Skip to main content

మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడమెలా? కోర్సు పూర్తయితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?

- ఎం.ఈశ్వర్, రాజమండ్రి.
Question
మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడమెలా? కోర్సు పూర్తయితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీ..  ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ.. నాలుగేళ్ల బీటెక్  మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. కోల్‌కతా, చెన్నై, ముంబై క్యాంపస్‌ల్లో ఈ కోర్సు ఉంది. ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. దీంతోపాటు ముంబై క్యాంపస్‌లో ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది.
  • ముఖ్యంగా మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా ఓడల తయారీ, డిజైన్, ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఓడలు, వాటికి సంబంధించిన యంత్రాల తయారీపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. మెరైన్ ఇంజనీర్లకు మర్చెంట్ నేవీలో అవకాశాలు లభిస్తారుు. ఓడలకు సంబంధించి యంత్రాల పనితీరు నిర్వహణ బాధ్యత వీరిదే. ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో అన్ని రకాల ఇంజన్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రపల్సివ్ ఇంజన్ల పనితీరుతోపాటు సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ కూడా మెరైన్ ఇంజనీర్‌లే చూడాల్సి ఉంటుంది. ఓడ సురక్షిత ప్రయాణంలో మెరైన్ ఇంజనీర్ల పాత్ర కీలకం.
  • షిప్పింగ్ కంపెనీలు, ఇండియన్ నేవీ, షిప్‌యార్డ్‌లు, షిప్ ఇంజన్ తయారీ కంపెనీలు, షిప్ డిజైనింగ్, పరిశోధన సంస్థల్లో మెరైన్ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు లభిస్తారుు. కోర్సు పూర్తయ్యాక నైపుణ్యాలుంటే.. సంవత్సరానికి రూ.4లక్షల ప్రారంభ వేతనంతో కెరీర్ మొదలవుతుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా రూ.20 లక్షలకు పైగా ఆర్జించే అవకాశముంది.

Photo Stories