్థ నుంచి సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/కంప్యూటర్‌/ఆర్కిటెక్చర్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌ లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కలిగి ఉండాలి. అలాగే మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో చేరేందుకు మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/అగ్రికల్చర్‌/కంప్యూటర్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌ మెుదటి సంవత్సరం పూర్తి చేసి ఉండాలి లేదా అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా/ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంటిగ్రేటెడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ చేసి ఉండాలి. అభ్యర్ధి కేంద్ర లేదా రాష్ట్ర స్థారుు పారిశ్రామిక సంస్థ/ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉండాలి. ఇతర వివరాలకు www.ignou.ac.in చూడొచ్చు.
రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ యూనివర్సిటీ (జైపూర్‌) బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్‌, ఆటోమెుబైల్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ను ఆఫర్‌ చేస్తోంది. అభ్యర్ధి ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.rvduniversity.com.
పై కోర్సులన్నిటికీ అభ్యర్ది కాంటాక్ట్‌ క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగ, వృత్తుల్లో కొనసాగుతున్నవారి కోసం ఉద్దేశించిన కోర్సులు కాబట్టి సాధారణంగా తరగతులను శని, ఆదివారాలు, ఉదయం, సాయంత్రం లేదా సెలవు దినాల్లో నిర్వహిస్తారు.
నానో టెక్నాలజీకి కోర్సుకు సంబంధించిన వివరాలు తెలపండి?
+
పరిశోధనల పరంగా విస్తృత పరిధి ఉన్న రంగం నానోటెక్నాలజీ. అణు, పరమాణువుల సమ్మేళనమే నానో టెక్నాలజీ. దీని అనువర్తనాలను ఎలక్ట్రానిక్స్‌, నేర పరిశోధన, ఔషధ, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో వినియోగిస్తారు. నానో టెక్నాలజీలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్‌ తదితర అంశాలుంటాయి.
మన రాష్ట్రంలో నానో టెక్నాలజీని ఆఫర్‌ చేస్తున్న సంస్థలు: శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, పుట్టపర్తి ఎంఎస్సీ (నానో సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ). వెబ్‌సైట్‌: www.sssu.edu.in
జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ ఎంటెక్‌(నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ). గేట్‌ స్కోర్‌/రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం. వెబ్‌సైట్‌: www.jntu.ac.in
అమిటీ యూనివర్సిటీ,నోయిడా ఎంఎస్సీ నానోసైన్స్‌, ఎంటెక్‌ నానో టెక్నాలజీ డ్యూయల్‌ డిగ్రీని అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.amity.edu
భారతీయార్‌ యూనివర్సిటీ పీజీ డిప్లొమా ఇన్‌ నానోటెక్నా లజీని ఆఫర్‌ చేస్తోంది. వెబ్‌సైట్‌: www.bu.ac.in.
ఇంటర్‌ ఎం-బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఎన్విరాన్‌మె ంటల్‌ స్టడీస్‌లో డిగ్రీ చేయూలని ఉంది. వైజాగ్‌లో ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్న కాలేజీలేవి?
+
ఎన్విరాన్‌మెంటల్‌ సెన్సైస్‌లో కెరీర్‌ను వృద్ధి చేసుకోవాలనుకుంటే బీఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) లేదా బీఈ/బీటెక్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ చేయవచ్చు. ఈ కోర్సుల తర్వాత ఈ సబ్జెక్టులో ఎంఎస్సీ లేదా ఎంటెక్‌ చేసి పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. విశాఖపట్నంలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఆఫర్‌ చేసే విద్యా సంస్థల వివరాలు...
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం బీటెక్‌ సివిల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ను ఆఫర్‌ చేస్తోంది. అలాగే యూనివర్సిటీ ఎంఎస్సీ అపై ్లడ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులను అందిస్తోంది. అపై ్లడ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీకి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా అపై ్లడ్‌ కెమిస్ట్రీ అభ్యర్ధులు, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌కు బీఎస్సీ కెమిస్ట్రీ (ఏదేని రెండు లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టులు ఆప్షనల్స్‌గా ఉండాలి)/బీఈఎం/ బీఎస్సీ(అగ్రికల్చర్‌)/బీఎస్సీ(వొకేషనల్‌) ఫుడ్‌ సైన్స్‌,క్వాలిటీ కంట్రోల్‌ అభ్యర్ధులు అర్హులు. వివరాలకు www.andhrauniversity.info చూడొచ్చు.
గీతం యూనివర్సిటీ, గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, విశాఖపట్నం బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌), ఎంఫిల్‌, పీహెచ్‌డీలను ఆఫర్‌ చేస్తోంది. వెబ్‌సైట్‌: www.gitam.edu.